Top News
సామాజికసారథి, అలంపూర్: నాగర్ కర్నూల్ ఎంపీగా డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మించిన ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్, బీజేపీలో ఎవరూ లేరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గెలిపిస్తే రేవంత్ రెడ్డికి ఇచ్చిన డబ్బు సంచులు ఢిల్లీలో పంచడానికి పనికొస్తాడని విమర్శించారు. ప్రవీణ్ కుమార్ ను గెలిపిస్తే పేదల కష్టాలు తీర్చడానికి పార్లమెంట్ లో ప్రజల గొంతుక అవుతారని అన్నారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ […]
సామాజికసారథి, కొడంగల్/నాగర్ కర్నూల్ బ్యూరో: పాలమూరుకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కమీషన్ల కక్కుర్తితో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉందన్నారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, రాజోలిబండ, తుమ్మిళ్ల ప్రాజెక్టుల వద్ద కుర్చీ వేసుకుని పనులు పూర్తిచేస్తానని చెప్పిన కేసీఆర్.. సీఎం అయిన తర్వాత ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరులో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశంలో […]
సామాజికసారథి, బిజినేపల్లి: మూగ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రభుత్వ సోషల్ ఉపాధ్యాయుడు మాసయ్యను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, విధుల నుండి శుక్రవారం సస్పెన్షన్ చేసినట్లు డీఈవో గోవిందరాజులు తెలిపారు.బిజినేపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సోషల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మాసయ్య మూగ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా సోషల్ ఉపాధ్యాయుడిని, జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఉత్తర్వుల మేరకు సస్పెన్షన్ చేసినట్లు డీఈఓ గోవిందరాజులు శుక్రవారం […]
సామాజికసారథి, బిజినేపల్లి: బాలబాలికలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా ప్రవర్తించాడు. సమాజాన్ని చక్కదిద్దాల్సిన గురువు దారితప్పాడు. ఒంటరిగా ఉన్న ఓ యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. బిజినేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయుడు బిజినేపల్లిలోని ఓ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అదే కాలనీలో మానసిక దివ్యాంగురాలైన యువతి(19) నిస్సహాయతను ఆసరాగా చేసుకుని మూడు రోజులుగా ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడుతున్నాడు. […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈలోపే ఆయా పార్టీల్లో లుకలుకలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మల్లు రవి ప్రచారంలో కాస్త వెనకబడ్డారని చెప్పొచ్చు. బుధవారం నిర్వహించిన రోడ్ షో అట్టర్ ప్లాప్ అయింది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎస్సీల్లో మెజారిటీ అయిన మాదిగల ఓట్లు 3.80 లక్షలకు పైగా ఉండగా మాలల […]
గ్రాండ్ ప్రైజ్ సాధించిన ఆడెం మనస్వీ యాదవ్ సామాజిక సారథి, వనపర్తి: వనపర్తి పట్టణ సమీపంలోని చిట్యాల రోడ్ లో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్లు ఇటీవల జాతీయ స్థాయిలో ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ పరీక్షల్లో సత్తాచాటారు. వనపర్తి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్ నుంచి మొత్తం 158 మంది స్టూడెంట్లు ఈ టాలెంట్ పరీక్షలో పాల్గొనగా 132 మంది విద్యార్థులు చక్కటి ప్రతిభ కనభర్చి వివిధ స్థాయిల్లో బహుమతులను […]
సామాజికసారథి, నాగర్‌కర్నూల్ బ్యూరో: బీఎస్పీ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మాజీఎంపీ మందా జగన్నాథంకు దాదాపు టికెట్ ఖరారైంది. ఈనెల 18న ఆయన బీఎస్పీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. మందా జగన్నాథం మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత. అలంపూర్ కు చెందిన ఆయన స్వయానా డాక్టర్. ఆయన టీడీపీ నుంచి రాజకీయ అరగేట్రం చేశారు. 1999-2008(టీడీపీ), 2008-2013 (కాంగ్రెస్), 2013- 2014(టీఆర్‌ఎస్)లో ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో బీఆర్‌ఎస్ పార్టీలో […]