Breaking News

ఒలింపియాడ్ పరీక్షల్లో శ్రీ చైతన్య స్టూడెంట్ల ప్రభంజనం

  • April 16, 2024
  • Top News
  • Comments Off on ఒలింపియాడ్ పరీక్షల్లో శ్రీ చైతన్య స్టూడెంట్ల ప్రభంజనం
ఒలింపియాడ్ పరీక్షల్లో శ్రీ చైతన్య స్టూడెంట్ల ప్రభంజనం

గ్రాండ్ ప్రైజ్ సాధించిన ఆడెం మనస్వీ యాదవ్

సామాజిక సారథి, వనపర్తి: వనపర్తి పట్టణ సమీపంలోని చిట్యాల రోడ్ లో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్లు ఇటీవల జాతీయ స్థాయిలో ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ పరీక్షల్లో సత్తాచాటారు. వనపర్తి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్ నుంచి మొత్తం 158 మంది స్టూడెంట్లు ఈ టాలెంట్ పరీక్షలో పాల్గొనగా 132 మంది విద్యార్థులు చక్కటి ప్రతిభ కనభర్చి వివిధ స్థాయిల్లో బహుమతులను సాధించారు. వారిలో ఆడెం మనస్వీ యాదవ్, గ్రాండ్ ఫ్రైజ్ (లెనెవో ల్యాప్ టాప్), బి.కార్తికేయ, ద్వితీయ బహుమతి( స్మార్ట్ వాచ్), వి.సంజన తృతీయ బహుమతి(స్మార్ట్ వాచ్)లతో ఇతర బహుమతులను సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం స్కూల్ లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఒలంపియాడ్ విన్నర్స్ కు ప్రత్యేక బహుమతులతో పాటు గోల్డ్ మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ చైర్మన్ మాట్లాడుతూ.. తమ స్కూళ్లల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు వారిలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయిలోనే పోటీపరీక్షలను రాసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రాథమిక విద్య స్థాయిలోనే స్టూడెంట్లకు వివిధ రకాల పోటీ పరీక్షలను నిర్వహిస్తూ భవిష్యత్ పోటీ పరీక్షలైన ఐఐటీ, జేఈఈ మెయిన్స్, నీట్, ఎంబీబీఎస్ తదితర ఎంట్రెన్స్‌లో విజయం సాధించేందుకు ఇక్కడే పునాదులు వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ మల్లెంపాటి శ్రీ విద్య, ఏజీఎం భాస్కర్ రెడ్డి, కో ఆర్డీనేటర్ మధు, డీన్ గోపి, సీ బ్యాచ్ ఇంచార్జ్ ప్రతీమ, ప్రైమరీ సెక్షన్ ఇంచార్జ్ దీపిక, పాఠశాల టీచింగ్ స్టాప్ పాల్గొన్నారు.