Breaking News

ఖానాపూర్‌లో కులవివక్ష

ఖానాపూర్‌లో కులవివక్ష
  • అంబేద్కర్ విగ్రహం చుట్టూ కట్టిన నీలి తోరణాల తొలగింపు
  • గతంలోనూ విగ్రహాన్ని ప్రతిష్టించకుండా అడ్డుకున్న అగ్రకులస్తులు
  • తాజాగా ఘటనపై పోలీసులకు ఫిర్యాదుచేసిన గ్రామస్తులు
    సామాజికసారథి, బిజినేపల్లి:
    నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో కులవివక్ష మరోసారి కోరలు చాచింది. ఈ ఘటన ఏప్రిల్ 14న భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఏర్పాటుచేసిన నీలిజెండాలను కొందరు అగ్రకులస్తులు తొలగించారు. దీంతో దళిత యువకులు ఎదురుతిరిగి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్తలు పరిస్థితులు నెలకొన్నాయి. మరికొందరితో కలిసి విగ్రహం చుట్టూ కట్టిన తోరణాలను రాత్రి సమయంలో తొలగించిరాని గ్రామానికి దళిత యువకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. గతంలో కూడా గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తుండగా అడ్డుకున్నారని, వాళ్లకు వాళ్లే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోతామని బెదిరించారని తెలిపారు. మాదిగ కులస్తులను పలుమార్లు బెదిరించారని తెలిపారు. పైపేర్కొన్న వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని ఖానాపూర్ గ్రామంలో సోదరభావం వెల్లవిరిసేలా చర్యలు తీసుకోవాలని బిజినేపల్లి పోలీసులను కోరారు.