Breaking News

ఖమ్మం

ఉనికి చాటుకున్న మావోయిస్టులు

ఉనికి చాటుకున్న మావోయిస్టులు

సామాజిక సారథి, ఏటూరు నాగారం: పీఎల్జీఏ 21వ వార్షిక వారోత్సవాలు డిసెంబర్ 2నుంచి డిసెంబర్10 వరకు జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఏజెన్సీ సరిహద్దు ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలతో అడవులను జల్లడ పడుతున్నారు. రహదారులు, గోదావరి పరీవాహక ప్రాంతాలపై డేగ కన్నుతో సోదాలు నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి మావోయిస్టులు వారి ఉనికిని చాటుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం […]

Read More
బహుజన రాజ్యమే లక్ష్యంగా పని చేయాలి

బహుజన రాజ్యమే లక్ష్యంగా పనిచేయాలి

బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి‌, వైరా: ఊరు వాడకు బహుజన జెండాను తీసుకుని వెళ్లి ఏనుగు గుర్తును ప్రతి ఇంటికి పరిచయం చేసి బహుజన రాజ్యమే లక్ష్యంగా పని చేయాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం రాత్రి జరిగిన బీఎస్పీ జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి […]

Read More
వైరాలో కదంతొక్కిన విద్యార్థులు

వైరాలో కదంతొక్కిన విద్యార్థులు

సామాజిక సారథి‌, వైరా:  సచివాలయాలు,  దేవాలయాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సీఎం కేసీఆర్  పేద విద్యార్థులకు బాకీ పడ్డ బోధనా రుసుము ఉపకార వేతనాల చెల్లింపుకు సంవత్సరాలుగా నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని పీడీఎస్యూ  అధ్యక్షుడు ఎం.అజాద్ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా వైరాలో శుక్రవారం పీడీఎస్ యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ కొవిడ్ […]

Read More
రైతులకు సేవలందించడంలో విఫలం

రైతులకు సేవలందించడంలో విఫలం

సామాజిక సారథి‌, వైరా: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు, సేవలందించడంలో ఉద్యానవన శాఖ విఫలమైందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు ఆరోపించారు. వైరా మండలంలోని పలు గ్రామాల్లో రైతు సంఘం బృందం వైరస్ సోకిన మిర్చి తోటలను గురువారం పరిశీలించింది. పలువురు రైతులు వైరస్ తో దెబ్బతిన్న మిర్చి తోటలను ఈ బృందానికి చూపించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ మిర్చి సాగులో 50శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, […]

Read More
హైస్కూల్ లో కరోనా కలకలం

హైస్కూల్ లో కరోనా కలకలం

సామాజిక సారథి‌, ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతకాని జడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం సృష్టించింది. బుధవారం పాఠశాలలోని 100మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేయగా ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పదోతరగతిలో ఇద్దరికి, 6,8,9 తరగతులకు చెందిన ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణయిందని వైద్య సిబ్బంది తెలిపారు.

Read More
ఏన్కూరులో గురుకులాల తనిఖీ

ఏన్కూరులో గురుకులాల తనిఖీ

 సామాజిక సారథి‌, వైరా/ఏన్కూరు: నియోజకవర్గ కేంద్రమైన వైరాలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాలతోపాటు ఏన్కూరులోని గురుకుల బాలుర పాఠశాలలను ఆ విద్యాలయాల సంస్థ రాష్ట్ర సెక్రెటరీ రమణ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి, ఖమ్మం డీఆర్వో శిరీష, డీఈఓ యాదయ్య, బుధవారం సందర్శించి పరిశీలించారు. ఇటీవల వైరాలోని గురుకుల బాలికల పాఠశాలలో 29మంది విద్యార్థులు కరోనా బారిన పడిన నేపథ్యంలో స్వయంగా రాష్ట్ర సెక్రెటరీ జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు కొవిడ్ […]

Read More
ట్రాఫిక్​రూల్స్​తప్పనిసరి పాటించాలి

ట్రాఫిక్​రూల్స్ ​తప్పనిసరి పాటించాలి

సారథి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో భద్రాచలంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్నవారికి జరిమానాలు విధించారు. వాహనదారులపై ఉన్న పెండింగ్ చలాన్లను ఆన్​లైన్ ​ద్వారా చెల్లించేలా పలు సూచనలు ఇచ్చారు. ట్రాఫిక్​ రూల్స్​ను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాన్ని నడిపేటప్పుడు అన్ని లైసెన్స్, ధ్రువీకరణపత్రాలను కలిగి ఉండాలని సూచించారు.

Read More
లాక్ డౌన్ పై డీఐజీ సమీక్ష

లాక్ డౌన్ పై డీఐజీ సమీక్ష

సారథి, ఖమ్మం: కరోనా ఉధృతి నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతున్న లాక్ డౌన్ అమలుతీరుపై ఆయా జిల్లాల ఎస్పీలతో వరంగల్, కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్ శుక్రవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ ఆఫీసులో సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దు అంతర్గత రహదారుల చెక్ పోస్టుల్లో అమలవుతున్న లాక్ డౌన్ తీరును అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ […]

Read More