ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మక సరయూ ప్రాజెక్టు ప్రారంభం లక్నో: స్వర్గీయ సీడీఎస్చీఫ్జనరల్ బిపిన్ రావత్ ఎక్కడ ఉన్నా రాబోయే రోజుల్లో భారత్ ముందుకెళ్తున్న తీరు, అభివృద్ధిని గమనిస్తూ ఉంటారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రావత్ మరణం ప్రతి దేశభక్తుడికి నష్టమే అన్నారు. ఆయన అత్యంత ధైర్యసాహాసాలు కలిగిన వ్యక్తి అని, దేశసైన్యాన్ని స్వయంవృద్ధి చేసేందుకు ఎంతో కృషిచేశారని కొనియాడారు. ఆయన పనితీరును దేశం ప్రత్యక్షంగా చూసిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో ప్రతిష్టాత్మకమైన సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టును […]
కార్మికుల సమ్మె సక్సెస్ మూడోరోజూ కొనసాగిన నిరసనలు కార్మిక సంఘాల బైక్‌ర్యాలీ నిలిచిన 6లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి బొగ్గు గనులపై కేంద్రం కుట్ర: ప్రభుత్వ విప్బాల్క సుమన్ సామాజిక సారథి, కరీంనగర్: బొగ్గుగనుల ప్రైవేటీకీకరణకు వ్యతిరేకంగా చేపట్టిని సింగరేణి సమ్మె సక్సెస్అయింది. శనివారం మూడో రోజుకు చేరింది. సిగరేణివ్యాప్తంగా కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో ఆరు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. మొత్తం 23 భూగర్భగనులు, 16 ఓపెన్ కాస్ట్ గనుల్లో సమ్మె విజయవంతమైంది. […]
హెలికాప్టర్ ప్రమాద మృతుల గుర్తింపు మరో ఆరుగురి మృతదేహాల అప్పగింత న్యూఢిల్లీ: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారిలో మరో ఆరుగురి మృతదేహాలను శనివారం గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సైనికాధికారి సాయితేజతో పాటు వివేక్ కుమార్, మరో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను గుర్తించారు. వారి పార్థీవదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు తరలించనున్నామని, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగిలిన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. […]
న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన సీనియర్ న్యాయవాది పి.నిరూప్ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ గా నియమితులయ్యారు. డిసెంబర్ 8న ఫుల్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు ఎంపికచేసిన మొట్టమొదటి సీనియర్ అడ్వకేట్ నిరూప్ కావడం విశేషం. నిరూప్ తండ్రి మాజీమంత్రి పి.రామచంద్రారెడ్డి కూడా స్వయాన న్యాయవాది. ఆయన మూడు దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో సేవలు అందిస్తున్నారు. 31 జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేసుల్లో తీర్పులు నివేదించారు. ముఖ్యంగా ప్రైవేట్ ఇంటర్నేషనల్‌లా, ఎన్విరాన్ మెంటల్ లా, […]
రైతు అంశాలపై ప్రధాని మోడీ నిర్లక్ష్యం మద్దతు ధరలు, పరిహారం విషయంలో స్పందనలేదు పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సోనియా ఆగ్రహం న్యూఢిల్లీ: రైతుల అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తప్పుబట్టారు. రైతు సమస్యలు, సామాన్య ప్రజల విషయంలో ఎలాంటి స్పందన లేని రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పీ) చట్టపరమైన హామీ, మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతులు చేస్తున్న డిమాండ్‌కు కాంగ్రెస్ బాసటగా నిలుస్తుందని […]
ఇందులో సౌకర్యలు, సౌలభ్యాలు ఎక్కువే ప్రమాదాలను తట్టుకునే సామర్థ్యం కూడా ఎక్కువే చెన్నై: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ తన కుటుంబంతో కలిసి ప్రయణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ఎంఐ 17వీ5 ఇది మిలిటరీ రవాణా విమానం. రష్యాకు చెందిన కాజాన్ హెలికాప్టర్స్ దీనిని తయారుచేసింది. ప్రపంచంలోనే అత్యాధునిక రవాణా హెలికాప్టర్ గా దీనికి పేరుంది. భద్రతా బలగాల రవాణా, అగ్ని ప్రమాదాల కట్టడికి, కాన్వాయ్ ఎస్కార్టుగా, పెట్రోలింగ్ విధులు, గాలింపు చర్యలు తదితర […]
తండ్రి కూడా లెఫ్టినెంట్‌గా పనిచేసిన అనుభవం త్రివిధ దళాల అధికారిగా భారత్ సైన్య ఆధునీకరణకు కృషి ఆధునిక యుద్ధ తంత్రాల్లో ఆరితేరిన దిట్ట న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సీడీఎస్ బిపిన్ రావత్ కుటుంబం అంతా దేశం కోసం ఆర్మీలో పనిచేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన రావత్ దేశం సైనికంగా బలపడేందుకు అహర్నిశలు పనిచేసేవారు. ఆధునిక యుద్ధవ్యూహాల్లో ఆయన దిట్ట. భారత ఆర్మీని అధునాతన యుద్ధరీతులకు తర్ఫీదు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి ఆయనే. […]
అత్యంత ప్రతిభావంతురాలిగా వరుసగా రికార్డు న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రపంచంలో వందమంది అత్యంత శక్తిమంతులైన మహిళల జాబితాలో వరుసగా మూడోసారి స్థానం దక్కించుకున్నారు. గతేడాది కన్నా ఈ సంవత్సరం ఆమె మరింత మెరుగైన స్థానంలో నిలవడం విశేషం. గతేడాది 41వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 37వ స్థానాన్ని దక్కించుకున్నారు. అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్ కన్నా రెండు స్థానాలు ముందంజలో ఉండటం మరో విశేషం. మన దేశ తొలి పూర్తి […]