Breaking News

అనంతపురం

కోవిడ్ వార్డుల తనిఖీ

కోవిడ్ వార్డుల తనిఖీ

సారథి న్యూస్​, అనంతపురం : జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలోని కోవిడ్-19 ఐసీయూ,ఇతర వార్డులను సోమవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వైద్యులు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి కోవిడ్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలు ఏ విధమైన భయాందోళనలకు లోను కావద్దని ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందన్నారు.

Read More
కరెంట్​ షాక్​తో 45గొర్రెలు మృతి

విద్యుత్ షాక్ తో 45 గొర్రెలు మృతి

సారథి న్యూస్​, అనంతపురం : కరెంట్​ షాక్​తో భారీ సంఖ్యలో గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వివరాలు.. అనంతపురం జిల్లా గోరంట్ల మండల పరిధిలోని మందలపల్లి పంచాయతీలోని కరావులపల్లి తండాలో శనివారం షార్ట్​ సర్క్యూట్​తో విద్యుత్​ షాక్​ తగిలి శంకర్​ నాయక్​ అనే రైతుకు చెందిన 45 గొర్రెలు చనిపోయాయి. జీవనాధారం కోల్పోవడంతో రైతు కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Read More

కరోనాతో ట్రాఫిక్ సీఐ మృతి

సారథి న్యూస్, అనంతపురం: అనంతపురం నగరంలో ట్రాఫిక్ సీఐగా నిధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ కరోనా బారినపడి మంగళవారం మృతిచెందారు. స్థానిక సవేరా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీఐ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉన్నప్పుడు తన సమకాలీకుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాడని ఆయన కితాబిచ్చారు. సీఐ రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు.

Read More

ప్రబోధానంద కన్నుమూత

సారథిన్యూస్​, అనంతపురం: వివాదాస్పద అధ్యాత్మిక గురువు, త్రైతసిద్ధాంత రూపకర్త స్వామి ప్రబోధానంద శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తాడిపత్రిలోని ఆశ్రమం నుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడని ఆయన శిష్యులు తెలిపారు. 1950లో తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె అనే గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన అసలు పేరు పెద్దన్న చౌదరి. తొలుత భారత సైన్యంలో వైర్ లెస్ ఆపరేటర్ గా ఆయన పని చేశారు. సైన్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాడిపత్రిలో […]

Read More

కడప జైలుకు జేసీ సోదరుడు

సారథి న్యూస్, అనంతపురం: బీఎస్‌-3 వెహికిల్స్​ను బీఎస్‌-4గా రిజిస్ట్రేషన్‌ చేయించారన్న అభియోగాలపై అరెస్టయిన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి జేసీ దివాకర్​రెడ్డి సోదరుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్‌రెడ్డిని పోలీసులు తాజాగా కడప సెంట్రల్​ జైలుకు తరలించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు ఎస్సైలు, నలుగురు సిబ్బంది శనివారం తెల్లవారుజామున హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్‌లో ప్రభాకర్‌రెడ్డి ఇంటి తలుపు తట్టి వారిపై ఉన్న అభియోగాలను […]

Read More

టీడీపీ నేత జేసీ ప్రభాకర్​రెడ్డి అరెస్ట్​

సారథి న్యూస్, అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ అనంతరం వీరిని హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి తరలించారు. బీఎస్‌-3 వాహనాలను బీఎస్-‌4గా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై కూపీ లాగగా నకిలీ […]

Read More

జగన్.. ప్రజాబాట

సారథి న్యూస్, అనంతపురం: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని దృఢంగా నిర్ణయం తీసుకున్నారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు ఎలా అందుతున్నాయో తెలుసుకోవడంతో పాటు సచివాలయ వ్యవస్థ పనితీరుపై కూడా ప్రజల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు. అందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేశారు. జులై 8న దివంగత సీఎం వైఎస్​ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు పంపిణీచేసి ఆ తర్వాతే ప్రజాక్షేత్రంలోకి […]

Read More

టీడీపీ నేతల దీక్షలు వృథా

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు సారథి న్యూస్, అనంతపురం: కరువు ప్రాంతాలకు నీరు తరలించేందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు చేసే దీక్షలు వృథా అని విమర్శించారు. ఎందుకు దీక్షలు చేస్తున్నారో వారికే తెలియదని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జీవో తెచ్చిన సీఎం జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. పోతిరెడ్డిపాడు […]

Read More