Breaking News

TRAFFIC CI

కరోనాతో ట్రాఫిక్ సీఐ మృతి

సారథి న్యూస్, అనంతపురం: అనంతపురం నగరంలో ట్రాఫిక్ సీఐగా నిధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ కరోనా బారినపడి మంగళవారం మృతిచెందారు. స్థానిక సవేరా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీఐ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉన్నప్పుడు తన సమకాలీకుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాడని ఆయన కితాబిచ్చారు. సీఐ రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు.

Read More
ట్రాఫిక్ సీఐ ఔదార్యం

ట్రాఫిక్ సీఐ ఔదార్యం

ట్రాఫిక్ సీఐ ఔదార్యం.. సారథి న్యూస్​, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండంలో 30 మంది యాచకులకు బుధవారం తన సొంత ఖర్చులతో రామగుండం ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు భోజనాలు ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బాయ్ శ్రీనువాస్, కానిస్టేబుల్ సత్యం తదితరులు పాల్గొన్నారు.

Read More