సారథి న్యూస్, అనంతపురం : కరెంట్ షాక్తో భారీ సంఖ్యలో గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వివరాలు.. అనంతపురం జిల్లా గోరంట్ల మండల పరిధిలోని మందలపల్లి పంచాయతీలోని కరావులపల్లి తండాలో శనివారం షార్ట్ సర్క్యూట్తో విద్యుత్ షాక్ తగిలి శంకర్ నాయక్ అనే రైతుకు చెందిన 45 గొర్రెలు చనిపోయాయి. జీవనాధారం కోల్పోవడంతో రైతు కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
కరోనా.. క్వారంటైన్ పేరు చెప్పగానే ఉలిక్కిపడే పరిస్థితి వచ్చింది. కరోనా లక్షణాలు కనిపించినా, ఎవరైనా దూర ప్రయాణాలు చేసి వచ్చినా.. అధికారులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఓ ఊరులో గొర్రెలు, మేకల కోసం కూడా క్వారంటైన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకాలోని గొడెకెరె గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లరహట్టి గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన కొన్ని గొర్రెలు, మేకలు కొన్ని రోజులుగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నాయి. జలుబు, జ్వరం […]