– ప్రపంచం నలుమూలలా భారత్ టెక్కీలు– జీఎఫ్‌ఎస్‌టీ సదస్సులో చంద్రబాబు సామాజికసారథి, హైదరాబాద్: ప్రపంచ దేశాల్లో 2047 నాటికి ఇండియన్స్ నెంబర్‌వన్‌గా ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో డీప్ టెక్నాలజీస్ అంశంపై జీఎఫ్‌ఎస్‌టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎఫ్‌ఎస్‌టీ చైర్మన్ హోదాలో చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే అన్నీ సాధ్యమేనని చెప్పారు. ఐటీతో ప్రపంచమంతా భారతీయులు విస్తరించారని తెలిపారు. 2047 నాటికి భారత్ […]
– కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి– పార్టీలో చేరడంపై స్పష్టత ఇచ్చిన నేతలు– 30న కాంగ్రెస్ ఖమ్మం సభలో చేరిక సామాజికసారథి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఆయన ఏ రోజు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే దానిపై కూడా స్పష్టత వచ్చింది. ఈ నెలాఖరున అంటే జూన్ 30న పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు తదితరులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈనెల 22న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ […]
– తెలంగాణ అభివృద్ధికి రూ.5 లక్షల 27వేల కోట్లు– వివిధ కార్యక్రమాలకు కేంద్రం ప్రభుత్వం మంజూరు– గుజరాత్ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు– కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రజెంటేషన్ సామాజికసారథి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో రూ.5 లక్షల 27వేల కోట్లు ఖర్చు చేసిందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి కేంద్రం తెలంగాణకు రూ. 8,379 కోట్లు ఇచ్చిందని తెలిపారు. తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన […]
– లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ– వీసీ ఇంట్లో 8 గంటల పాటు సోదాలు– పలు కీలకపత్రాలు స్వాధీనం.. అనంతరం అరెస్ట్ సామాజికసారథి, హైదరాబాద్: నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ దాచేపల్లి రవీందర్ గుప్తాను ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో దాదాపు 8గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం రవీందర్ గుప్తాను అరెస్టు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని భీమ్‌గల్‌లో […]
ఈ నెల 7నుంచి విధులకు డుమ్మాలీవ్ లెటర్ లేదు… విధులకు హాజరు కావడం లేదు… తమకు తెలియదంటున్న ఆ ధికారులు … సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:.నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఎంపీడీఓ పవన్ కుమార్ పది రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. కనీసం ఎంపీడీఓ కార్యాలయంలో సెలవు పత్రం లేకుండా ఉన్నతాధికారుల అనుమతి కూడా లేకుండా ఎంపీడీఓ విధులకు దర్జాగా డుమ్మా కొడుతుండడం జిల్లాలో సంచలనంగా మారింది. ఈయన ఎంపీడీఓ గా విధులు […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఒక్కసారి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరించానని, తన అనుచరులు, కార్యకర్తలకు జరిగిన ఇబ్బందులను మరిచిపోనని అన్నారు. ‘నన్ను ఎవరూ బుజ్జగించలేదు.. ఎవరు బుజ్జగించినా లొంగిపోయేది లేదు’అని ఆయన స్పష్టంచేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ హోదాలో తాను గద్వాల సీఎం కేసీఆర్ సభకు వెళ్లాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. […]
-ఎన్నో అవమానాలు భరించా.. – ఏనాడు పైసా ఆశించలే.. – నా అభిమానులపై కేసులు పెట్టి జైళ్లకు పంపించారు.. – ప్రజల కోసం ఎంతో చేశా.. సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరించానని సీనియర్ నేత, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి చెప్పుకొచ్చారు. తన అనుచరులు, అభిమానులు, తన వెంట నడిచినవారిపై కేసులు పెట్టి, జైళ్లకు పంపించి వేధించి నానాఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు […]
సామజిక సారథి , నాగర్ కర్నూల్ బ్యూరో:నాగర్ కర్నూల్ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ అభ్యాసకుల సహాయ కేంద్రం సమన్వయకర్తగా వర్కాల శ్రీనివాస్ ను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులు నియమించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కమర్ షాజహాన్ సుల్తానా తెలిపారు.ఈ సందర్బంగా స్టడీ సెంటర్ సమన్వయకర్త వర్కాల శ్రీనివాస్ ను కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు అభినందించారు,వర్కాల శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటు తన వంతుగా అన్ని రకాల […]