సామాజిక సారథి, వరంగల్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో మరోసారి మెడికోలు కరోనా బారిన పడ్డారు. ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్న కొంత మందిలో మెడికల్ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉండడం తో టెస్టులు చేయగా టెస్టులు చేసిన వారిలో 17 మందికి కరోనా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. కరోనా వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
గుండెపోటు నివారణకు అత్యవసర మెడిసిన్ ఉచితంగా అందిస్తామన్న అదనపు ఈవో ధర్మారెడ్డి తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులకు రుయా ఆస్పత్రి శుభవార్త చెప్పింది. అత్యవసర వైద్యం అవసరమైన పక్షంలో గుండెపోటు నుండి రక్షించేందుకు తిరుపతిలోని రుయా ఆసుపత్రివారి ఆధ్వర్యంలో టెనెక్టేస్ ప్లస్ ఇంజక్షన్ అందుబాటులోకి తెచ్చింది. శనివారం తిరుమలలోని రాంభగీచా గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న ప్రథమ చికిత్స కేంద్రంలో అదనపు ఈవో ధర్మారెడ్డి ఈ మెడిసిన్‌ను విడుదల చేశారు. గుండె రక్తనాళాల్లో రక్తం […]
కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సామాజికసారథి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులు ఉండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇదే అనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని రకాల […]
మహిబాత్ పూర్‌లో దుండగుల దుశ్చర్య సామాజికసారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని మహిబాత్ పూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సమాధిని తవ్వి మహిళ పుర్రెను ఎత్తుకెళ్లారు. ఈఘటన గ్రామంలో కలకలం రేపింది. రాయికోడ్ మండలం మహాబథ్ పూర్ గ్రామానికి చెందిన కొనింటి ఏలిశా బెతూ అనే మహిళ అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతిచెందింది. వారి గ్రామ శివారులో ఉన్న పొలం వద్ద అంత్యక్రియలు నిర్వహించి సమాధి చేశారు. కానీ, జనవరి 6న […]
అనాథల రక్షణకు ప్రభుత్వ కార్యాచరణ కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీగా చదువులు ఉన్నతంగా ఎదిగేలా చట్టబద్ధమైన రక్షణ ప్రభుత్వ బిడ్డలుగా గుర్తిస్తూ ఐడీ కార్డులు సీఎం కేసీఆర్‌కు కేబినెట్ సబ్‌కమిటీ ప్రతిపాదనలు సామాజికసారథి, హైదరాబాద్: అభాగ్యులను చేరదీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అద్భుత విధానం తీసుకురావడానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అనాథలను అక్కున చేర్చుకుని వారికి ఉచితంగా విద్యను అందించాలని సంకల్పించింది. వారికి కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ను ఏర్పాటుచేసి ప్రత్యేక […]
దేశంలో విస్తరిస్తున్న కరోనా ఒమిక్రాన్ కేసులు 3,071 న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. వరుసగా శనివారం రెండవరోజు కొత్తగా కేసులు లక్ష దాటాయి. ముందురోజు కంటే 21శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మూడువేలకు పైగానే నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. శుక్రవారం 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, 1,41,986 మందికి వైరస్ పాజిటివ్‌గా […]
వందశాతం ఆధార్‌తో అనుసంధానం సామాజిక సారథి, హైదరాబాద్: రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లను రూపొందించింది. ఆధార్ అనుసంధానంతో పాటు సీసీ కెమెరాలను, బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. అయితే కొందరు అధికారులు, రేషన్ డీలర్లు పేదల బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రభుత్వ సర్వేల్లో తేలింది. వాస్తవానికి ప్రతి రెవెన్యూ అధికారులు రేషన్ షాపులను తనిఖీ చేసి సరుకులను వచ్చే నెలకు కేటాయింపు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ […]
నాకు ఆస్తి రాకుండా అడ్డుపడుతున్నాడు వీళ్లను ఏం చేస్తారో సమాజానికే వదిలేస్తున్నా నాగ రామకృష్ణ మరో వీడియో వైరల్ సామాజికసారథి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలోకుటుబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన నాగ రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో కూడా ప్రస్తుతం వైరల్‌గా మారింది. తన ఆత్మహత్యకు మొదటి సూత్రధారి వనమా రాఘవనే అని వీడియోలో రామకృష్ణ పేర్కొన్నారు. తన […]