రాష్ట్ర మంత్రుల ఆశ్చర్యం, అభినందనలు సామాజికసారథి, హైదరాబాద్: అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన సిరిసిల్లకు చెందిన యువ చేనేత కళాకారుడు నల్ల విజయ్ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. విజయ్ కుటుంబసభ్యులతో హైదరాబాద్ వచ్చి మంత్రులకు తాను నేసిన చీరను చూపించారు. చీర నేసేందుకు పట్టిన సమయం, ఎలా నేసారనే వివరాలు మంత్రులు విజయ్‌ని అడిగి తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తాను ఇంతవరకూ చూడలేదని […]
14న ముగియనున్న చైర్మన్కె.శివన్ పదవీకాలం న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త చైర్మన్ గా అంతరిక్షశాఖ కార్యదర్శి, రాకెట్ శాస్త్రవేత్త ఎస్.సోమనాథ్ నియమితులయ్యారు. కె.శివన్ పదవీకాలం ఈనెల 14వ తేదీతో ముగియడంతో ఆయన స్థానంలో ఎస్.సోమనాథ్ ను నియమించారు. తిరువనంతపురంలోని విక్రం సారభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ గా ఆయన పనిచేస్తున్నారు. ఉపగ్రహ వాహన నౌకల డిజైనింగ్ లో సోమనాథ్ కీలకపాత్ర పోషించారు. కేరళకు చెందిన ఎస్.సోమనాథ్ కొల్లంలోని టీకేఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ […]
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సామాజిక సారథి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన నిర్భయ కేసు కన్నా దారుణమని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మీ చుట్టాల్లో ఎవరైనా చనిపోతే పోతావు.. ఎంతోమంది రైతులు చనిపోతున్నారు.. కనీసం పాల్వంచ కైనా పోవాలి కదా అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యపై ఇంత వరకూ మాట్లాడక పోవడం విచారకరం […]
సామాజిక సారథి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని మూడవ అంతస్తులో టాక్స్ సెక్షన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్యాలయమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. భారీగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో కార్యాలయంలోని పలు ఫైల్స్దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో లిప్ట్ నిలిచి పోవడంతో అందులో ఉన్నవారు ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది […]
సామాజిక సారథి, హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలను బంద్ చేయాలని ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదని దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలయాల్లో కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని, ముఖ్యంగా మాస్క్, భౌతిక దూరం ఉండేలా చూసుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రసిద్ధ ఆలయాల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం […]
మేడారం జాతరపై కలెక్టర్ సమీక్ష సామజిక సారథి, ములుగు: మేడారం మహా జాతర విజయవంతం చేయడానికి ఆదివాసి పెద్దలు, అదివాసి సంఘాలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసి పెద్దలు, ఆదివాసి సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఎస్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లడారు. మేడారం జాతరలో ఆదివాసి సంఘాలకు 22 లిక్కర్ షాపులు […]
మండిపడ్డ బీజేపీ నేత విజయశాంతి సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరం సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ నేడు రైతులను మోసగించాలని చూస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. అయితే రైతన్నలు మోసపోయే స్థితిలో లేరని గ్రహించాలన్నారు. ఎన్ని ఎత్తులు, జిత్తులు చేసినా రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ప్రజలు గద్దె దించుతారని ఆమె జోస్యం చెప్పారు. రైతులు యాసంగి వరి సాగు చేయొద్దని చెప్పి, కాదని వేస్తే కొనుగోలు […]
రాష్ట్రాభివృద్ధికి పది సూత్రాలు అవినీతికి అంతం పలుకుతాం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఛండీగఢ్: ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను అరవింద్ కేజ్రివాల్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరోవైపు అధికారం తమ వద్దే ఉంచుకునేందుకు కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్కేజ్రీవాల్పది సూత్రాలతో ‘పంజాబ్మోడల్’ పేరుతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజల ముందుకొచ్చారు. ఆమ్ ఆద్మీ […]