హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణమంతా చల్లబడి చల్లగాలులు వీస్తున్నాయి. దీంతో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు గజగజవణికిపోతున్నారు. శని, ఆదివారాల్లో కూడా తెలంగాణలోని పలు ప్రాంతాలకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోనూ శుక్రవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. శనివారం ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు, దక్షిణ కోస్తాలో ఉరుములు, […]
సారథి న్యూస్, తుంగపాడు(మిర్యాలగూడ): నూతన వ్యవసాయ చట్టాలు అమలైతే ఐకేపీ సెంటర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడం ద్వారా ఇటు మహిళలు, అటు రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రుణమాఫీ అమలు చేయకుండా రైతులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పడం ఆ తర్వాత మోసం చేయడం ఆయన నైజమని ధ్వజమెత్తారు. రైతులతో ముఖముఖి కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం నల్లగొండ […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మెదక్జిల్లా పెద్దశంకరంపేటలో శుక్రవారం శివాజీ యువసేన, భజరంగ్ దళ్, వివేకానంద ఉత్సవ సమితి, శ్రీరామ్ సేన తదితర యువజన సంఘాల ఆధ్వర్యంలో శివాజీ జయంతి ఘనంగా జరుపుకున్నారు. స్థానిక రామాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఛత్రపతి శివాజీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ‘జై శ్రీరామ్.. జైజై శ్రీరామ్.. జై శివాజీ.. వీరభవానీ.. భారత్ మాతాకి జై’ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల గుండా భారీ శోభాయాత్ర […]
సారథి న్యూస్, హైదరాబాద్: మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. శుక్రవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజల అనంతరం గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న ‘కుంబ్ సందేశ్’ రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. కరోనా మహమ్మారి వంటి క్లిష్టమైన సమయంలోనూ ప్రపంచమంతా భారత సంప్రదాయాలు పాటించిదని గుర్తుచేశారు. సంస్కృతిని కొత్త తరానికి […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పట్లొరీ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ సభ్యత్వ నమోదు చేయించారు. మండలంలోని అంబాజీపేట, చందాపూర్ గ్రామాల్లో సభ్యత్వాలు చేయించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్లు సాన సాయిలు, పడాల రమాదేవి, శ్రీనివాస్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ధ్యాప బాలకిషన్, మ్యాసగల్ల పెంటయ్య, గోపాల్ నాయక్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, […]
సారథి న్యూస్, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సర్వేనం.363లో ఉన్న దళితుల భూమిని కబ్జాదారులు అక్రమంగా పట్టా చేయించుకుని వారిపైనే అక్రమ కేసులు బనాయించడం దారుణమని కేవీపీఎస్రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంతటి కాశన్న అన్నారు. గురువారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో స్థానిక సీఐటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. 1957లో దళితులకు ఇచ్చిన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా పట్టాలు చేయించుకోవడమే కాకుండా ఆ […]
వీడిన న్యాయవాది దంపతుల హత్యకేసు మిస్టరీ ప్రధాన నిందితులు ముగ్గురు అరెస్ట్ హత్యకు వాడిన నలుపు రంగుకారు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఐజీ వి.నాగిరెడ్డి సారథి న్యూస్, రామగుండం: మంథనికి సమీపంలో హైకోర్టు న్యాయవాదుల దంపతులు గట్టు వామన్ రావు, పీవీ నాగమణిని దారుణంగా హతమార్చింది కుంట శ్రీనివాస్, అతని గ్యాంగేనని తేలింది. అన్ని కోణాల్లో దర్యాప్తుచేసిన పోలీసులు ప్రధాన నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్ను అరెస్ట్చేశారు. హత్యోదంతానికి సంబంధించిన వివరాలను గురువారం […]