సారథి న్యూస్, వాజేడు, ములుగు: ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టిసారించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి కె.రమాదేవి సూచించారు. సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో ప్రజావిజ్ఞప్తులు, ఈ- ఆఫీస్, పల్లెప్రగతి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ శాఖలకు సంబంధించి ఇప్పటివరకు 646 దరఖాస్తులు రాగా, 358 పరిష్కరించామని, 288 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రజావాణిలో 21 రెవెన్యూ శాఖకు సంబంధించి, మూడు ఆసరా పెన్షన్లు, […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రూ.1.8 కోట్ల వ్యయంతో నిర్మించిన సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోమవారం ప్రారంభించారు. రెండు అంతస్తుల్లో నిర్మించిన భవనంలో వసతులు బాగున్నాయని కితాబిచ్చారు. సత్వర సేవలు అందించి జిల్లాలోనే నంబర్వన్ట్రెజరీగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 76 సబ్ ట్రెజరీ భవనాలకు ఒకేసారి నిర్మాణ అనుమతులు వస్తే నరసన్నపేటలో భవనం మొదటిసారిగా ప్రారంభానికి నోచుకోవడం గొప్ప విషయమని అన్నారు. అంతకుముందు ఆయన పూజలు చేశారు. […]
సారథి న్యూస్, వనపర్తి: నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కె.విజయ రాములు, ఏఐటీయూసీ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి మాసన్న, పార్టీ సీనియర్ నాయకుడు డి.చంద్రయ్య పిలుపునిచ్చారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సీపీఐ ఆఫీసులో శనివారం ఏఐటీయూసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల నిరంకుశ ధోరణి అనుసరిస్తూ హక్కులను కాలరాస్తున్నాయని […]
సారథి న్యూస్, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు టీపాస్ బీ పాస్ వెబ్ సైట్ ను రూపొందించామని మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వివరించారు. సోమవారం ఆయన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దరఖాస్తుదారుడు స్వీయ ధ్రువీకరణతో భవన నిర్మాణానికి అనుమతి ఇస్తారని తెలిపారు. 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనాలకు ఎలాంటి అనుమతి లేదన్నారు. 600 […]
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని అన్ని గ్రామాల్లో దీపావళి పండుగను సంతోషాల మధ్య జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆస్పత్రి సిబ్బంది ఉత్సవాల్లో పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని, కార్మికులకు 50శాతం పెండింగులో ఉన్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. తక్షణమే రూ.120కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. తాను ఉన్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంటానని స్పష్టంచేశారు హైదరాబాద్ నగరంలో బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సీఎం నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్టీసీకి నష్టం.. కార్మికులకు ఉద్యోగ […]
సారథి న్యూస్, హైదరాబాద్: ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించిందని, మరో మూడు నాలుగు రోజుల్లో నూటికి నూరు శాతం అన్నిరకాల సమస్యలను అధిగమించనుందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ‘ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆధారణ పొందనుంది. అద్భుతమైన ప్రతిపాదన వస్తోంది. భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్లుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు, నాలాలపై ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు మంత్రి కె.తారక రామారావు వివరించారు. సాగునీటి శాఖ చీఫ్ ఇంజనీర్, జీహెచ్ఎంసీ ప్రత్యేక కమిషనర్ ఆధ్వర్యంలో నీటివనరుల సంరక్షణ, ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టాలన్నారు. ఆదివారం ఇరిగేషన్, జలమండలి, హెచ్ఎండీఏ, రెవెన్యూ యంత్రాంగం, ఇతర శాఖల అధికారులతో కలిసి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, నాలాలపై పూర్తిస్థాయిలో స్టడీ చేయాలని సంబంధిత […]