ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్న వందల ట్రాక్టర్లు కాంగ్రెస్ నాయకుల ఐక్యత రాగం కదలొచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సారథి న్యూస్, మధిర, ఖమ్మం: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో బుధవారం చేపట్టిన రైతు ట్రాక్టర్ల ర్యాలీలో ప్రజలు, రైతులు కదం తొక్కారు. ఒక్కరుగా మొదలై వేల సంఖ్యలో రైతులు తమ ట్రాక్టర్లతో సహా స్వచ్ఛందంగా […]
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని నారాయణపురం, మద్దూరు, కలుగొట్లలో రైతు వేదిక భవనాలను బుధవారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించారు. రైతుల అభ్యున్నతి కోసమే రైతు వేదికలను నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 60లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. రైతు వేదికల వద్ద రైతాంగం సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. అన్నదాతల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సరిత, కలెక్టర్ శృతిఓజా, సర్పంచ్ లక్ష్మీదేవి, […]
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో బుధవారం 43 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ ఎలిజిబెత్ రాణి తెలిపారు. గ్రామాల్లో ప్రజలు మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, రోగనిరోధకశక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, కరోనా పాజిటివ్వచ్చినవారు అధైర్యపడొద్దని సూచించారు. మెడికల్ టెస్టులు నిర్వహించిన వారిలో ఏఎన్ఎం రేణుక, ఆశావర్కర్లు సంతోష, రేఖ, పుష్ప, మమత […]
హైదరాబాద్: గచ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్‌ను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ‘సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్’లో భాగంగా ఈ డేటా సెంటర్‌ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. కాగా, ఈ సెంటర్‌లో భారీ తెరను ఏర్పాటుచేశారు. దీని మీద ఒకేసారి ఐదువేల సీసీ కెమెరాలకు చెందిన లైవ్ దృశ్యాలను వీక్షించొచ్చు. […]
ఢిల్లీ: నెట్ ఫ్లిక్స్ వంటి ఆన్ లైన్ న్యూస్ పోర్టళ్లు, కంటెంట్ ప్రొవైడర్లను సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోకి తీసుకువస్తూ బుధవారం కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ ను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టంగానీ, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, న్యూస్ చానళ్లు, ప్రింట్ మీడియా, సినిమాలు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్(ఎన్బీఏ), ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ), సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ […]
పట్నా: ఉత్కంఠభరితంగా సాగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయం ఎన్డీయేను వరించింది. ఎన్నికల కౌంటింగ్ మంగళవారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. మొత్తం 243 స్థానాల్లో అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ అత్యధికంగా 73 స్థానాలను గెలుచుకుంది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ ఈ సారి 43 స్థానాలకే పరిమితమైంది. కూటముల […]
మరోసారి విజేతగా నిలిచిన రోహిత్ సేన ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి దుబాయ్: ముంబై ఇండియన్స్ మరోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది.. వరుసగా ఐదోసారి విజేతగా కప్ గెలుచుకుంది. ఢిల్లీపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఐపీఎల్ 13 సీజన్ ఫైనల్ మ్యాచ్ చాలా కూల్‌గా సాగింది. ఢిల్లీ విసిరిన 157 పరుగుల టార్గెట్ ను ముంబై బ్యాట్స్‌మెన్స్ చాలా ఈజీగా ఛేదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: విజయాలకు పొంగిపోయేది లేదని, అపజయాలకు కుంగిపోవమని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్కె.తారక రామారావు అన్నారు. అప్పుడు.. ఇప్పుడు ఇదే చెబుతున్నామని అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. దుబ్బాకలో టీఆర్ఎస్ కు ఓటువేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో పాటు మిగతా నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ‘తాము ఆశించిన ఫలితం రాలేదు.. ఈ ఎన్నిక మమ్మల్ని అప్రమత్తం చేసింది. […]