Breaking News

Day: October 23, 2020

‘నేట్రికన్’ ఫస్ట్ లుక్

‘నేట్రికన్’ ఫస్ట్ లుక్

గ్లామర్ పాత్రలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో లేడీ ఓరియెంటెండ్ సబ్జెక్ట్స్​కూడా నయనతార అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది. దక్షిణాది భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతూ బోలెడు సూపర్ హిట్లను తన ఖాతాలో జమచేసుకుంది. ఇప్పటికీ నయన్‌ చేతినిండా సినిమాలు ఉన్నాయి. వాటిలో మిలింద్ రౌ దర్శకత్వం వహిస్తున్న ‘నేట్రికన్’ ఒకటి. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై విఘ్నేష్ శివన్ ఈ మూవీ నిర్మిస్తున్నాడు. నయనతారకు ఇది 65 వ సినిమా. 2011 లో విడుదలైన బ్లైండ్ అనే […]

Read More
రైతు వేదికకు రూ.12లక్షల విరాళం

రైతు వేదికకు రూ.12లక్షల విరాళం

సారథి న్యూస్, రామాయంపేట: నిజాంపేట క్లస్టర్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదిక నిర్మాణం కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, సంఘ సేవకులు అందె ప్రతాప్ రెడ్డి రూ.12లక్షల చెక్కును డీడీఏవో పరుశురాం నాయక్ కు అందజేశారు. మండల రైతుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, తహసీల్దార్ జయరాం, ఏవో సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

Read More
యాసంగిలో ఏం సాగుచేద్దాం

యాసంగిలో ఏం సాగుచేద్దాం

సారథి న్యూస్, హైదరాబాద్: వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు శుక్రవారం మద్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొంటారు. వానాకాలం పంటల కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై సమీక్షిస్తారు. యాసంగిలో పంటల సాగుపై చర్చిస్తారు. ముఖ్యంగా మక్కల సాగుపై విధాన నిర్ణయం […]

Read More
ప్రజల యాదిలో జాన్ విల్సన్

ప్రజల యాదిలో జాన్ విల్సన్

సారథి న్యూస్, హుస్నాబాద్: మూడు దశాబ్దాలుగా ప్రజల యాదిలో పదిలంగున్న నాటి పోలీస్ అధికారి హుస్నాబాద్ ఎస్సై జాన్ విల్సన్. ప్రజాపోరాటాల వల్లే సమసమాజ స్థాపన జరుగుతుందని భావించిన పీపుల్స్ వార్, అభ్యుదయవాదులు ఓవైపు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు పోలీసుల ఇనుప బూట్ల చప్పుళ్ల మధ్య పల్లెలు నలిగిపోతున్న తరుణమది. రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతంమైన హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా జాన్ విల్సన్ విధుల్లో చేరాడు. నేడు ప్రభుత్వం అవలంబిస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను […]

Read More
సిక్కోలు మున్సిపాలిటీ లోగో ఆవిష్కరణ

సిక్కోలు మున్సిపాలిటీ లోగో ఆవిష్కరణ

సారథి న్యూస్, శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్ లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.నల్లనయ్య అధ్యక్షతన శ్రీకాకుళం లోగోను మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు గురువారం ఆవిష్కరించారు. అనంతరం కార్పొరేషన్ లో టౌన్ ప్లానింగ్ శాఖ, ప్రజలతో కలిపి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో సుమారు 15 ప్రాంతాలు ప్లానింగ్ లేకుండా కట్టడాలు జరుగుతున్నట్టు గుర్తించామన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం పోటీ పరీక్షల్లో నైపుణ్యం సాధించిన వారికి మాత్రమే ఉద్యోగాలు […]

Read More