అబుదాబి: ఐపీఎల్ 13 సీజన్లో అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మరోసారి చేయి సాధించింది. రాజస్థాన్ రాయల్స్ లక్ష్యసాధనలో చేతులెత్తేసింది. ముంబై రాజస్థాన్‌పై 57 పరుగుల తేడా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఓపెనర్లు డికాక్ 23 (15 బంతుల్లో, 3 ఫోర్లు, ఒక సిక్స్), రోహిత్‌శర్మ 35 (23 బంతులు, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యాకుమార్ యాదవ్ 79 (47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులతో ఆకట్టుకున్నాడు. […]
సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని చంద్రశేఖర్ నగర్లో మంగళవారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దుర్గాదేవి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చందర్ మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గంలోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు చెప్పారు.
సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల పాలన కొనసాగుతున్నదని సీపీఐ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీపీఐ నేతలు కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ కు వినతిపత్రం ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చినవారిలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేశ్, నాయకులు టీ మల్లయ్య, కే రాజారత్నం, టీ రమేశ్ కుమార్, రేణిగుంట ప్రీతం, […]
సారథి న్యూస్, రామగుండం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రపంచస్థాయి గాయకుడని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక లక్ష్మీఫంక్షన్హాల్లో రామగుండం సంస్కృతి సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ బాలూ సంస్మరణసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ.. బాలూ గొప్ప కళాకారుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అభిషేక రావు, కార్పొరేటర్లు అడ్డాల సరూప, రామస్వామి, జంగపల్లి సరోజన, కనకయ్య, కృష్ణవేణి భూమయ్య, బాల్ రాజ్ కుమార్, దాత శీను వాస్, […]
సారథి న్యూస్. రామగుండం: సింగరేణి వార్షిక లాభాల్లో కార్మికులకు వాటా ఇప్పించడానికి కృషి చేస్తున్నామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు పేర్కొన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో మాట్లాడతామని చెప్పారు. మంగళవారం లాంగ్వాల్ ప్రాజెక్టులో నిర్వహించిన సమావేశంలో వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2400 మంది బదిలీ వర్కర్ లను జనరల్ మజ్దూర్ గా ప్రమోషన్ సాధించి ఇప్పించిన ఘనత టీబీజీకేఎస్ దే […]
సారథిన్యూస్, రామగుండం: పరవళ్లు తొక్కుతూ, పంట చేలను తడుపుతూ, రైతన్నలను పరవశింపజేసే గోదావరి తల్లికి కాలుష్యం కాటు వేసింది. ప్రస్తుతం రామగుండం పారిశ్రామిక వాడ సమీపంలోని గోదావరి నది నీటిమధ్యలో ఓ వింత నురగ ప్రవహిస్తోంది. పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత నీరు నదిలోకి వదలడం వల్ల ఈ నురుగ వస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. మంగళవారం ఈ కాలుష్య నురుగను గమనించిన రామగుండం సీపీఐ కార్యదర్శి మద్దెల దినేశ్ కాలుష్య నియంత్రణ అధికారికి తెలిపారు. రంగంలోకి దిగిన […]
సారథి న్యూస్, రామాయంపేట: పంటలను ఆశించే తెగుళ్లను సకాలంలో అరికడితేనే అధిక దిగుబడి సాధించవచ్చని నిజాంపేట మండల వ్యవసాయాధికారి సతీశ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మండలంలోని చల్మేడ గ్రామంలో జాతీయ విత్తనోత్పత్తి పథకంలో భాగంగా రైతులకు విత్తనోత్పత్తి చేసే రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విత్తనోత్పత్తి లో తీసుకోవాల్సిన మెలకువలు, పంటను ఆశించు తెగుళ్లు, పురుగులు అరికట్టేవిధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో గణేశ్‌కుమార్, సర్పంచ్ నరసింహారెడ్డి, రైతులు శ్రీనివాస్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలంలో సాగైన వరి ధాన్యం, పత్తి పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తాలు, పొల్లు లేకుండా ఎండబోసిన వరిధాన్యాన్ని తెచ్చి కనీస మద్దతు ధర పొందాలని, తేమ ఎక్కువ ఉన్న ధాన్యాన్ని తెచ్చి ఇబ్బంది పడవద్దని సీఎం రైతులను కోరారు. రాష్ట్రంలో మొత్తం ఆరువేల కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. పంటలకు పెట్టుబడి అందించడం నుంచి […]