Breaking News

Day: October 5, 2020

ఆహ్లాదభరితం.. ఆనందమయం

ఆహ్లాదభరితం.. ఆనందమయం

ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆసక్తి చూపుతున్న ప్రేమికులు శ్రీశైలం, సుంకేసుల, జూరాల, అవుకుకు వెళ్లేందుకు టూరిస్టుల ఆసక్తి సారథి న్యూస్, కర్నూలు: కరోనా ముప్పు ఇప్పుడిప్పుడే తొలగిపోయినట్టు కనిపిస్తోంది. జిల్లాలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పలువురు టూరిస్టులు ఆసక్తి చూపుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా తరలివస్తుండడంతో తుంగభద్ర, కృష్ణానదులు ఉవ్వెత్తున ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి , నారాయణ్‌పూర్‌ డ్యాం గేట్లు ఎత్తడంతో జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరదనీరు ఉధృతికి […]

Read More
ఐఐటీ అడ్వాన్స్​డ్​ఫలితాల్లో ‘శ్రీ చైతన్య’ విజయకేతనం

ఐఐటీ అడ్వాన్స్​డ్ ​ఫలితాల్లో ‘శ్రీ చైతన్య’ విజయకేతనం

సారథి న్యూస్, కర్నూలు: విడుదలైన ఐఐటీ అడ్వాన్స్​డ్​ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కర్నూలు శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చూపారని కాలేజీ ఏజీఎం మురళీకృష్ణ తెలిపారు. బి.హర్షవర్ధన్ నాయక్ (హాల్ టికెట్ నం. 6057057)ఎస్టీ కేటగిరీలో జాతీయస్థాయిలో 786వ ర్యాంక్, బి.గౌతమ్ నాయక్ (హాల్ టికెట్ నం.6059090) ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 928వ ర్యాంక్, ఆర్.యమున(హాల్ టికెట్ నం.6007039) ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 950వ ర్యాంక్, జి. ఐశ్వర్య (హాల్ టికెట్ నం.6058093) ఎస్సీ […]

Read More

కొనసాగుతున్న ఇండ్లు, ఆస్తుల నమోదు

సారథిన్యూస్​, మానోపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలో ఇండ్లు, ఆస్తుల నమోదు కార్యక్రమం కొనసాగుతున్నది. ఆదివారం జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి ముషాహీదా బేగం మానోపాడులో పర్యటించి నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఇండ్లు, ఆస్తుల నమోదుకు ప్రతి ఒక్కరు సహకరించాలని, తమ ఆస్తులు ఆన్​లైన్​లో వచ్చేలా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. మండలంలో నారాయణపురం, పెద్ద ఆముదాలపాడ్, చిన్న పోతుల పాడ్, పెద్ద పోతుల పాడ్, చంద్రశేఖర్ నగర్ గ్రామాల్లో జజరుగుతున్న ఇండ్ల నమోదును ఆమె […]

Read More

మంత్రి నిరంజన్​రెడ్డికి ఘన సన్మానం

సారథిన్యూస్​, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆదివారం జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మంత్రులు సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​ను సన్మానించారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గద్వాల జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆమె మంత్రులను కోరారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Read More

జులై నాటికి 25 కోట్ల మందికి వ్యాక్సిన్

న్యూఢిల్లి: ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ కు వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందా అవిష‌యంపై ఇప్పటికీ స్ప‌ష్ట‌త లేదు. కానీ ప‌లు సంస్థ‌లు వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే అస‌లు వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుంది..? వ‌స్తే ముందుగా ఎవ‌రికి ఇవ్వాల‌నేదానిపై ప్ర‌భుత్వాలు త‌లలు ప‌ట్టుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో భార‌త్ లో క‌రోనా విజృంభిస్తున్న త‌రుణంలో.. వ్యాక్సిన్ వ‌స్తే ఎవ‌రికి అంద‌జేయాల‌ని దాని మీద కూడా జోరుగా చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. ఇదే విష‌యంపై కేంద్ర వైద్య […]

Read More

కేసులు తగ్గుతున్నా.. వ్యాప్తి ఆగట్లే..

న్యూఢిల్లీ : దేశంలో కరోనా రికవరీలు పెరుగుతున్నా.. గతనెలతో పోల్చితే రోజూవారీ కేసులలో తగ్గుదల కనిపిస్తున్నా.. వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. రోజూ 75 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. సోమవారం నమోదైన కొత్త కేసుల (74,441) తో కలిపి.. భారత్ లో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,23,815 కు చేరుకున్నది. మరోవైపు మరణాల సంఖ్య కూడా ఇటీవలే లక్ష దాటింది. గత 24 గంటల్లో మరణించిన 903 మందితో కలిపి… దేశంలో […]

Read More

భీమ్ఆర్మీ చీఫ్​పై ఎఫ్ఐఆర్

లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ సామూహికల లైంగికదాడి ఘటన విషయంలో.. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. నిబంధనలను అతిక్రమించినందుకు గానూ ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆజాద్ తో పాటు మరో 400 మందిపై కేసులు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరి పేర్లను వెల్లడించలేదు. హత్రాస్ బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించడానికి ఆదివారం తన అనుచరులతో కలిసి […]

Read More

ఫేసులకు కాదు.. బండ్లకు పెడుతున్నారు మాస్కులు

హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని నివారించడానికని తీసుకొచ్చిన మాస్కులను ముఖానికి ధరించాలని ప్రభుత్వాలు.. వైద్యులు చెబుతుంటే పలువురు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ‘అది మమ్మల్ని ఏమీ చేయదు.. కరోనా వస్తే మాకేంటి..?’ అనే రీతిలో నడుచుకుంటున్నారు. హైదరాబాద్ లో అయితే పలువురు ఆకతాయిలైతే.. నిఘా కెమెరాలను, పోలీసుల ఈ ఛాలన్ల నుంచి తప్పించుకోవడానికి కూడా మాస్కులనే వాడుతున్నారు. అదేంటి.. మాస్కులకు, ఈ ఛాలన్లకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? అయితే ఈ వార్త చదవాల్సిందే.. హెల్మెట్ లు పెట్టుకోకుంటే […]

Read More