Breaking News

Day: October 5, 2020

హత్రాస్​ ఘటన బాధ్యులను వదలొద్దు

సారథి న్యూస్ రామడుగు: హత్రాస్​​లో దళిత యువతిపై లైంగికదాడి చేసి ఆమె మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని కరీంనగర్​ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాడే శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన రామడుగులో విలేకరులతో మాట్లాడారు. యూపీలో జరిగిన ఘటన నిరంకుశ పాలనకు నిదర్శనమని శంకర్ మండిపడ్డారు. కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, కిషన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సయిండ్ల నర్సింగం, మండల పార్టీ ప్రెసిడెంట్ బొమ్మరవేని […]

Read More

కరకట్ట కోసం నిధులు ఇవ్వండి

సారథి న్యూస్​, ములుగు: గోదావరి నదిపై కరకట్ట నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలని నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్ కుమార్ కు ములుగు ఎమ్మెల్యే సీతక్క వినతిపత్రం ఇచ్చారు. సోమవారం ఆమె హైదరాబాద్​లో రజత్​కుమార్​ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గంలోని మూడు మండలాల గుండా దాదాపు 100 కి.మీ.మేర గోదావరి ప్రవహిస్తుందని చెప్పారు. ఏటా వచ్చే వరదల వల్ల వందలాది ఎకరాల పంట పొలాలు కోతకు గురవుతున్నాయని చెప్పారు. […]

Read More
ఆర్సీబీకి ఘోర పరాజయం

ఆర్సీబీకి ఘోర పరాజయం

దుబాయ్‌: ఐపీఎల్​13వ సీజన్​లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్‌ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్​ ఎంచుకుంది. బ్యాటింగ్ ​చేపట్టిన ఢిల్లీ 197 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. పృథ్వీషా(42;23 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లు), శిఖర్‌ ధావన్‌(32; 28 బంతుల్లో 3 ఫోర్లు), స్టోయినిస్‌( 53 నాటౌట్‌; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌(37; 25 బంతుల్లో 3 […]

Read More

బాధిత కుటుంబానికి బీమా​ అందజేత

సారథి న్యూస్, వాజేడు: ఖమ్మం జిల్లా వెంకటాపురం సబ్ ఆఫీస్ పరిధిలోని గుమ్మడి దొడ్డి బ్రాంచ్ ఆఫీస్ లో పనిచేస్తున్న పాయం ప్రసాద్ ఇటీవల మృతిచెందాడు. సోమవారం వెంకటాపురంలో అతడి భార్య పాయం శకుంతలకు పోస్టల్ సిబ్బంది లైఫ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ డబ్బులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజనల్ సూపరింటెండెంట్​, భద్రాచలం నార్త్ అసిస్టెంట్ సూపర్ డెంట్ తదితరులు పాల్గొన్నారు.

Read More
ప్రకృతివనం పరిశీలన

ప్రకృతివనం పరిశీలన

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం గోపాల్​రావుపేట గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సోమవారం గ్రామ పాలకవర్గం పరిశీలించింది. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వారి కుటుంబ సభ్యుల తో కలసి సోమవారం పకృతి వనాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్ర సత్య ప్రసన్న, ఉపసర్పంచ్ ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీలు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, ఎడవెల్లి కరుణశ్రీ, రామడుగు మండల కో ఆప్షన్ రజబ్ అలీ వార్డు […]

Read More

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

సారథి న్యూస్​, గద్వాల​: ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్​లో సోమవారం చోటుచేసుకుంది. మల్దకల్ గ్రామానికి చెందిన నాగరాజు భార్య జాహ్నవికి నాలుగేండ్ల క్రితం మొదటి కాన్పులో మగపిల్లవాడు జన్మించాడు. రెండవ కాన్పు కోసం శనివారం కర్నూల్లోని బాలాజీ యశోద నర్సింగ్ హోంలో చేరగా.. ఆమెకు ఈ కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు జన్మించారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.

Read More
రైతుల మేలు కోసమే ఉచిత విద్యుత్​

రైతుల మేలు కోసమే ఉచిత విద్యుత్​

సారథి న్యూస్, కర్నూలు: రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి అన్నారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయం సమావేశ భవనంలో వైఎస్సార్​ ఉచిత విద్యుత్‌ పథకంపై డివిజన్‌ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల సబ్​ కలెక్టర్‌ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విద్యుత్​ను అందించడమే లక్ష్యంగా వైఎస్సార్​ ఉచిత విద్యుత్​ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతులను […]

Read More
కర్నూలు మార్కెట్​ చైర్మన్​గా రోకియాబీ

కర్నూలు మార్కెట్​ చైర్మన్​గా రోకియాబీ

వైస్‌ చైర్మన్‌గా కేశవరెడ్డి గారి రాఘవేంద్రరెడ్డి ఉత్తర్వులు జారీచేసిన ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా కోటిముల్లా రోకియా బీని నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కమిటీ గౌరవాధ్యక్షుడిగా కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ను నియమిస్తూ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, సభ్యుల పేర్లను ఖరారుచేసింది. కమిటీ అధ్యక్షుడిగా కోటిముల్లా రోకియాబీ, ఉపాధ్యక్షుడిగా కేశవ రెడ్డి గారి రాఘవేంద్ర రెడ్డి, సభ్యులుగా సాంబశివారెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, […]

Read More