సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పసుపుల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలకు పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించలేని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను బర్తరఫ్చేయాలని డిమాండ్ చేశారు. హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన దారుణ ఘటనను ఖండిస్తూ.. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద […]
కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీంను 2016 ఆగస్టు 8న పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడి అక్రమాలు ఒక్కొక్కటీ బయటికొచ్చాయి. నయీం పోలీసులను అడ్డుపెట్టుకొని అనేక అక్రమాలు చేశాడని వార్తలు వినిపించాయి. అప్పట్లో నయీం అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సిట్‌తో దర్యాప్తు చేయించింది. అయితే దర్యాప్తు చేసిన సిట్.. నయిం అక్రమాల్లో పోలీసుల పాత్ర ఏమీలేదని తేల్చిచెప్పింది. నయీం భూ అక్రమాలకు సహకరించినట్టు పలువురు ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు అధికారులపై ఆరోపణలు […]
కర్ణాటక సినీ పరిశ్రమను డ్రగ్స్ కేసు కుదిపేస్తున్నది. ఇప్పటికే హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి డ్రగ్స్‌కేసులో అరెస్టయ్యారు. అయితే వారు సెక్స్ రాకెట్ కూడా నడుపుతున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. మరోవైపు సంజనా, రాగిణి ఎవరిపేరు బయటపెడతారో అని సర్వత్రా టెన్షన్ నెలకొన్నది. అయితే ఇటీవల ఈ కేసులో కర్ణాటకకు చెందిన ప్రముఖ టీవీ యాంకర్ అనుశ్రీని పోలీసులు విచారణకు పిలించారు. దీంతో అనుశ్రీ డ్రగ్స్‌కేసులో ఇరుక్కున్నదంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో అనుశ్రీ ఇన్‌స్టాలో […]
సారథిన్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి మామ, భారతిరెడ్డి తండ్రి ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గంగిరెడ్డి పులివెందులలో చాలా కాలం పాటు వైద్యుడిగా పనిచేశారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డికి ఆయన మంచి మిత్రుడు. ఆయన 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. పులివెందులలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీఎం జగన్ ఇవాళ పులివెందులకు వెళ్లనున్నట్టు సమాచారం.
కోరికల కోరలు చాచిన తాచుల చుట్టూనా గారాల పట్టి చప్పుడు ఆగిపోయేనా ! కత్తుల పదును వాంఛలున్న ఉన్మాదుల మధ్యకుత్తుక ఆగి కొట్టుమిట్టాడేనా ! బలంతో విర్రవీగే బకాసురాల నడుమబలహీనమై నీ వెన్నుపూస విరిగేనా ! కామంతో మసిలిన ఆ కాల యముళ్లునీ కలలను కడతేర్చారా తల్లి ! నరరూప “మాన భక్షకులు”నీ నాలుక తెగ్గోసారా చెల్లి !! ఏ రాముడు దుష్ట సంహారం చేయలేదు,క్షమించు..చీకటి సాక్షిగా నిప్పులో తోసేసాము !! బచావో అన్న నీ కన్నవాళ్ళ […]
సారథి న్యూస్, మెదక్: పాత్రికేయుల జీవితాలను చిదిమివేస్తున్న కరోనా నుంచి భద్రత కల్పించాలనే డిమాండ్‌తో గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) పిలుపు మేరకు దేశవ్యాప్త నిరసనలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరాస్తాలో జర్నలిస్టులు సత్యాగ్రహం నిర్వహించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూ జే (ఐజేయూ) మెదక్ జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాళ్ చారి, యూనియన్ రాష్ట్ర […]
ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య సారథి న్యూస్, ములుగు: మహాత్మాగాంధీ మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగు జాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. శుక్రవారం మహాత్మాగాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ లో గాంధీజీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక రుగ్మతలు లేకుండా దేశం అభివృద్ధిపథంలో నడిపేందుకు కృషిచేసిన గాంధీజీ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు ఇచ్చిన ఘనమైన […]
సారథి న్యూస్, కర్నూలు: నిబద్ధత, పట్టుదల, కృషి, సమయస్ఫూర్తి.. వంటివి మహాత్మగాంధీని దేశానికి జాతిపితగా చేశాయని, ప్రతిఒక్కరూ ఆయన బాటలో నడవాలని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాయంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ముఖ్యఅతిథులుగా నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. […]