Breaking News

Day: October 3, 2020

బొగ్గు ఉత్పత్తి పెంచండి

సారథి న్యూస్​, రామగుండం: అర్జీ 1 ఏరియాలో 100 శాతం బొగ్గు ఉత్పత్తికి కృషిచేయాలని, ప్రతి ఒక్కరూ లక్షణ సూత్రాలు పాటించాలని ఆర్ జీ వన్ జీఎం కే నారాయణ కోరారు. శనివారం సాయంత్రం ఆయన జీఎం కార్యాలయంలో గని అధికారులతో సమీక్షించారు. ఉత్పత్తి ఉత్పాదకత పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలను చర్చించారు. సమావేశంలో అధికారులు త్యాగరాజు, బెంజిమెన్, కేవీ రావు, సత్యనారాయణ, అప్పారావు, వెంకటేశ్వరరావు, నవీన్ కుమార్, ఆంజనేయులు, మురళీధర్, హరినాథ్, గని మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.

Read More
ఈసీ గంగిరెడ్డి మృతికి సంతాపం

గంగిరెడ్డి మృతికి ధర్మాన సంతాపం

సారథి న్యూస్​, నరసన్నపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గంగిరెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఎటువంటి ఫీజు తీసుకోకుండా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన గంగిరెడ్డి పేదల డాక్టర్ గా మంచి గుర్తింపు పొందారన్నారు. కడప జిల్లాలో వైఎస్సార్‌ సీపీ ఐలోపేతానికి గంగిరెడ్డి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. నిత్యం అందుబాటులో ఉండి […]

Read More
డోనాల్డ్ ట్రంప్ కు కరోనా

డోనాల్డ్ ట్రంప్ కు కరోనా

ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కు కూడా.. క్వారంటైన్ కి వెళ్లిన యూఎస్ అధ్యక్షుడు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ట్వీట్ న్యూయార్క్: మరికొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగలింది. ట్రంప్ తో పాటు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ […]

Read More

మొగి పురుగును అంతమొందిద్దాం

సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుతం వరిపంటకు మొగి పురుగు ఆశించిందని తగిన మందులు వాడి అరికట్టవచ్చని నిజాంపేట మండల వ్యవసాయాధికారి సతీష్​ పేర్కొన్నారు. శనివారం ఆయన నిజాంపేట మండలంలో వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి పంటలో మొగి పురుగు పొట్ట దశలో ఉన్నప్పుడే కార్టప్ హైడ్లో క్లోరైడ్ 400 గ్రామ్స్ లేదా కోరాజిన్ 60 ఎంఎల్​ లీటర్​ నీటికి ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలని సూచించారు. అలాగే దోమపోటు నివారణకు డినోటీఫ్యూరన్ […]

Read More

హత్రాస్ నిందితులను కాల్చిచంపండి

సారథి న్యూస్, రామాయంపేట: యూపీలోని హథ్రాస్​ ఘటనపై యావత్​ దేశం తీవ్రంగా స్పందిస్తున్నది. నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. మెదక్​ జిల్లా నిజాంపేట మండలలో శనివారం అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హథ్రాస్​ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని వెంటనే ఉరితీయాలని నేతలు డిమాండ్​ చేశారు. పశుగ్రాసం కోసం వెళ్లిన యువతిని లాక్కెళ్లి ఆమెపై క్రూరంగా లైంగికదాడి చేయడం అమానవీయ చర్య అని అభివర్ణించారు. అనంతరం తల్లిదండ్రులకు కూడా […]

Read More

రైతన్నల ఆక్రందనలు వినిపించవా?

సారథి న్యూస్​, మానవపాడు: ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయి రైతులు బాధపడుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఎంజాయ్​ చేస్తున్నారని కాంగ్రెస్​ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. శనివారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ నియోజకవర్గంలో పర్యటించి పంటలను పరిశీలించారు. మానవపాడు మండలం మానవపాడు, అమరవాయి గ్రామాల్లో పంటలను పరిశీలించారు. పత్తి, మిరప పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని.. అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపించారు. ఆయన వెంట మనోపాడ్ […]

Read More
పక్కాగా ఆస్తి వివరాల నమోదు

పక్కాగా ఆస్తి వివరాల నమోదు

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: గ్రామంలోని ఇండ్లు, ఇత‌ర అన్నిర‌కాల నిర్మాణాల‌కు భద్రత కల్పిస్తూ ప‌ట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకోసం అన్ని ఇండ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ​ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్ లో పొందుపర్చాలని, నాగర్ కర్నూలు జిల్లా అడిషనల్​ కలెక్టర్​ మనుచౌదరి ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. బిజినేపల్లి మండలం షాహిన్ పల్లి, అల్లిపూర్, సల్కరిపేట గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆస్తి ఆన్​లైన్​ ప్రక్రియను క్షేత్రస్థాయిలో శిక్షణ సహాయ కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి పరిశీలించారు. […]

Read More
ప్రాణాలు పోతున్నయ్.. గుంతలు పూడ్చండి

ప్రాణాలు పోతున్నయ్.. గుంతలు పూడ్చండి

సారథి న్యూస్, హుస్నాబాద్: రోడ్లపై గుంతలు ఎక్కువగా పడడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే గుంతలను పూడ్చాలని కాంగ్రెస్ హుస్నాబాద్​ మండలాధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ అన్నారు. రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్​ చేస్తూ శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. హన్మకొండ నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రానికి వెళ్లే మెయిన్​రోడ్డు దెబ్బతినడంతో నిత్యం యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అన్నారు. ఆ గుంతల్లో జూలై 7న జెండాలు పాతి నిరసన తెలిపినా మంత్రి, అధికారులకు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా […]

Read More