Breaking News

Day: September 29, 2020

ఎల్ఆర్ఎస్ పేదలకు శాపం

సారథి న్యూస్, రామడుగు/ రామాయంపేట /చిన్నశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పేద ప్రజలకు గుదిబండ అని బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు మురళి విమర్శించారు. ఎల్​ఆర్​ఎస్​ను నిరసిస్తూ మంగళవారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ పేరుతో తీసుకొచ్చిన జీవో 131 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. మరోవైపు ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని డిమాండ్​ […]

Read More

పక్కాగా.. ఫీవర్ సర్వే

సారథి న్యూస్​, శ్రీకాకుళం: ఇంటింటి ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలని శ్రీకాకుళం మున్సిపల్ అర్బన్ ప్రత్యేక అధికారి టీవీఎస్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నగరంలోని బాకర్ సాహెబ్ పేట, పుణ్యపు వీధి రైతు బజార్,.. సచివాలయ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది నుంచి ఫీవర్ సర్వే రిపోర్టులు అడిగి తెలుసుకున్నారు. సర్వే చేసేటప్పుడు ఏ ఇంటిని మర్చిపోవద్దని సూచించారు.

Read More

వ్యవసాయ బిల్లు.. రైతులకు గుదిబండ

సారథి న్యూస్ శ్రీకాకుళం: కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయబిల్లు పేద రైతులకు గుదిబండ లాంటిదని.. కార్పొరేట్లకు మేలు చేకూర్చేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని సీపీఐ నేతలు ఆరోపించారు. మంగళవారం కేంద్ర బిల్లులకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో సీపీఐ శ్రేణులు ఆందోళకు దిగాయి. ఈ దీక్షలో సీపీఐ నేతలు బుడితి అప్పలనాయుడు, మన్మధరావు, ద్వారపూడి అప్పలనాయుడు, కూరంగి గోపినాయుడు సీతమ్మ ఆరిక హరిబాబు‌,టొంపల ఆదినారొయణ,ఊయక వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఇలా చేస్తే.. కరోనా ఎందుకు రాదు

మానోపాడు: ఒకవైపు కరోనా మహమ్మారి ఇంకా ప్రబలుతుంటే కొందరేమో సామాజిక దూరం, మాస్కు ధరించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలోని ఎస్​బీఐ బ్యాంకు దగ్గర బ్యాంకు రుణాలపై మహిళా సంఘాలకు, సమైక్య అధికారులు ఎస్​బీఐ బ్యాంక్ సిబ్బంది అవగాహన కల్పించారు. అయితే ఈ సమావేశానికి100 మంది దాకా హాజరయ్యారు. అయితే వారేవరూ మాస్కు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.

Read More
‘దారి’ చూపండి సార్లూ..!

‘దారి’ చూపండి సార్లూ..!

సారథి న్యూస్, పెబ్బేర్: రాజకీయ నాయకులు ఆ ఊరు వైపునకు ఓట్లకు తప్ప ఏనాడూ కన్నెత్తిచూడరు. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా పట్టించుకోరు..! వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు ఆ ఊరుకు వెళ్లే రోడ్డంతా బురదమయంగా మారింది. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ఏనాడూ 108 అంబులెన్స్ ​వచ్చిన దాఖలాల్లేవ్. వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ మండలం తాటిపాముల పంచాయతీకి మూడు కి.మీ. దూరంలో ఉన్న తాటిపాముల తండా(కుంటివానితండా)కు ప్రధాన రహదారి తెగిపోవడంతో స్థానిక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. […]

Read More
అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. 287 డిజైన్లతో బంగారు, వెండి అంచులో చీరలను తయారుచేసినట్లు వెల్లడించారు. రైతన్నల, నేతన్నల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. బతుకమ్మ పండుగకు కానుకగా ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తుందన్నారు. మంగళవారం బేగంపేట హరితప్లాజాలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనను మంత్రులు కె.తారక రామారావు, సబితాఇంద్రారెడ్డి, […]

Read More

దుబ్బాకలో ఎన్నికల సందడి

నోటిఫికేషన్ రాక ముందే రాజకీయ వేడి మండలాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హాడావిడి బీజేపీ నేతల మకా..గాడిన పడని కాంగ్రెస్ పల్లెల్లో నేతల మోహరింపు సారథి న్యూస్, దుబ్బాక: రాజకీయ పార్టీలు అధికారికంగా తమ అభ్యర్థులను ప్రకటించకముందే దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరమైంది. ఎవరికి వారే అన్నట్లుగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించకున్నా స్థానికంగా మాత్రం రాజకీయ సందడి నెలకొన్నది. ఇప్పటికి ఎన్నికల ప్రకటన సైతం వెలువడలేదు […]

Read More

డ్రగ్స్​కేసుపై దివ్యవాణి షాకింగ్​ కామెంట్స్​

తెలుగుదేశం పార్టీ మహిళా నేత దివ్య వాణి తెలంగాణ ప్రభుత్వం, డ్రగ్స్​ కేసుపై షాకింగ్ కామెంట్స్​ చేశారు. ‘గతంలో ఓ సారీ టాలీవుడ్​లో డ్రగ్స్​కేసు అంటూ హడావుడి చేశారు. ఈ కేసు ఎందుకు మరుగున పడింది. విచారణ ఎందుకు ఆగిపోయింది. అందులో ఎవరెవరు ఉన్నారు.’ అంటూ వ్యాఖ్యానించారు. సోమవారం టీడీపీ-టీఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ‘తెలంగాణ మహిళా కమిషన్‌ ఆవశ్యకత-ఏర్పాటు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దివ్యవాణి మాట్లాడారు. ఇంకా ఆమె […]

Read More