Breaking News

Day: September 25, 2020

తెలియదు.. మర్చిపోయా.. గుర్తులేదు! ఎన్​సీబీకి రకుల్​ ఆన్సర్స్​

ప్రముఖ నటి రకుల్ ప్రీత్​సింగ్​ శుక్రవారం ఎన్​సీబీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఆమెను సుమారు 4 గంటలపాటు ఎన్​సీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు రకుల్​ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానం చెప్పిందట దీంతో అధికారులు షాక్​కు గురయ్యారని సమాచారం. మరోవైపు రియాతో రకుల్​ చాట్​చేసినట్టు ఎన్​సీబీకి కీలక ఆధారాలు లభించాయి. దీంతో చాటింగ్​ కు సంబంధించిన స్క్రీన్​షాట్లను వారు రకుల్​కు చూపించినట్టు టాక్​. అయితే తాను రియాతో డ్రగ్స్​కు గురించి చాటింగ్​ […]

Read More
వైభవంగా తుంగభద్ర పుష్కరాలు

వైభవంగా తుంగభద్ర పుష్కరాలు

ఏర్పాట్లకు పూర్తిస్థాయిలో సహకరిస్తాం ఎమ్మెల్యేకు హామీ ఇచ్చిన జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్​యాదవ్​ సారథి న్యూస్, కర్నూలు: పన్నెండేళ్లకోసారి వచ్చే తుంగభద్ర పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని, అందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌కు హామీ ఇచ్చారు. శుక్రవారం అమరావతిలో నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా […]

Read More
‘మత్తు’ దిగాల్సిందే..!

‘మత్తు’ దిగాల్సిందే..!

ఆర్టీవో చెక్‌ పోస్టు వద్ద భారీగా మద్యం పట్టివేత 588 మద్యం బాటిళ్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన సెబ్‌ సీఐ రాజశేఖర్‌ గౌడ్‌ సారథి న్యూస్, కర్నూలు: అక్రమ మద్యం రవాణాదారులకు పలుమార్లు చెప్పినా మార్పు రావడం లేదని, పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తరలిస్తూ వారి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) సీఐ రాజశేఖర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు హైవేలోని టోల్‌ గేట్‌ వద్దనున్న ఆర్టీవో చెక్‌పోస్టు వద్ద సెబ్‌ […]

Read More
‘కైలాస్‌’ అరెస్టు వెనక రాజ‘కీ’యం?

‘కైలాస్‌’ అరెస్టు వెనక రాజ‘కీ’యం?

ఫిర్యాదుచేసిన వ్యక్తికే తెలియకుండా.. కేసు నమోదు ఎస్పీని కలుస్తానన్న ఫిర్యాదుదారుడు సారథి న్యూస్​, కర్నూలు: లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కైలాస్‌ నాయక్‌ అరెస్టు వెనక రాజ‘కీ’య కారణాలు ఉన్నాయనే విమర్శలు వ్కక్తమవుతున్నాయి. జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని కర్నూలు మండలం సుగాలితండాకు చెందిన 150 కుటుంబాలకు రుద్రవరం గ్రామంలో 1975లో అప్పటి ప్రభుత్వ ఐదెకరాల చొప్పున పంపిణీ చేసింది. సర్వేనం.507‘ఏ’ లోని దాదాపు 95 ఎకరాలను ఇటీవల పేదలకు ఇళ్లస్థలాల కోసం రాష్ట్ర […]

Read More

మామా.. ఏక్​ పెగ్​ లా! తెలంగాణలో బార్లు ఓపెన్​

సారథిమీడియా, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మందుబాబులు ఖుషీ అయ్యే న్యూస్​ చెప్పింది. రాష్ట్రంలో బార్​లు, క్లబ్​లు తెరుచేందుకు అనుమతి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా లాక్​డౌన్​ తర్వాత బార్​, క్లబ్బులు, పబ్​లు బంద్​ అయ్యాయి. దీంతో వాటి నిర్వాహకులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు ఆరునెలల తర్వాత ప్రభుత్వం బార్లకు అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలకు లోబడి వీటిని అనుమతించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తక్షణం అమల్లోకి […]

Read More
తరాల భూముల తగవులకు ముగింపు పలికింది

తరాల భూముల తగవులకు ముగింపు పలికింది

సారథి న్యూస్​, అచ్చంపేట: తరాల భూముల తగవులకు ముగింపు పలికేలా, కొత్త తరాలకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా కొత్త చట్టం ఉందని, తెలంగాణ రైతుల కష్టాలు తీర్చడమే ధ్యేయంగా సీఎం రెవెన్యూలో భారీ సంస్కరణలకు సీఎం కె.చంద్రశేఖర్​రావు శ్రీకారం చుట్టారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి కొనియాడారు. నూతన రెవెన్యూ చట్టం అమలు సందర్భంగా.. సీఎం కె.చంద్రశేఖర్​రావుకు సంఘీభావం తెలియజేస్తూ శుక్రవారం ఉదయం అచ్చంపేటలో నియోజకవర్గ రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వ్యవసాయశాఖ మంత్రి […]

Read More
మూరుమూరులో ‘ఫ్రై డే.. డ్రై డే’

మూరుమూరులో ‘ఫ్రై డే.. డ్రై డే’

సారథి న్యూస్, వాజేడు: వానాకాలంలో నిల్వ ఉన్న నీటితో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు శుక్రవారం ములుగు జిల్లా వాజేడు మండలం మూరుమూరు పంచాయతీలో ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించారు. సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ పూసం నరేష్, హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, శేఖర్, కన్యాకుమారి, ఛాయాదేవి, లలిత కుమారి, అంగన్​వాడీ టీచర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More
టేకులగూడెంలో కరోనా టెస్టులు

టేకులగూడెంలో కరోనా టెస్టులు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా పేరూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని టేకులగూడెంలో డాక్టర్ సీతారామరాజు ఆధ్వర్యంలో శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 61మందికి వైద్యపరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్​ రిపోర్టు వచ్చింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వ్యాధి నిర్ధారణ టెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఫార్మసిస్ట్ యాలం సతీశ్, హెల్త్ అసిస్టెంట్ కె.తిరుపతి రావు, ఎస్ఎన్ఎం జి.రజిత, ఎల్టీకే.అశ్విని, సర్పంచ్ వాసం కృష్ణవేణి, కార్యదర్శి యాలం వినోద పాల్గొన్నారు.

Read More