Breaking News

Day: September 24, 2020

చివరి గుడిసె దాకా ఫలితాలు అందాలి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె దాకా వాటి ఫలితాలు అందేలా చూడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దశాబ్దాల కాలంగా వలస పాలనలో అపరిష్కృతంగా ఉన్న నివాసస్థలాలు, సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మేయర్లతో సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇళ్లు, […]

Read More

గ్రేటర్​లో రైట్​రైట్​!

సారథిన్యూస్​, హైదరాబాద్​: గ్రేటర్​ హైదరాబాద్​లో కొన్ని నిబంధనలతో 25 శాతం బస్సులు నడిపిందేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. నిబంధనలు అమలు చేస్తూ అన్ని రూట్లలో బస్సులు నడపనున్నట్టు సమాచారం. ఈ మేరకు గురువారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ వెల్లడించారు. కరోనా లాక్ డౌన్ అప్పటి నుంచి హైదరాబాద్​లో బస్సులు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం నుంచి బస్సులు తిరిగి ప్రారంభం కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 29 డిపోలలో ఉన్న దాదాపు 2800 […]

Read More

ఉబికివచ్చిన పాతాళగంగ!

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలకేంద్ర శివారులోని మల్కా చెరువు కొన్నేండ్ల తర్వాత పూర్తి స్థాయిలో నిండి అలుగెళ్లింది. దీంతో చెరువు కింద గల బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగి ఇలా కేసింగ్ ల నుంచి నీళ్లు పైకి అస్తున్నాయ్. ఈ దృశ్యాన్ని చూసేందుకు పలువురు గ్రామస్థులు అక్కడికి వచ్చారు.

Read More

రకుల్​ నోరు విప్పితే..

డ్రగ్స్​కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్​ రకుల్​ ప్రీత్​సింగ్​ రేపు ( శుక్రవారం)ఎన్​సీబీ ( నార్కోటిక్స్​ కంట్రల్​ బ్యూరో) మందుకు వెళ్లనున్నది. అయితే రకుల్ విచారణంలో ఎవరెవరరి పేర్లు చెబుతుందోనని టాలీవుడ్​లో టెన్షన్​ నెలకొన్నది. డ్రగ్స్​కేసులో రకుల్​ పేరు వచ్చాక పలు నాటకీయపరిణామాలు చోటుచేసుకున్నాయి. రియా చక్రవర్తి చెప్పిన పేర్లలో రకుల్ ప్రీత్​సింగ్​ పేరు ఉందంటూ ఇటీవల నేషనల్​ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో రకుల్​ ఒక్కసారిగా మీడియాపై మండిపడింది. అనవసరంగా తన పేరును లాగుతున్నారని హెచ్చిరించింది. అయితే […]

Read More

కోవిడ్‌తో కేంద్ర‌మంత్రి మృతి

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖ స‌హాయ మంత్రి సురేశ్ అంగ‌డి క‌రోనా సోకి మ‌ర‌ణించారు. ల‌క్ష‌ణాలేమీ లేకున్నా (అసింప్ట‌మేటిక్‌) క‌రోనాతో రెండువారాల క్రితం ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చేరిన ఆయ‌న.. బుధ‌వారం తుదిశ్వాస విడిచారు. చికిత్స తీసుకుంటున్న స‌మ‌యంలోనే ఆయ‌నకు శ్వాస‌కోస ఇబ్బందులు త‌లెత్త‌డంతో ఆరోగ్యం క్షీణించింది. కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించిన తొలి కేంద్ర మంత్రి ఆయ‌నే. క‌ర్నాట‌కకు చెందిన సురేశ్ అంగ‌డి.. బెల్గావి పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. 2004 నుంచి వ‌రుస‌గా నాలుగుసార్లు […]

Read More

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీవరద

సారథిన్యూస్​, మహబూబ్​నగర్​: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 2,10,420 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 2,52,459 క్యూసెక్కులను దిగవకు వదలుతున్నారు. ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు కాగా ప్రాజెక్టులో 210.9946 టీఎంసీలుగా నీరు ఉన్నది. మరోవైపు కుడిగట్టు […]

Read More

కరోనాకు మరో పవర్​ఫుల్​ వ్యాక్సిన్​

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మరో పవర్​ఫుల్​ వ్యాక్సిన్​ రాబోతున్నది. ప్రస్తుతం చివరి అంటే మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ పూర్తిచేసుకున్న ఈ వ్యాక్సిన్​ ఈ ఏడాది చివరినాటికే అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ఈ వ్యాక్సిన్​ను ప్రముఖ సంస్థ జాన్సన్ & జాన్సన్ తయారు చేస్తున్నది. అయితే ఈ వ్యాక్సిన్​ కేవలం ఒక్కడోసు వేసుకుంటే సరిపోతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న చాలా వ్యాక్సిన్​లు రెండు డోసుల వేసుకోవాల్సి ఉన్నది. అయితే జాన్సన్ […]

Read More

ఏసీపీ నరసింహారెడ్డి ఆస్తులు మాములుగా లేవుగా!

అక్రమాస్తుల కేసులో ఏసీబీ చిక్కిన మల్కాజ్​గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఆస్తులు చూస్తుంటే ఏసీబీ అధికారులకే దిమ్మతిరిగిపోతుందట. అతడికి ఏకంగా రూ. 100 పైనే ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో నరసింహారెడ్డిని విచారిస్తున్నారు. నరసింహారెడ్డికి ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు సమాచారం. మరోవైపు నిన్న జరిపిన సోదాల్లో ఏసీపీ ఇంట్లో 15 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు గుర్తించారు. హైదరాబాద్​లో రెండు ఇండ్లు, హఫీజ్​పేట్​లో 3 […]

Read More