Breaking News

Day: September 15, 2020

అందరి జాతకాలు బయటపెడతాం

తాడేపల్లి: ‘అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ కూడా ఈ స్కామ్​లో ఉన్నారు. అమరావతి అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరాం. సీబీఐ విచారణతో అందరిజాతకాలు బయటకొస్తాయి’ అని వైఎస్సార్​సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారు. ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నది. ఫైబర్ గ్రిడ్ పేరుతో […]

Read More

బాలీవుడ్​పై కుట్ర.. జయాబచ్చన్​ ఫైర్​

బాలీవుడ్​పై డ్రగ్స్​పేరుతో భారీ కుట్ర జరుగుతున్నదని ఎంపీ జయబచ్చన్​ ఆరోపించారు. మంగళవారం ఉదయం ఆమె రాజ్యసభలో మాట్లాడారు. కొందరు పనిగట్టుకొని బాలీవుడ్​కు మచ్చ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా డ్రగ్స్​ తీసుకొని ఉంటే లేదా డ్రగ్స్​ మాఫియా నడిపితే అది తప్పే.. అంత మాత్రం చేత మొత్తం బాలీవుడ్​నే నిందించడం సరికాదు. డ్రగ్స్​ వ్యవహారంపై నిస్పాక్షిక విచారణ సాగాలని ఆమె కోరారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులను వేధిస్తున్నారని… ఇది సరికాదన్నారు. అంతకు ముందు ఈ […]

Read More

డ్రగ్స్​కేసులో రకుల్​.. ఎన్​సీబీ ధ్రువీకరణ

  • September 15, 2020
  • Comments Off on డ్రగ్స్​కేసులో రకుల్​.. ఎన్​సీబీ ధ్రువీకరణ

ముంబై: బాలీవుడ్​ డ్రగ్స్​ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఇప్పటికే ఈ కేసులో ఎన్​సీబీ అధికారులు రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాలీవుడ్​ కు చెందిన 25 మంది డ్రగ్స్​ తీసుకుంటారని రియా ఎన్ సీబీ అధికారులకు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఆ 25 మందిలో ప్రముఖ హీరోయిన్​ రకుల్​ ప్రీత్​ సింగ్​, బాలీవుడ్​ స్టార్​హీరో సైఫ్​అలీఖాన్​ కూతురు సారా అలీఖాన్​ ఉన్నారంటూ టైమ్స్​నౌ శనివారం ఓ సంచలన కథనం ప్రసారం చేసింది. ఈ వార్త […]

Read More
తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి శివారు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచానూరు నుంచి తాడిపత్రికి వస్తున్న తుఫాన్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. ఏడుగురికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు తాడిపత్రి వాసులేనని తేలింది. కాగా, ప్రమాదంలో మృతి చెందిన వారు హేమలత, సుబ్రమణ్యం, వెంకటరంగయ్యగా గుర్తించారు.

Read More
సిటీ బస్సులు రైట్​రైట్​

సిటీ బస్సులు రైట్ ​రైట్​

అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​లో డిపోలకే పరిమితమైన సిటీ ఆర్టీసీ బస్సు సర్వీసులు సెప్టెంబర్​ 20వ తేదీ నుంచి రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్​డౌన్ ​సడలింపు తర్వాత జిల్లాల మధ్య బస్సులు తిరుగుతున్నా నగరాలు, పట్టణాల్లో మాత్రం సిటీ బస్సులు నడపడం లేదు. ఈనెల 7న సిటీ బస్సులను షురూ చేసేందుకు సన్నాహాలు చేసినా చివరి నిమిషంలో వాయిదాపడింది. దీంతో త్వరలో ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సంస్థ కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్​లో […]

Read More
తెలంగాణలో 1.60లక్షలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో 1.60లక్షలు దాటిన కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో మంగళవారం (24గంటల్లో) 2,058 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 1.60లక్షలు దాటాయి. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 984కు చేరింది. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1,60,571 గా నిర్ధారణ అయింది. జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 277 కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు 51,247 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో 2,180 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు […]

Read More

ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి

సారథిన్యూస్, రామడుగు: పేదరికం ఆ కుటుంబాన్ని చిదిమేసింది. విధి వెక్కిరించింది. చిన్న వయసులోనే ఇద్దరు పిల్లల నా అనేవాళ్లకు దూరమై అనాథలయ్యారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామానికి చెందిన గుర్రం వనిత (17), గుర్రం నవీన్ కుమార్(6)ల తల్లిదండ్రులు నాలుగేండ్ల క్రితం ఓ ప్రమాదంలో చనిపోయారు. దీంతో వాళ్ల నాన్నమ్మే పిల్లలిద్దరినీ పెంచి పోషించింది. సోమవారం వాళ్ల నాన్నమ్మ కూడా తుదిశ్వాస విడిచింది. దీంతో వీరు అనాథలయ్యారు. ప్రస్తుతం ఆ చిన్నారులు దిక్కుతోచని స్థితిలో […]

Read More