వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేద్దాం శతజయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ.. సెప్టెంబర్7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయనున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞానమార్గ్ గా పేరుపెట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో మెమోరియల్ నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం శుక్రవారం ప్రగతి భవన్ లో […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం(24 గంటల్లో) 10,526 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4,00,721కు చేరింది. తాజాగా, వైరస్ బారినపడి 81మంది మృతిచెందారు. ఇప్పటివరకు 3,714 మంది మృత్యువాత పడ్డారు. 24 గంటల్లో 8,463 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,711కు చేరింది. తాజాగా 61,331 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తంగా 35,41,321 మెడికల్టెస్టులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 96,191 యాక్టివ్ కేసులు […]
చెన్నై: నటి మీరా మిథున్ నిత్యానందపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన చాలా గొప్పవాడని.. మీడియా అనవసరంగా నిత్యానందపై తప్పుడు ఆరోపణలు చేసిందని పేర్కొంది. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘నిత్యానంద చాలా గొప్పవ్యక్తి. ఆయన గురించి అంతా దుష్ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే నేను నిత్యానంద సృష్టించిన కైలాసానికి వెళ్లి.. ఆయనను కలుసుకుంటాను. ఆయనంటే నాకు ఎంతో గౌరవం’ అంటూ మీరామిథున్ నిత్యానందను పొగడ్తల్లో ముంచెత్తింది. కాగా మీరా వ్యాఖ్యలపై నెట్‌జన్లు మండిపడుతున్నారు.
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటీషన్‌ను శుక్రవారం అత్యున్నత ధర్మాసనం కొట్టేసింది. ఎన్నికలకు ఇప్పటికీ నోటిఫికేషన్ జారీచేయలేదని.. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్‌ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం స్పష్టం చేసింది. బీహార్‌లో కరోనా ప్రభావం అధికంగా ఉన్నదని పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నందున […]
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారికంగా నామినేషన్ స్వీకరించారు. రిపబ్లికన్ పార్టీ తరపున వైట్‌హౌస్ సౌత్‌లాన్ నుంచి ఆయన అధ్యక్ష పదవికి నామినేట్ అయ్యారు. తాను సగర్వంగా ఈ నామినేషన్‌ను స్వీకరిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. గత నాలుగేండ్లలో చేసిన పురోగతికి తాను గర్వపడుతున్నానని చెప్పారు. రెండోసారి తనను గెలిపించేందుకు అమెరికా ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. డెమోక్రాట్ అభ్యర్థి జో బిడెన్‌కు అధికారం కట్టబెడితే ఆమెరికాను నాశనం చేస్తాడని […]
సోషల్ మీడియాలో చిలిపిగా పోస్టులు పెట్టే అదా శర్మ కెమెరా ముందుకి వచ్చేసరికి పెర్ఫామెన్స్ అదరగొడుతుంది. రీసెంట్ గా బాలీవుడ్ చిత్రం ‘కమాండో 3’లో ఇన్స్పెక్టర్ భావనారెడ్డిగా ఆకట్టుకుంది. రీసెంట్ గా ఆదా తెలుగులో రెండు సినిమాలకు కమిట్ అయింది. అందులో ఓ థ్రిల్లర్ మూవీలో నటించడానికి రెడీఅయింది. కొత్త డైరెక్టర్స్ విప్రా దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీకి ‘క్వశ్చన్ మార్క్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరీకృష్ణ ఈ సినిమా […]
బాలనటిగా ఇండస్ట్రీకొచ్చినా వయసుకు తగ్గ పాత్రలనే ఎంచుకుంటూ కెరీర్ లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది నటి మీనా. అయితే దానికి బ్రేక్ చెప్పాలనుకుంటున్నా.. నెగెటివ్, చాలెంజింగ్ పాత్రలను కూడా చేయాలనుకుంటున్నానని గతంలో ‘అన్నాత్త’ సినిమా ఓపెనింగ్ సమయంలో తన మనసులోని అభిప్రాయాలను చెప్పింది మీనా. తనకి తగ్గా పాత్రలు చెయ్యాలి అనుకున్నా.. ఇప్పుడు మాత్రం ఏ పాత్రైనా చెయ్యడానికి సిద్ధపడుతోందట. ఎందుకంటే తెలుగు తమిళ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని.. ట్రెండ్ కి తగ్గట్టుగా […]
చెన్నై: కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్నది. తాజాగా ఓ ఎంపీని బలితీసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ఎంపీ వసంత్‌కుమార్ (70) శుక్రవారం కరోనాతో కన్నుమూశారు. కరోనా లక్షణాలతో ఆగస్టు 10న వసంత్‌కుమార్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా, ఆయన ఆరోగ్యం విషమించి శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. ఆయన మృతికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్ సంతాపం తెలిపారు. వసంత్‌కుమార్ మృతి కాంగ్రెస్ తీరని […]