Breaking News

Day: August 28, 2020

అభివృద్ధి ఆగొద్దు

సారథిన్యూస్, రామాయంపేట: గ్రామాల్లో అభివృద్ధి పనులు నిరాటంకంగా కొనసాగించాలని మెదక్​ జిల్లా ఇంచార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మెదక్​ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో పర్యటించారు. ఈ గ్రామానికి సీఎం కేసీఆర్​ ఓఎస్డీ ( ఆఫీసర్​ ఆన్​ స్పెషల్​ డ్యూటీ) రాజశేఖర్​రెడ్డి రూ. 1.64 కోట్లు మంజూరు చేయించారు. ధర్మారం రాజశేఖర్​రెడ్డి స్వగ్రామ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్​ పరిశీలించారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో గ్రామంలో […]

Read More
ప్రభాస్​ దూకుడు

ప్రభాస్ దూకుడు

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ రోజుకొకటి తెరపైకి వస్తున్నాయి. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్న క్రమంలో త్వరలోనే విలువిద్య లాంటివి నేర్చుకోవడంతో పాటు ఆ పాత్రకు తగ్గట్టు బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ పై దృష్టి పెట్టబోతున్నాడన్న అప్ డేట్ ఒకటొచ్చింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న […]

Read More
ఫ్యాన్స్​డ్యాన్స్ వీడియోకు ‘మెగా’ ప్రశంస

ఫ్యాన్స్​ డ్యాన్స్ వీడియోకు ‘మెగా’ ప్రశంస

మెగాస్టార్ చిరంజీవికి జనరేషన్ తో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ‘అన్నయ్య’ అని అందరిచేతా పిలిపించుకునే చిరంజీవి బర్త్ డే ఇటీవలే జరిగింది. దాన్ని పురస్కరించుకుని పలువురు అభిమానులు, టాలీవుడ్ హీరోలు తమకు తోచిన విధంగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల, తన భార్య హారికతో కలిసి ‘ఛాలెంజ్’ చిత్రంలోని ‘ఇందువదన’ పాటను రీమిక్స్ చేసి అద్భుతంగా, అందమైన ఆల్బమ్‌గా మలిచారు. సుధాకర్, హారిక డ్యాన్స్ వీడియో యూ […]

Read More

చంద్రబాబును తెలుగుజాతి క్షమించదు

సారథిన్యూస్​, రామగుండం: బషీర్​బాగ్​లో అప్పటి సీఎం చంద్రబాబు సృష్టించిన మారణకాండ తెలుగుజాతి ఎప్పటికీ మరిచిపోదని వామపక్షాల నేతలు పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వామపక్షాల నేతలు బషీర్​బాగ్​ అమరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని తెలుగుజాతి ఎప్పటికి క్షమించబోదని పేర్కొన్నారు. పెంచిన విద్యుత్​ చార్జీలు తగ్గించాలంటూ ధర్నాచేసిన అమాయకరైతులను, వామపక్ష ఉద్యమకారులను చంద్రబాబు ప్రభుత్వం అమానుషంగా పొట్టనపెట్టుకున్నదని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు గౌతం గోవర్ధన్, […]

Read More

‘డబుల్​’ ఇండ్లు గొప్పపథకం

సారథిన్యూస్​, రామగుండం: సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన డబుల్​బెడ్ రూం ఇండ్ల పథకం మహత్తరమైనదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని మూడో డివిజన్​లో నూతనంగా నిర్మిస్తున్న డబుల్​బెడ్​రూం ఇండ్లను పరిశీలించారు. రాష్ట్రంలోని పేదప్రజలు సొంతింట్లో ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్​ ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పోరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, భూమయ్య, నాయకులు పాతపెల్లి […]

Read More
జర్నలిస్టులకు కేంద్రం గుడ్​న్యూస్​

జర్నలిస్టులకు కేంద్రం గుడ్​ న్యూస్​

హైదరాబాద్: కరోనా మహమ్మారి బారినపడిన జర్నలిస్టులకు కేంద్రప్రభుత్వం రూ.50వేలు నుంచి రూ.లక్ష వరకు ఆర్థిక సహాయం అందజేస్తోంది. అలాగే మృతిచెందిన వారికి రూ.ఐదులక్షల సాయం అందజేస్తోంది. కొవిడ్​ట్రీట్​మెంట్​ అనంతరం డిశ్చార్జ్​అయిన జర్నలిస్టులు ధ్రువీకరణ పత్రాలతో కింద తెలియజేసిన లింక్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలను కింద పేర్కొన్న లింక్​లో పొందుపరిచారు. http://pibaccreditation.nic.in/jws/default.aspx

Read More
బాబు.. దళితులపై ప్రేమెందుకు..?

బాబు.. దళితులపై ప్రేమెందుకు..?

సారథి న్యూస్, కర్నూలు: దళితుల అభ్యున్నతికి అడుగడుగునా అడ్డుపడే మాజీ సీఎం చంద్రబాబు.. ఉన్నట్టుండి దళితులపై ప్రేమ ఎందుకు ఒలకబోస్తున్నారని లీడర్స్‌ యూత్‌ సొసైటీ అధ్యక్షు మాదారపు కేదార్​నాథ్​ప్రశ్నించారు. తన హయాంలో దళితులపై దాడులు చేయించడంతోపాటు అవమానపరిచేలా మాట్లాడిన వ్యక్తి.. ప్రతిపక్షంలో ఉన్నందుకు వారిపై కపటప్రేమ చూపుతున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్​సీపీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇళ్లస్థలాలు ఇస్తుంటే.. ఓర్వలేకే చంద్రబాబు అడ్డుపడ్డారని గుర్తుచేశారు. ఇలాగే చేస్తే ఆయనకు […]

Read More
సీఐ శివారెడ్డికి డీఎస్పీగా ప్రమోషన్​

సీఐ శివారెడ్డికి డీఎస్పీగా ప్రమోషన్​

సారథి న్యూస్, కర్నూలు: పోలీసుశాఖలోని (సీఐడీ) కర్నూలు ప్రాంతీయ ఫింగర్ ప్రింట్ బ్యూరో సీఐగా పనిచేస్తున్న శివారెడ్డికి డీఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు శుక్రవారం డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్​ఫక్కీరప్పను జిల్లా పోలీసు ఆఫీసులో కలిసి బొకే అందజేశారు.

Read More