సారథి న్యూస్, హైదరాబాద్: ఓ దళిత యువతపై ఏండ్ల తరబడి 143 మంది లైంగికదాడికి పాల్పడ్డారు. దేశంలోని పలుప్రాంతాలకు ఆమెను తిప్పి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారం జరిపిన వాళ్లలో విద్యార్థినాయకులు, రాజకీయనాయకుల పీఏలు, పలువురు టీవీ, సినీ రంగానికి చెందినవారు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ కేసును హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఒక్క హైదరాబాద్ నగరమే కాదు.. యావత్ తెలంగాణ సమాజమే ఉలిక్కిపడింది. ప్రస్తుతం 143 మందిపై కేసు నమోదైనట్టు […]
అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది మొదలు.. టీడీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు వయస్సు మీదపడటం.. యువనేత లోకేశ్ మీద పార్టీ నేతలకు నమ్మకం లేకపోవడంతో కీలకనేతలందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా టీడీపీ నేత, రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేశ్ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చందన రమేశ్ వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమారుడు […]
హైదరాబాద్: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా చాలా ఎంట్రెన్స్ఎగ్జామ్స్వాయిదాపడిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు ఎగ్జామ్స్షెడ్యూల్ను వెలువరించింది. ఈనెల 31న టీఎస్ ఈసెట్, సెప్టెంబర్9 నుంచి 14 వరకు ఎంసెట్, సెప్టెంబర్21 నుంచి 24వరకు పీజీఈసెట్ ను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
సారథి న్యూస్, మెదక్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషిచేయాలని, ఇళ్లు, మండపాల వద్ద మట్టితో తయారుచేసిన ప్రతిమలను ప్రతిష్టించాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. మట్టితో తయారుచేసిన వినాయక ప్రతిమలను శుక్రవారం మెదక్ మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ చంద్రపాల్ తో కలిసి పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించుకోవాలని సూచించారు. సామూహిక పూజలు, ప్రార్థనలు, ఊరేగింపుల వల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి […]
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 10వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ రోజు లోకసభ, మరోరోజు రాజ్యసభ సమావేశాలు జరుగుతాయని సమాచారం. ఇలా నాలుగు వారాల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలందరికీ ‘ఆరోగ్య సేతు’ యాప్ కచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని నిబంధన విధించారు. స్క్రీనింగ్ నిర్వహణతో పాటు శానిటైజింగ్ వ్యవస్థ ప్రతి చోటా ఉంటుందని పేర్కొన్నారు. ఆయా […]
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను దూషిస్తూ.. ఔరంగాబాద్ కు చెందిన ఓ యువకుడు (27) సోషల్ మీడియాలో పోస్ట్చేశాడు. దీంతో సోనాక్షి ముంబై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఆన్‌లైన్ వేధింపులపై ముంబై సైబర్ పోలీసులు తీసుకున్న చర్యలకు సోనాక్షి ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆన్‌లైన్ లో వేధింపులు నేను సహించను. అందుకే ఫిర్యాదు చేశారు. నా ఫిర్యాదుకు స్పందించిన ముంబై పోలీసులకు […]
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గత 24 గంటల్లో 69,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 945 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు 55,794 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,75,702 కు చేరింది. దేశంలో ప్రస్తుతం 6,97,330 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 63,631మంది వైరస్ బాధితులు కోలుకున్నారు. దీంతో వైరస్‌ను జయించిన వారి మొత్తం సంఖ్య 22,22,578 కు చేరింది. దేశంలో రికవరి రేటు కూడా […]
హైదరాబాద్: కీసర తహసీల్దార్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన వ్యవహారంతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఒక్క పైసా సంబంధం ఉన్నా శిక్షకు సిద్ధమని ప్రకటించారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఖండించారు. తన పాత్ర ఉంటే ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కీసర వ్యవహారంలో రేవంత్‌రెడ్డి లెటర్ హెడ్స్ దొరికిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా.. అవి తనవేనని, ఆర్టీఐ కింద దరఖాస్తు […]