అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ 4’ తెలుగు సీజన్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి. కరోనా సమయంలో వస్తున్న సీజన్ కావడంతో అందరిలోనూ ఆసక్తి బాగానే ఉంది. ఎవర్ని ఇంట్లోకి పంపిస్తారు. వాళ్లు అక్కడ ఎలా ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి, ప్రముఖ డ్యాన్సర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్, యామినీ భాస్కర్, ప్రముఖ నటి సురేఖవాణి, రఘుమాస్టర్ దంపతులు, సమీరా షరీఫ్, ప్రముఖనటుడు, సింగర్గీతామాధురి భర్త నందు, ర్యాపర్ నోయల్ సీన్, సింగర్ […]
సారథి న్యూస్, మెదక్: బడ్జెట్ ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం పేదవారికి ఇబ్బందులు రాకుండా అనేక పథకాలను ప్రవేశపెడుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగడం కోసం ప్రభుత్వం కృషిచేస్తోందని వివరించారు. బుధవారం మెదక్ జిల్లా పాపన్నపేటలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తుదారులకు 153 కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని 36 ఈ పంచాయతీలకు కంప్యూటర్లను అందజేశారు. కరోనాకు బయపడాల్సిన అవసరం లేదని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లాలో వరుసగా కురుస్తున్న భారీవర్షాలకు మునిగిపోయిన లోతట్టు ప్రాంతాల్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం పర్యటించారు. ఏటూరు నాగారంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లి బాధితులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఓ మహిళ తన కొడుకు పక్షవాతంతో దవాఖానలో చేరాడని, వైద్యానికి డబ్బులు లేవనడంతో వెంటనే అతడికి మంచి వైద్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా తన వ్యక్తిగతంగా […]
సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామాన్ని బుధవారం ఉన్నతాధికారుల బృందం సందర్శించింది. గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సర్పంచ్ బొల్లె సుశీల ఈశ్వర్ వారికి వివరించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, హరితహారం పనులు, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరాతీశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలను మూడు నెలల్లోగా పూర్తిచేయాలని అధికారులు సూచించారు. అభివృద్ధి పనులకు ఇసుక కొరత ఉందని సర్పంచ్ బొల్లె సుశీల ఈశ్వర్ వారి దృష్టికి తీసుకెళ్లారు. […]
సారథిన్యూస్, నాగర్ కర్నూల్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ పంచాయతీ కార్యదర్శిని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ సస్పెండ్ చేశారు. బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామపంచాయతీలో సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ కొంతకాలంగా విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విచారణ చేపట్టిన కలెక్టర్ రాజశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ప్రజలంతా జాగ్రత్తలు పాటించి కరోనా మహమ్మారిని జయించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి సూచించారు. కరోనా వచ్చినవారు భయపడాల్సిన అవసరం లేదని.. దేశంలో 70 శాతం మంది వ్యాధి నుంచి కోలుకుంటున్నారని ఆమె భరోసా కల్పించారు. బుధవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలకేంద్రంలో ఆమె పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు కూడా కరోనా రోగులపై వివక్ష చూపించవద్దని కోరారు. కరోనా వచ్చినంతమాత్రాన వారి కుటుంబాలను […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: రైతువేదికల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నాగర్‌కర్నూల్ కలెక్టర్ శర్మన్ హెచ్చరించారు. సెప్టెంబర్ 31 నాటికి రైతువేదిక నిర్మాణపనులు పూర్తిచేయాలని సూచించారు. గురువారం తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల్లోని పోతిరెడ్డిపల్లి, కోడుపర్తి గుమ్మకొండ, తిమ్మాజిపేట, ఇప్పలపల్లి, అవంచ, మారేపల్లి, వట్టెం, బిజినేపల్లి, వడ్డేమాన్, లట్టుపల్లి, మంగనూరు, ఖానాపూర్, పాలెం ఆయా గ్రామాల వ్యవసాయ క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. రైతు వేదిక పనులు నత్తనడకన కొనసాగుతున్నందున కలెక్టర్ […]
సారథి న్యూస్, రామాయంపేట: కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతున్న ప్రస్తుత తరుణంలోనిజాంపేట మండల కేంద్రంలో ఈ నెల 31 వరకు లాక్డౌన్ పొడగించాలని గ్రామపంచాయతీ తీర్మానించింది. ఈ సందర్భంగా సర్పంచ్ అనూష మాట్లాడుతూ.. కరోనా వైరస్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారికి రూ. 5000 జరిమానా విధిస్తున్నట్లు ఆమె తెలిపారు. బుధవారం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు షాప్ యజమానులకు జరిమానా విధించినట్టు ఆమె […]