Breaking News

COLLECTOR SHARMAN

డెంగీని తరిమేద్దాం

డెంగీని తరిమేద్దాం

సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: డెంగీ నివారణను మనం మన ఇంటి నుంచే మొదలుపెడదామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. దోమల నివారణతోనే వ్యాధిని నివారించడం సాధ్యమవుతుందని, ఇంటి ఆవరణలో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. మే16న జాతీయ డెంగీ నివారణ దినాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ క్యాంపు ఆఫీసు ఆవరణలో బ్యానర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డెంగీపై జిల్లా ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని […]

Read More
కొట్ర సర్పంచ్​కు ఉత్తమ అవార్డు

కొట్ర సర్పంచ్​కు ఉత్తమ అవార్డు

సారథి న్యూస్, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ సర్పంచ్​ పొనుగోటి వెంకటేశ్వర్​రావుకు ఉత్తమ సర్పంచ్​ అవార్డు దక్కింది. మంగళవారం నాగర్​కర్నూల్ ​జిల్లా కేంద్రంలో జరిగిన రిపబ్లిక్ ​డే వేడుకల్లో కలెక్టర్ ​ఎల్.శర్మన్, జడ్పీ చైర్​పర్సన్​ పద్మావతి చేతులమీదుగా అందుకున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, ట్యాంకులు, రైతు వేదిక, శ్మశాన వాటిక నిర్మాణంతో పాటు అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులు చేపట్టినందుకు ఈ అవార్డు వచ్చిందని సర్పంచ్ ​పి.వెంకటేశ్వర్​ రావు తెలిపారు. ఈ అవార్డు […]

Read More
డిండి వాగులో చిక్కిన భార్యాభర్తలు

డిండి వాగులో చిక్కిన భార్యాభర్తలు

సారథి న్యూస్, అచ్చంపేట: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట నల్లమల సమీప ప్రాంత చెరువులు, కుంటలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు సభావత్ వెంకట్రాములు దంపతులు డిండి వాగులో బుధవారం సాయంత్రం చిక్కుకున్నారు. వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. వారిని రక్షించేందుకు ముఖ్యమంత్రి, సీఎస్‌లతో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడి హెలిక్యాప్టర్​ సాయం కోరారు. ప్రస్తుతం వారు డిండి వాగు మధ్యలోనే ఉండిపోయారు. […]

Read More
పర్యాటక హబ్ గా ప్రతాపరుద్రుడి కోట

పర్యాటక హబ్ గా ప్రతాపరుద్రుడి కోట

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్ కర్నూల్ ​జిల్లా నల్లమల అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన కాకతీయుల కాలం నాటి ప్రతాపరుద్రుడి కోట ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా మార్చనున్నట్లు కలెక్టర్ ఎల్. శర్మన్ ప్రకటించారు. ఆదివారం అటవీశాఖ అధికారులతో కలిసి సుమారు 280 అడుగుల ఎత్తున్న కోటను కాలినడకన సందర్శించి కలియ తిరిగారు. పరిసర ప్రాంతాల వివరాలను జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. నల్లమల అటవీ ప్రాంతంలో 700 ఏళ్లకు […]

Read More

పనుల్లో నిర్లక్ష్యం.. కలెక్టర్​ సీరియస్​

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​​: రైతువేదికల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నాగర్​కర్నూల్​ కలెక్టర్​ శర్మన్​​ హెచ్చరించారు. సెప్టెంబర్​ 31 నాటికి రైతువేదిక నిర్మాణపనులు పూర్తిచేయాలని సూచించారు. గురువారం తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల్లోని పోతిరెడ్డిపల్లి, కోడుపర్తి గుమ్మకొండ, తిమ్మాజిపేట, ఇప్పలపల్లి, అవంచ, మారేపల్లి, వట్టెం, బిజినేపల్లి, వడ్డేమాన్, లట్టుపల్లి, మంగనూరు, ఖానాపూర్, పాలెం ఆయా గ్రామాల వ్యవసాయ క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. రైతు వేదిక పనులు నత్తనడకన కొనసాగుతున్నందున కలెక్టర్ […]

Read More
కలెక్టర్ మార్నింగ్​ వాక్​

కలెక్టర్ మార్నింగ్​ వాక్​

సారథి న్యూస్​, అచ్చంపేట: సడెన్ వచ్చి కారు ఆగింది.. అందులో నుంచి ఎవరో దిగారు.. సమీప షాపులు, ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. ఆయన వచ్చారని తెలుసుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు మరింత అప్రమత్తమయ్యారు.. ఆయన ఎవరో కాదు నాగర్​ కర్నూల్ జిల్లా కలెక్టర్​ ఎల్​.శర్మన్​. శుక్రవారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మార్నింగ్​ వాక్​ నిర్వహించారు. మున్సిపాలిటీ సిబ్బందితో పాటు పుట్ పాత్ పై ఉన్న వ్యాపారులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనులు బాగుండాలని […]

Read More
తేనె కోసం వెళ్లి.. లోయలో పడి మృతి

తేనె కోసం వెళ్లి.. లోయలో పడి ఇద్దరి మృతి

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: తేనె సేకరణకు వెళ్లిన ఇద్దరు చెంచు యువకులు చెట్టుకు కట్టిన తాగు తెగిపోయి లోయలోపడి చనిపోయారు. ఈ దుర్ఘటన శనివారం నాగర్​కర్నూల్​జిల్లా అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి సమీప అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆదివాసీ చెంచులు దాసరి బయన్న(35), దాసరి పెద్దలు(28), దాసరి వెంకటయ్య కలిసి నల్లమల అటవీ ప్రాంతంలోకి తేనె సేకరణకు వెళ్లారు. చెట్టుకు కట్టిన తాడు ప్రమాదవశాత్తు తెగిపోవడంతో ముగ్గురూ లోయలో పడిపోయారు. వారిలో దాసరి బయన్న, దాసరి […]

Read More