సామాజిక సారథి, మేడారం: మేడారం సామక్కసారక్క జాతర ఫిభ్రవరి 16నుంచి మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కానుంది. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర తేదీలు ప్రకటించారు. వచ్చేనెల16 నుంచి 19 వరకూ కొనసాగే జాతరలో మొదటిరోజు 16వతేదీన సారలమ్మ కన్నతల్లి నుంచి గద్దెపైకి రాకా, 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం, 18న అమ్మవార్ల దర్శనం, 19న తిరిగి అమ్మవార్లు వనంలో ప్రవేశించనున్నారు. జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లాలో వరుసగా కురుస్తున్న భారీవర్షాలకు మునిగిపోయిన లోతట్టు ప్రాంతాల్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం పర్యటించారు. ఏటూరు నాగారంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లి బాధితులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఓ మహిళ తన కొడుకు పక్షవాతంతో దవాఖానలో చేరాడని, వైద్యానికి డబ్బులు లేవనడంతో వెంటనే అతడికి మంచి వైద్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా తన వ్యక్తిగతంగా […]