Breaking News

Day: August 13, 2020

రైతాంగానికి చేయూత

రైతాంగానికి చేయూత

సారథి న్యూస్, అచ్చంపేట: కరోనా విపత్తులోనూ రూ.1,173కోట్లను రైతుబీమా కోసం చెల్లించామని వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్​రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం ద్వారా 57లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.ఐదువేల చొప్పున అందించామన్నారు. గురువారం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి నియామకం, అభినందన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మంత్రి ఎస్.నిరంజన్​రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్.నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ.. పంటల నమోదును రాష్ట్రంలో శాస్త్రీయంగా అమలు […]

Read More
నారాయణకు ఘన నివాళి

నారాయణకు ఘన నివాళి

సారథి న్యూస్​, రామగుండం: సీపీఐ నేత ఎం.నారాయణ.. నిజాయితీకి మారుపేరు అని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి కొనియాడారు. గురువారం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని భాస్కర్​రావుభవన్​లో ఎం.నారాయణ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు వారు హాజరై ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్​, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కళవేన శంకర్, యూనియన్ […]

Read More
జొహరాపురం బ్రిడ్జిని పూర్తిచేయాలి

జొహరాపురం బ్రిడ్జిని పూర్తిచేయాలి

సారథి న్యూస్, కర్నూలు: జొహరాపురం బ్రిడ్జి పనులను ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులతో కలిసి కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గురువారం పరిశీలించారు. రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో రూ.3.3 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు ఆగిపోయాయని వివరించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్ ఆదేశించారు.

Read More
శ్రీశైలం మల్లన్న దర్శనానికి సర్వం సిద్ధం

శ్రీశైలం మల్లన్న దర్శనానికి సర్వం సిద్ధం

శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనాలు శుక్రవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి స్థానికులకు స్వామి, అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. 15వ తేదీ నుంచి యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ముందస్తుగానే www.srisailamonline.com వెబ్​సైట్​లో దర్శన టికెట్లు బుక్​చేసుకోవాలని ఈవో తెలిపారు

Read More

మోతె రిజర్వాయర్​కు మోక్షం

సారథి న్యూస్, రామడుగు: మోతె రిజర్వాయర్​కు ఎట్టకేలకు అనుమతి లభించింది. పనులు వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్​ తెలిపారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలో నిర్మిస్తున్న మోతె రిజర్వాయర్​కు గతేడాది జూన్​లో టెండర్లు పిలిచారు. త్వరలోనే పనులను ప్రారంభించనున్నారు. రూ.180కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. రామడుగు, గంగాధర చొప్పదండి మండలాల్లో దాదాపు 30వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే రవిశంకర్​ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక […]

Read More
ఒరిగిన పాత్రికేయ శిఖరం

ఒరిగిన పాత్రికేయ శిఖరం

కరోనాతో ప్రముఖ జర్నలిస్టు పట్నాయకుని వెంకటేశ్వరరావు కన్నుమూత ‘వారం వారం తెలుగుహారం’ కార్యక్రమంతో అందరికీ సుపరిచితులు సారథి న్యూస్, హైదరాబాద్: పాత్రికేయ శిఖరం నేలకొరిగింది.. సీనియర్​ పాత్రికేయులు, రచయిత పట్నాయకుని వెంకటేశ్వర ​రావు(55)(వీఆర్​) గురువారం సాయంత్రం కరోనాతో కన్నుమూశారు. వారం రోజులుగా హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృత్యువాతపడ్డారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా.. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. ఆంధ్రప్రభలో గ్రామీణ విలేకరిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించారు. ‘ఈనాడు’లో సుమారు […]

Read More

బండరపల్లి చెక్​డ్యాంకు జలకళ

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండర్​పల్లి చెక్​డ్యాం అలుగు పారుతోంది. బండర్​పల్లి వంతెనను గతేడాది మంత్రి టి.హరీశ్​రావు చొరవతో చెక్​డ్యాంగా నిర్మించారు. కాగా, కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పెద్దఎత్తున నీరు చేరి అలుగు పారుతోంది. చెక్ డ్యాం నిండడంతో పరిసర గ్రామల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్​డ్యాంకు నిధులు మంజూరు చేసిన మంత్రి టి.హరీశ్​రావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Read More
ఏపీలో సెప్టెంబర్ 5న స్కూళ్ల పున:ప్రారంభం

ఏపీలో సెప్టెంబర్ 5న స్కూళ్ల పున:ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో వచ్చే విద్యాసంవత్సరానికి ప్రణాళికను ప్రభుత్వం ఖరారుచేసింది. సెప్టెంబర్ 5న స్కూళ్లను పున:ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. అలాగే అక్టోబర్ 15న కాలేజీలను పున:ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. స్కూళ్లు ప్రారంభమైన రోజే 43లక్షల మంది విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ అందిస్తామని పేర్కొన్నారు. గురువారం ఆయన అధికారులతో ఉన్నతస్థాయి స‌మీక్ష సమావేశం నిర్వహించారు. స్కూళ్ల రీ ఓపెనింగ్​కు ముందే వెబ్ కౌన్సెలింగ్ ద్వారా టీచర్ల బదిలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 15 నుంచి 21వ […]

Read More