సారథి న్యూస్, మెదక్: జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా అరికట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. గురువారం మెదక్ కలెక్టరేట్ లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్‌అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని గ్రామాలు, తండాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నాయని అన్నారు. చిన్నతనంలోనే పెళ్లిచేస్తే వారి మానసికస్థితి ఎదగకపోవడంతో సమస్యలు వస్తాయని కలెక్టర్ వివరించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తతెత్తకుండా మెదక్ జిల్లాలో సఖి సెంటర్‌ను నిర్వహించనున్నట్లు […]
సారథి న్యూస్, అనంతపురం : స్వీయ జాగ్రత్తలతోనే కరోనా కట్టడి సాధ్యమని అనంతపురం ఎమ్మెల్యే వెంకట రామిరెడ్డి తెలిపారు. నగరంలోని రెండో రోడ్డులో ఉన్న మెప్మా కార్యాలయం వద్ద గురువారం ర్యాగ్ పిక్కర్స్ (వీధుల్లో చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే కుటుంబాలు), నిరాశ్రయ కుటుంబాలకు కోవిడ్-19 కిట్లను పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందన్నారు. కరోనా టెస్టులు వేగవంతం చేయడానికి […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,676 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 41,018 నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 396కు చేరింది. రాష్ట్రంలో 2,22,693 శాంపిళ్లను పరీక్షించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 788, రంగారెడ్డి 224, మేడ్చల్160, సంగారెడ్డి 57, వరంగల్అర్బన్ 47, కరీంనగర్92, మహబూబాబాద్19, మెదక్26, నల్లగొండ 64, నాగర్‌కర్నూల్30, వనపర్తి 51, సూర్యాపేట, నిజామాబాద్ […]
జూరాల 11 గేట్లు ఎత్తివేత కొనసాగుతున్న వరద ఉధృతి సారథి న్యూస్, కర్నూలు: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పిత్తికి నీటిని దిగువకు వదులుతున్నారు. గురువారం జూరాల ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 73,502 క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా 33,282 క్యూసెక్కులను మొత్తం 1,06,784 క్యూసెక్కులను కిందకు వదిలారు. 11 […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లోపలికి వర్షపు నీరు వచ్చిన నేపథ్యంలో గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. అక్కడ బిల్డింగ్ మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్పిటల్ ప్రాంగణంలో తిరిగి పర్యవేక్షించారు. మంత్రి హాస్పిటల్ వెలుపల పేషెంట్ వార్డులను పర్యవేక్షించారు వైద్యులతో పేషంట్ స్థితిగతులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య అధికారులు సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లు తదితరులు మంత్రి వెంబడి […]
సారథి న్యూస్, రామడుగు: కరోనా లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఓ స్వచ్చందసంస్థ ఆదుకుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని జెబెల్ అలీ ప్రాంతంలోని లేబర్ క్యాంపులో తలదాచుకుంటున్న పేదలకు ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవాసమితి ఉపాధ్యక్షుడు బాలు బొమ్మిడి, మీడియా కోఆర్డినేటర్ చిలుముల రమేశ్, ముఖ్య సలహాదారులు మోహన్ రెడ్డి, అశోక్ జంగం, సోషల్ మీడియా కోర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్, మాల్యాల, జెబెల్ […]
సారథి న్యూస్, రామడుగు: భారతీయ జనతాపార్టీని బలోపేతం చేద్దామని కరీంనగర్ జిల్లా రామడుగు మండలాధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు ఒంటెల కరుణాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా అంబటి నర్సింగరావు, కారుపకల అంజి, ఏముండ్ల కుమార్, తారకొండ ఐలయ్య, ప్రధానకార్యదర్శులుగా తోట, కృష్ణ, రమేశ్, చంద్రమౌళి, కార్యదర్శి గుంట అశోక్, చింతాపంటి అశోక్, సిరిమల్ల మదన్మోహన్, దమ్మయ్య భూపతి, కోశాధికారి గంట్లా శరత్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా స్వామి, శ్రీధర్, కనకయ్య, […]
సారథి న్యూస్, హుస్నాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కోసం వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం హుస్నాబాద్, అక్కన్నపేట మండలం పందిల్ల, జనగాం గ్రామాల్లో రైతు వేదికలకు భూమి పూజ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి వేల కోట్లు వెచ్చిస్తున్నారన్నారు. దేశానికే వెన్నెముకయిన అన్నదాతల్లో నూతన వ్యవసాయ విధానాలు అమలు కావడానికి ఈ వేదికలు తొడ్పతయన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీపీలు మానన, లక్ష్మి, జడ్పీటీసీలు […]