సారథి న్యూస్, హైదరాబాద్: ‘కరోనా కట్టడి కోసం మార్చి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం రూ.475 కోట్లను ఖర్చుచేసింది..’ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఇటీవల అధికారికంగా చేసిన ప్రకటన ఇది. కానీ ఇంతకు మించి నూతన సచివాలయ నిర్మాణం కోసం సర్కారు ఏకంగా రూ.500 కోట్లను కేటాయించడం గమనార్హం. ఏడాది కాలంలో దీన్ని పూర్తిచేసేందుకు నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంచనాలు రూ.వెయ్యి కోట్ల దాకా ఎగబాకే అవకాశాలు లేకపోలేదని ఆర్థికశాఖ అంచనా. దీన్నిబట్టి కరోనా నివారణ, […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం కలకత్తా నుంచి హైదరాబాద్ కు ఛత్తీస్ గఢ్ మీదుగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామం వద్ద పాడి గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు గేదెలు మృతిచెందాయి. డ్రైవర్, క్లీనర్పరారీలో ఉన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మహబూబ్‌నగర్ , నల్లగొండ జిల్లాల వర్చువల్ ర్యాలీ సారథి న్యూస్, హైదరాబాద్: సచివాలయాన్ని కూలగొట్టే క్రమంలో నల్లపోచమ్మ గుడిని కూడా కూలగొట్టారని, అలా కూలగొట్టారంటే కేసీఆర్ ప్రభుత్వానికి దినం దగ్గరపడిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు హెచ్చరించారు. తొందర్లోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ సర్కారుకు దినాలు పెట్టడానికి రెడీగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గుడిని కావాలనే కూలగొట్టి, తప్పిపోయి కూలిపోయిందని అబద్ధాలు చెబుతున్నారని ఆయన తీవ్రంగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం 1,278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 32,224 కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య 339కు చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 12,680 మంది కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా 10,354 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, అందులో 9,076 మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా గ్రేటర్ […]
సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన జర్నలిస్ట్ డాక్టర్ ఎజ్రా మల్లేశంను స్వేరోస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వేరోస్ సభ్యులు మాట్లాడుతూ.. మల్లేశం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికకవాడం సంతోషంగా ఉన్నదని, కరోనా సమయంలో డాక్టర్ గా, పాత్రికేయుడుగా సేవలందించడం అభినందనీయమని కొనియాడారు. ఆయన భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి తిరుపతి స్వేరో, జిల్లా […]
సారథిన్యూస్, గోదావరిఖని/రామగుండం: గోదావరిఖని నియోజకవర్గానికి గీట్ల జనార్దన్‌రెడ్డి సేవలు మరువలేనివని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. సాహితీవేత్తగా, రాజకీయనాయకుడిగా గీట్ల ఈ ప్రాంతానికి ఎన్నోసేవలు చేశారని కొనియాడారు. శుక్రవారం ఆయన 82వ జయంతి సందర్భంగా గోదావరిఖనిలోని గీట్ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయన సేవలకు గుర్తుగా మంత్రి కొప్పుల ఈశ్వర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 10, 48వ డివిజన్లలో హరితహారంలో […]
సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడగు, శ్రీరాములపల్లిలో వైద్య ఆరోగ్యశాఖ వృద్ధుల కోసం ‘ఆలన’ అనే ఓ ప్రత్యేకకార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహించి.. వారికి అవసరమైన మందులు అందజేశారు. బీపీ, షుగర్, పక్షవాతం, క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి మందులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో డాక్టర్లు సయ్యద్, అబ్దుల్ రఫె, వైద్యసిబ్బంది శ్రీనివాస్, రమణమూర్తి, సంధ్య, శ్రీలత, రాజేశ్వరి, బూదమ్మ, ఆశాలు మమత, అంజమ్మ, సుజాత […]
సారథిన్యూస్, సిద్దిపేట: ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు రక్షించారు. అతడి మొబైల్ నంబర్ ఆధారంగా అతడు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అతడి ప్రాణాలు కాపాడారు. సిద్దిపేటకు చెందిన కాశితే శ్రీనాథ్ గురువారం రాత్రి ఇంట్లో గొడవపెట్టుకొని తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బయటకు వెళ్లాడు. దీంతో అతడి తండ్రి ఐలయ్య వన్‌టౌన్ పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ సైదులు, ఐటీ సిబ్బందితో కలిసి శ్రీనాథ్ మొబైల్ నంబర్ ఆధారంగా అతడు స్థానిక ఎల్లమ్మ ఆలయం […]