Breaking News

Day: July 5, 2020

చాక్లెట్​ ఆశచూపి..

సారథిన్యూస్​, నిజామాబాద్:​ చాక్లెట్​ ఆశచూపి ఓ వృద్ధుడు ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్​ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నారాయణ ( 55) అనే వ్యక్తి ఎనిమిదేళ్ల ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేశాడు. ఇద్దరు చిన్నారులకు గత 15 రోజులుగా చాక్లెట్ ఆశ చూయించి పాడుబడ్డ ఇంట్లో లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంట్లో చెప్తే చంపుతానని బెదిరించాడు. కడుపునొప్పి తాళలేక చిన్నారులు కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. దీంతో […]

Read More
మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే రవిశంకర్​

హరితతెలంగాణే లక్ష్యం

సారథి న్యూస్, గంగాధర: తెలంగాణ వ్యాప్తంగా పల్లెలన్నీ చెట్లతో కళకళలాడాలన్నదే సీఎం కేసీఆర్​ లక్ష్యమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్​లో ఆదివారం ఎక్సైజ్​శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే తాటి, ఈత, ఖర్జూర మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

బాధిత కుటుంబాలకు పరామర్శ

సారథి న్యూస్, వరంగల్: ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన గిరిజన బాలుర కుటుంబాలను ఆన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్​ పేర్కొన్నారు. ఆదివారం మహబూబాబాద్​ ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఆమె బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. శనివారం గోడతండాకు చెందిన గిరిజన పిల్లలు ఇస్లావత్​ లోకేశ్​, రాకేశ్​, జగన్​, దినేశ్​ ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరి కుటుంబాలను మంత్రి పరామర్శించారు. మంత్రి వెంట ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్​నాయక్​, మున్సిపల్ […]

Read More

అమెరికా అధ్యక్ష రేసులో హాలీవుడ్​ ర్యాపర్​

వాషింగ్టన్‌: తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు హాలీవుడ్ ర్యాప‌ర్‌‌ కాన్యే వెస్ట్ ప్ర‌క‌టించారు. కాన్యే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అభిమాని కావడం గమనార్హం. ‘నేను అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నా. దేవున్ని విశ్వసిస్తూ, మ‌న భ‌విష్య‌త్తును మ‌న‌మే నిర్మించుకుంటూ అమెరికా హామీల‌ను నెర‌వేర్చుకుందాం’ అని ట్విట్టర్​లో పేర్కొన్నారు. పోటీకి సంబంధించి క్యానే ఎన్నిక‌ల బ్యాలెట్‌కు ఏదైనా ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారా అనే విష‌యం తెలియరాలేదు. కాగా 2018లో ట్రంప్ ఎన్నిక త‌ర్వాత‌ వెస్ట్ త‌న […]

Read More

మహిళ చేతిలో మోసపోయిన విశాల్​

ప్రముఖ తమిళ హీరో, నిర్మాత, నడిగర్​ సంఘం కీలకసభ్యడు విశాల్​ను ఆయన కార్యాలయంలో పనిచేసే ఓ మహిళ మోసగించింది. ఆరేండ్ల నుంచి సుమారు 45 లక్షలు కాజేసినట్టు సమాచారం. ఆమె తాజాగా ఓ భారీ ఇల్లు కొనుగోలు చేయడంతో ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఈ మేరకు విశాల్‌ మేనేజర్‌ చెన్నైలోని విరుగంబక్కం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. సదరు మహిళ ఆదాయపన్ను కట్టాల్సిన డబ్బులు తన సొంత అకౌంట్‌కు బదిలీ చేసి ఆరేండ్లలో 45 లక్షలు […]

Read More
షార్ట్ న్యూస్

ఆలయంలో చోరీ

మునగాల, సారథి న్యూస్​ : మునగాల మండల కేంద్ర శివారులో ఉన్న హరిహరసుత అయ్యప్ప ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని పగులగొట్టి భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలను ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. గతంలో మూడు సార్లు ఈ విధంగానే చోరీకి పాల్పడినట్లు ఆలయ నిర్వాహకులు వాపోయారు

Read More
మెదక్ జిల్లాలో కరోనా విజృంభణ

మెదక్ జిల్లాలో కరోనా విజృంభణ

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. లాక్ డౌన్ సమయంలో కేవలం వేళ్లపై లెక్కపెట్టే కేసులు మాత్రమే ఉండగా, లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు దండిగా నమోదవుతున్నాయి. నెలరోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 40 మందికి కరోనా ప్రబలడంతో గమనార్హం. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 45కు చేరింది. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణం, తూప్రాన్, రామాయంపేట పట్టణాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జిల్లాకు […]

Read More
మాస్కు లేకుంటే.. జరిమానే

మాస్కు లేకుంటే.. జరిమానే

సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప తెలిపారు. జిల్లాలో మాస్కు ధరించకుండా, నిబంధనలు ఉల్లంఘించిన 7,086 మందిపై కేసు నమోదు చేసి రూ. 5,77,350 జరిమానా విధించినట్లు ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదివారం తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా మాస్కు ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిపై జిల్లా పరిధిలో జూన్‌ 24 నుంచి […]

Read More