కశ్మీర్: హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ మసూద్ అహ్మద్ భట్ భద్రతా దళాలు చేతిలో హతమయ్యాడు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని కుల్‌చోరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అహ్మద్ భట్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో దోడా ఇక ‘ఉగ్రవాదరహిత’ జిల్లాగా మారినట్లు అధికారులు ప్రకటించారు. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయని తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఓ ఏకే రైఫిల్, రెండు తుపాకులు స్వాధీనం […]
అనంత్‌నాగ్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని అనంత్నగాగ్ జిల్లా ఖుల్‌చోహార్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్ స్థలంలో పోలీసులు, ఆర్మీ జవాన్ల గాలింపు కొనసాగుతుందని కశ్మీర్ జోన్ పోలీసులు చెప్పారు. పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు. శనివారం చేవా ఉల్లార్ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. జమ్మూకశ్మీర్ లో ఇటీవల వరుసగా సాగుతున్న ఎదురుకాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో జమ్మూకశ్మీర్ పోలీసులు సైనికబలగాలతో కలిసి […]
చెన్నై: దుర్మార్గుడైన ఓ వృద్ధుడు భార్య గొంతుకోసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో వెలుగుచూసింది. పెరుంగలాథూర్ ప్రాంతంలోని డేవిడ్ నగర్‌లోని ఓ ఫ్లాటులో జగన్నాథన్ (72), అతడి భార్య సులోచన (62)లు నివాసముండేవారు. అపార్టుమెంట్ పై జగన్నాథన్ మృతదేహాన్ని చూసిన అపార్టుమెంటు వాసులు విషయాన్ని ఆమె భార్యకు చెప్పేందుకు వారి ఫ్లాటుకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో సులోచన కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఇద్దరి […]
లక్నో: అంగరంగవైభవంగా జరుగాల్సిన ఆ పెండ్లి అర్ధాంతరంగా ముగిసింది. పీటలమీదే పెండ్లి కూతురు మృతిచెందింది. దీంతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొన్నది. ఈ దారుణ ఘటనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కనౌజ్ జిల్లా వేదికయ్యింది. థాథియా పరిధిలోని భగత్‌పూర్వ గ్రామంలో వధువు ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరుడు సంజయ్.. తన కుటుంబ సమేతంగా వధువు వనిత ఇంటికి చేరుకున్నాడు. కాగా, పెళ్లితంతు జరుగుతుండగా.. వనిత అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే దవఖానకు తరలించారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: అక్కాచెల్లెళ్ల మధ్య వారసత్వ పోరు రాజుకుంది. ఇప్పుడు మాన్సాస్ వారసత్వపోరు మరో మలుపు తిరిగింది. సంచయిత వారసురాలు కాదంటూ రంగంలోకి రెండో భార్య కూతురు దిగడంతో రాచరికపు పోరు రాజుకుంటోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం కోట కోసం సమరం ఆసక్తిని రేపుతోంది. మొన్నటి వరకు మాన్సాస్ ట్రస్ట్‌కు తానే వారసురాలినని కత్తులు దూసిన యువరాణి కోటను కైవసం చేసున్నారు. అయితే అసలు వారసురాలిని తానేనంటూ ఇప్పుడు రాజుగారి రెండో భార్య కూతురు ఆకస్మికంగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రపంచం మొత్తం కరోనా ధాటికి విలవిల్లాడుతోంది.. మహమ్మారి నానాటికీ విజృంభిస్తోంది. వాళ్లు.. వీళ్లు అనే తేడా లేకుండా జనం పిట్టల్లా రాలిపోతున్నారు. బాధితుల సంఖ్య రెట్టింపవుతోంది. అడ్డుకోవడం ఏ దేశం తరం కావడం లేదు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కోటికి పైగా నమోదయ్యాయన్న వార్త ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉండడంతో రెట్టింపు స్థాయిలో కేసులు […]
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని వణికిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కేసులతో సర్వత్రా ఆందోళన నెలకొన్నది. తాజాగా ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓ మానసిక వికలాంగుల ఆశ్రమంలో 8 మంది పిల్లలతోపాటు 23 మందికి కరోనా సోకింది. ఈ ఆశ్రమంలో 960 మంది మానసిక వికలాంగులు ఉంటున్నారు. ఈ నెల 5నుంచి 20వతేదీ వరకు మానసిక వికలాంగుల ఆశ్రమంలో కరోనా పరీక్షలు చేయగా 23 కరోనా పాజిటివ్ అని తేలింది. ఇందులో ముగ్గురు […]
చండీగఢ్: హర్యానాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సుధాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. సుభాష్ కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆయన కొంతకాలంగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తెలిందని ఆయన వ్యక్తిగత సహాయకుడు అరుణ్ గులాటి మీడియాకు తెలిపారు. జూన్ 21న సంభవించిన సూర్యగ్రహణం రోజున నిర్వహించిన ఓ పూజలో ఆయన పాల్గొన్నట్టు సమాచారం. ఆ పూజకు […]