Breaking News

Day: June 12, 2020

కష్టకాలంలో మేమున్నామని..

సారథి న్యూస్​, రామడుగు: దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ఆధ్వర్యంలో దుబాయిలో 250 మంది వర్కర్లకు శుక్రవారం నిత్యావసర సరుకుల పంపిణీ చేసినట్లు కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలముల రమేష్ తెలిపారు. అజ్మాన్ లోని ఏ1 ఫారా కంపెనీలో ఆరునెలలుగా జీతాలు లేక, తినడానికి ఇబ్బందిపడుతున్న 250 మంది కార్మికులకు కొందరు సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. సరుకుల పంపిణీలో రవి ఉట్నూరి, షార్జా, అజ్మన్ కోఆర్డినేటర్ […]

Read More

నకిలీసీడ్స్ పట్టివేత

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామంలో పోలీసులు, టాస్క్​ఫోర్స్​ సిబ్బంది భారీగా నకిలీ విత్తనాలు, నిషేధిత గ్లైపోసెట్ గడ్డిమందును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిట్టు తిరుమల్​, కుమార్​ అనే ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Read More

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

సూర్యాపేట జిల్లా: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన సూర్యాపేట జిల్లానాగారం మండలం ఫణిగిరి స్టేజీ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. బైక్​పై వెళ్తున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టడంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన నర్రా సందీప్, జేరిపోతుల హరీశ్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Read More
విద్యుత్​ అధికారులకు వినతిపత్రం అందిస్తున్న నాయకులు

అధిక బిల్లులతో అవస్థలు

సారథి న్యూస్, హుస్నాబాద్ : అధిక విద్యుత్​ బిల్లులతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కరీంనగర్​ జిల్లా కోహెడ, బెజ్జంకి మండల విద్యుత్ శాఖ ఏడీ మాణిక్య లింగానికి వినతి పత్రాన్ని అందజేసి మాట్లాడారు. పేద ప్రజలు నిత్యావసర వస్తువులు కొనేందుకు డబ్బులు లేక సతమతమవుతుంటే విద్యుత్ బిల్లులు రూ.1000కి పైగా వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ […]

Read More

కరోనా రాకుండా జాగ్రత్తగా ఉండండి

సారథి న్యూస్​, వనపర్తి: కరోనా పట్ల వనపర్తి జిల్లా ప్రజలు మరింత అప్రమతంగా ఉండాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. వచ్చేవారం నుంచి జిల్లాలోని నాలుగు కోర్టులు ప్రారంభమవుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా న్యాయమూర్తులు, లాయర్లకు మాస్కులు, థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు, శానిటైజర్లను 9వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి బి.శ్రీనివాసులుకు శుక్రవారం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ నివారణకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. వానాకాలంలో మరింత అప్రమత్తంగా […]

Read More

పార్టీకాదు..అభివృద్ధే ముఖ్యం

సారథి న్యూస్, హుస్నాబాద్: అభివృద్ధి కోసం అవసరమైతే రాజకీయాలను పక్కన పెడతానని కరీంనగర్​ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం హుస్నాబాద్​ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. వానాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత, కౌన్సిలర్లు శ్రీనివాస్, వేణు, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ విజయ […]

Read More

ప్రజల వద్దకే చేపలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కులఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి జీవితంలో వెలుగులు నింపాలన్న ధ్యేయంతో సీఎం కేసీఆర్​ ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారని కొనియాడారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్ లోని పశువర్ధక శాఖ డైరెక్టర్ ఆఫీసు ఆవరణలో మొబైల్ ఫిష్ అవుట్​ లెట్ ను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 […]

Read More

‘తెలంగాణ తల్లి’ గీతం హత్తుకుంది

సారథి న్యూస్​, హైదరాబాద్​: ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి రచించిన తెలంగాణ తల్లి ప్రార్థనా గీతాన్ని మంత్రి కె.తారకరామారావు శుక్రవారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ‘తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక చరిత్ర సాహిత్యం, శిల్పకళ గురించి వర్ణించే ఈ పాట హత్తుకుందని’ తెలిపారు. మంత్రి చేతులమీదుగా విడుదల చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు.

Read More