Breaking News

రామాయంపేట

చకచకా రైతు వేదిక పనులు

చకచకా రైతు వేదిక పనులు

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో రైతు వేదిక నిర్మాణాలు చకచకా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ తమన్నా గారి కృష్ణవేణి అన్నారు. రైతువేదికలను కల్వకుంటలో పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతులు తమ పంటలను గిట్టుబాటు ధర నిర్ణయించే అధికారం రైతులకు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More
వర్షాలకు వెయ్యి కోళ్లు మృత్యువాత

వర్షాలకు వెయ్యి కోళ్లు మృత్యువాత

సారథి న్యూస్, రామాయంపేట: కరోనా నేపథ్యంలో.. ఉన్న ఊరులోనే తన శక్తి మేర పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశపడ్డ ఓ యువకుడి ఆశలు అడియాసలయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు కోళ్ల షెడ్ లోకి చేరడంతో సుమారు వెయ్యి కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన మండలంలోని మెదక్​ జిల్లా రామాయంపేట చల్మెడ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా షెడ్ నిర్వాహకుడు కరుణాకర్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఎక్కడికి వెళ్లి ఉద్యోగం […]

Read More
జడలు చుట్టి వరి పంటను కాపాడుకోవాలి

జడలు చుట్టి వరి పంటను కాపాడుకోవాలి

సారథి న్యూస్, రామాయంపేట: వర్షాలకు కింద పడిపోయిన వరి పంటను జడలు చుట్టే పద్ధతిలో కట్టుకుంటే పంటను రైతులు కాపాడుకోవచ్చని నిజాంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీష్ సూచించారు. ఆయన సోమవారం మండల పరిధిలోని నస్కల్, చౌకత్ పల్లి, కల్వకుంట, తిప్పనగుళ్ల గ్రామాల్లో నేలకు ఒరిగిన పంట పొలాలను పరిశీలించి పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించారు. గింజగట్టి పడి కోత దశలో ఉన్న వరి పంటకు 50 గ్రాముల ఉప్పును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని […]

Read More
కో ఆపరేటివ్ యూనియన్ ఉపాధ్యక్షుడి ఎన్నిక

కోఆపరేటివ్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా నర్సింలు

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా కో ఆపరేటివ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా రామాయంపేట సహకార సంఘం సీఈవో పుట్టి నర్సింలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలు అందిస్తానని తెలిపారు.

Read More

నాలుగేండ్ల తర్వాత..

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మేడ గ్రామ శివారు లోని సోమాజిచెరువు నాలుగేండ్ల తర్వాత అలుగుపారడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం చెరువు మత్తడి దుంకింది. దీంతో పిల్లలు, యువకులు అక్కడికి చేరుకొని సెల్ఫీలు దిగారు. గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాలవారు అక్కడికి చేరుకొని చెరువు అందాలను తిలకించారు.

Read More
రైతులకు చేదోడువాదోడుగా సొసైటీలు

రైతులకు చేదోడు వాదోడుగా సొసైటీలు

సారథి న్యూస్, రామయంపేట: రైతులకు ఎరువులు, విత్తనాలు అందజేస్తూ.. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు పీఏసీఎస్​సొసైటీలు ముఖ్యపాత్ర పోషిస్తాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆమె మెదక్ ​జిల్లా నిజాంపేటలో సహకార సంఘం కొత్త భవనాన్ని ప్రారంభించారు. గతంలో సొసైటీల పనితీరు ఎవరికి తెలిసేది కాదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత వాటికి ఒక రూపు వచ్చిందన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో 100 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు అలాట్ చేశామని, […]

Read More
ఉదారత చాటిన స్నేహబంధం

ఉదారత చాటిన స్నేహబంధం

సారథి న్యూస్, రామాయంపేట: చిన్ననాటి స్నేహితులు తమ అనుబంధాన్ని చాటుకున్నారు. చనిపోయిన తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు. కొంత ఆర్థిక సహాయం అందజేసి మేమున్నామని.. ధైర్యం చెప్పారు. మెదక్​జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామానికి చెందిన కుమ్మరి బాలరాజు(36) మూడు రోజుల క్రితం చనిపోయాడు. ఈ ఘటనతో తమ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న దోస్త్ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం అందించాలని, అదే గ్రామానికి చెందిన మృతుడి ఫ్రెండ్స్ రూ.13,800 జమచేసి మృతుడి భార్యకు అందజేశారు. […]

Read More
అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాలి

అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాలి

సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున హైదరాబాద్ నగరంలో గిరిజన యువతిపై అత్యాచారం ఘటనను నిరసిస్తూ.. దోషులకు శిక్షపడాలని డిమాండ్​చేస్తూ.. ఆదివారం మెదక్​జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాలు, ఏకలవ్య ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆరేళ్లుగా 139 సార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలని డిమాండ్​చేశారు. దోషులను ఎన్ కౌంటర్​ చేయాలని కోరారు. బాధితురాలి కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. ఈ కేసును […]

Read More