Breaking News

గోదావరిఖని

సింగరేణిలో కరోనా కలవరం

సారథి న్యూస్​, గోదావరిఖని: పట్టణంలోని సింగరేణి తరియా హాస్పిటల్ లో కరోనా కలవరం మొదలైంది. రెండు రోజుల క్రితం 8 ఇంక్లయిన్​ కాలనీకి చెందిన సింగరేణికి చెందిన ఓ కార్మికుడు మృతిచెందిన విషయం తెలిసిందే, కాగా, బుధవారం గోదావరిఖనికి చెందిన మరో సూపర్​వైజర్​ స్థాయి ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ప్రచారం జరగడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కలవరం నెలకొంది. రెండురోజుల క్రితం సింగరేణి ఆస్పత్రిలో సదరు బాధితుడు అందరితో కలిసి తిరిగాడని అతని […]

Read More

కానిస్టేబుల్​పై సస్పెన్షన్​ వేటు

సారథి న్యూస్​, గోదావరిఖని: విధుల్లో బాధ్యతారహితంగా వ్యవహరించారనే కారణంతో కానిస్టేబుల్​ సుధీర్​పై సస్పెన్షన్​ వేటు వేసినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Read More

కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాలి

సారథి న్యూస్, గోదావరిఖని: నగర పాలక సంస్థలోని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో(కోల్డ్ స్టోరేజ్) శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని బుధవారం కమిషనర్ పి.ఉదయ్ కుమార్ కు సీపీఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. రామగుండం నగరంలో మార్కెటింగ్ దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుండడం శుభపరిణామని అన్నారు. ప్రధానంగా కూరగాయలు, పండ్లు, చేపలు వంటివి నిలువ చేసుకోవడానికి గిడ్డంగులు లేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. […]

Read More

బస్సు సీటు మారింది

లాక్ డౌన్ ఎఫెక్ట్ సారథి న్యూస్​, గోదావరిఖని: లాక్ డౌన్ పాపమా! అని అని జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, దాదాపు 50రోజుల తర్వాత కొన్నిరాష్ట్రాల్లో బస్సులు రోడ్డెక్కుతున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రమే బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అది కూడా నిబంధనలతో కూడిన అనుమతి మాత్రమే ఉంది. సూపర్ లగ్జరీ బస్సుల్లో సాధారణంగా 36 నుంచి 40 సీట్లు మాత్రమే ఉంటాయి. కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో భౌతికదూరం పాటించాల్సి ఉంది. అందుకోసం ఆర్టీసీ […]

Read More

సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారథి న్యూస్, గోదావరిఖని: రైతుల ఆర్థికాభివృద్ధికి అహర్నిషలు పాటుపడుతూ సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొనియాడారు. శనివారం పాలకుర్తి మండలం తక్కలపల్లిలో ఎస్ఆర్ఎస్ కాలువలో పుడికతీత, చెట్ల తొలగింపు పనులతో పాటురూ.76 లక్షల నిధులతో రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధిహామీ కులీలకు అంబలి, అన్నదానం నిర్వహించారు. రైతులు, కూలీలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు తప్పకుండా […]

Read More
ఘనంగా మే డే

ఘనంగా మే డే

సారథి న్యూస్​, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ), అర్జీ1 కమిటీ ఆధ్వర్యంలో  గోదావరిఖని ఆఫీస్, ఏరియా వర్క్ షాప్, రమేష్ నగర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, కనకయ్య, మహేష్, మెండ శ్రీనివాస్, జె.గజెందర్, సానం రవి, అంజయ్య, కె రంగారావు, వంగల రాములు పాల్గొన్నారు.

Read More
కళాకారులకు అండగా ఉంటాం

కళాకారులకు అండగా ఉంటాం

సారథి న్యూస్​, గోదావరిఖని(పెద్దపల్లి): కళను నమ్ముకుని జీవిస్తున్న కళాకారులకు కరోనా వ్యాప్తి కారణంగా కష్టాలు మొదలయ్యాయని, వారికి అండగా నిలుస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భరోసాఇచ్చారు. గురువారం ఆయన గోదావరిఖని పట్టణంలోని సీఐటీయూ ఆఫీసులో పేద కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారికి విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. కళాకారులంతా ఐక్యంగా ఉండాలని, త్వరలోనే వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ […]

Read More
కార్మికుల రక్షణే ముఖ్యం.

కార్మికుల రక్షణే ముఖ్యం

సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీని మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల తయారీకి అనుమతి ఇవ్వడంతో అందులో పనిచేస్తున్న 1,400 మంది కార్మికులకు అవసరమైన రక్షణ చర్యలను పరిశీలించారు. వారంతా సామాజిక దూరం పాటించడంతో పాటు తప్పనిసరిగా మాస్క్ లు ధరించేలా చూడాలని సీపీ ఆదేశించారు. ఆయన వెంట గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీంనగర్ రావు, ఎన్టీపీసీ ఎస్సై ఉమాసాగర్, ఆర్ఎఫ్సీఎల్ అధికారులు, […]

Read More