Breaking News

కల్వకుర్తి

‘సుంకిరెడ్డి’కి హ్యాండిచ్చారు..!

సుంకిరెడ్డికి హ్యాండిచ్చారు..!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ ఎన్ఆర్ఐ, ఐక్యతా ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆదిలోనే నిరాశే ఎదురైంది. దీంతో చేసేదిలేక దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. కాంగ్రెస్​ అధిష్టానం కల్వకుర్తి టికెట్​ను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి ఖరారుచేసింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు. గతంలో ఆయన కల్వకుర్తి నుంచి పోటీచేద్దామని భావించినా బీఆర్​ఎస్​ టికెట్​ రాలేదు. 2023 ఎన్నికల్లోనూ మరోసారి నిరాశే ఎదురుకావడంతో కాంగ్రెస్​ గూటికి చేరారు. […]

Read More
సుంకిరెడ్డి’.. దారెటు?

‘సుంకిరెడ్డి’.. దారెటు?

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సరిపోయినంతా డబ్బు ఉంది కదా.. రాజకీయం చేద్దామని ప్రజలకు సేవ పేరుతో, ఎంతో ఉత్సాహంతో కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ ఎన్ఆర్ఐ, ఐక్యతా ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అంతలోనే సైలెంట్ అయిపోయారు. నియోజకవర్గంలో కొద్దిరోజులు హల్​ చల్​ చేశారు. కాంగి‘రేసు’లో టికెట్ తనకే పక్కా అని చెప్పుకున్నా.. రానురాను పార్టీలో నేతల చేరికల పరిణామాలు మారుతుండటంతో డీలా పడిపోయారు. కొద్దిరోజులుగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఇంతలోనే మరోనేత కాంగ్రెస్ […]

Read More
తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు

సామాజికసారథి, రంగారెడ్డి బ్యూరో/వెల్డండ: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు.. నలుగురికి రుచికరమైన వంటలు చేసిపెట్టడమే వారి వృత్తి. ఓ శుభకార్యంలో వంటలు చేసి ఇళ్లకు బయలుదేరిన నలుగురు యువకులు శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్​- శ్రీశైలం హైవేపై మహేశ్వరం మండలం తుమ్మలూర్​ వద్ద ఈ యాక్సిడెంట్​ జరిగింది. నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన ఇమ్మరాజు రామస్వామి(36), బైకాని యాదయ్య (35), హెచ్.​ […]

Read More
నాగర్​కర్నూల్​జిల్లాలో పొలిటికల్​సైలెన్స్

నాగర్​కర్నూల్​ జిల్లాలో పొలిటికల్​ సైలెన్స్​

ప్రభావం చూపలేకపోతున్న ప్రతిపక్ష పార్టీలు అంతా అధికారపార్టీదే హవా సొంత ఎజెండాలతో ముందుకు వెళ్లలేని నాయకులు సామాజికసారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ పొలిటికల్​హీట్​రాజుకుంటోంది. ఏ జిల్లాలో చూసినా రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. ఫలానా పార్టీ నుంచి ఫలానా నాయకుడు పోటీచేస్తున్నాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. చిన్నాచితక లీడర్లు సైతం అధికారంలోకి వచ్చే పార్టీ వైపు వెళ్లాలని తమ అంచనాల్లో ఉన్నారు. కానీ నాగర్ కర్నూల్ జిల్లా రాజకీయాలు మాత్రం కాస్తా స్తబ్దంగానే ఉన్నాయని […]

Read More
చదువుతోనే భవిత మార్పు

చదువుతోనే భవిత మార్పు

బీఎస్పీ కల్వకుర్తి ఇన్​చార్జ్ ​కొమ్ము శ్రీనివాస్ యాదవ్ సామాజికసారథి, కడ్తాల్: కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గిరిజన ఆశ్రమ పాఠశాలలో సరస్వతి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా సాగింది. హైస్కూలు హెచ్ఎం విజయ, ఎల్​ఐసీ రిటైర్డ్​ ఆఫీసర్ ​తౌర్యానాయక్​తమ సొంత ఖర్చులతో ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథులుగా ఎంపీపీ కమ్లీ నాయక్, జడ్పీటీసీ దశరథ్​ నాయక్, బీఎస్పీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​చార్జ్​ కొమ్ము శ్రీనివాస్ యాదవ్, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ చందన పాల్గొన్నారు. […]

Read More
జడ్పీటీసీ కుమారుడికి ఎంపీ, ఎమ్మెల్యే ఘననివాళి

జడ్పీటీసీ కుమారుడికి ఎంపీ, ఎమ్మెల్యే ఘననివాళి

సారథి, కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం కడ్తాల్ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ మొదటి కుమారుడు రాధాకృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, జడ్పీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కల్వకుర్తి జడ్పీటీసీ పోతుగంటి భరత్ ప్రసాద్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన స్మారకార్థం నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమనగల్లు జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్, కేశంపేట, కొత్తూరు, […]

Read More
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

కల్నల్ సంతోష్ కుమార్ త్యాగం వృథాకాదు

నివాళులర్పించిన ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సారథి, వెల్దండ: కల్నల్ సంతోష్ కుమార్ త్యాగం వృథాకాదని నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్ కొనియాడారు. చైనా, భారత సరిహద్దులో దేశరక్షణ కోసం యుద్ధరణరంగంలో అసువులుబాసిన ఆయనను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కల్నల్ సంతోష్ కుమార్ అమరత్వానికి ప్రతీకగా మంగళవారం వెల్దండ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సంతోష్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి […]

Read More
లంచం సొమ్మును కాల్చేసిన వైస్​ ఎంపీపీ

లంచం సొమ్మును కాల్చేసిన వైస్​ ఎంపీపీ

ఏసీబీకి పట్టుబడిన వెల్దండ తహసీల్దార్​, ఆయన బినామీ తహసీల్దార్​ సైదులు గౌడ్​, వెంకటయ్య గౌడ్​ అవినీతి వెలుగులోకి.. పేదల కడుపుకొట్టి.. పెద్దలకు పంచిన సదరు అధికారపార్టీ నేత సారథి, కల్వకుర్తి/వెల్దండ: ఏసీబీ అధికారులు దాడులు చేయడానికి వచ్చారని తెలుసుకుని నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ తహసీల్దార్​ బినామీ అయిన మాజీ వైస్​ ఎంపీపీ వెంకటయ్య గౌడ్​ రూ.ఐదులక్షల నోట్లను కాల్చివేశాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం కల్వకుర్తి పట్టణంలో కలకలం సృష్టించింది. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. […]

Read More