Breaking News

కలెక్టర్

25 వరకు పల్స్ పోలియో

25 వరకు పల్స్ పోలియో

సామాజిక సారథి, సంగారెడ్డి:  సంగారెడ్డి జిల్లాలో జనవరి 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులను కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ , అనుబంధ శాఖలతో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజర్షి మాట్లాడుతూ ఈ […]

Read More
కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దు

కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దు

జిల్లా కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి:  జిల్లాలో అర్హులందరూ జాప్యం చేయకుండా  వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. దేశ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున జిల్లా ప్రజలు  అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. టీకా పొందినవారికి ప్రమాదం లేదని,  రెండు డోసులు టీకా పొందినవారు సురక్షితమన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవాలన్నారు. […]

Read More
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా అడిషనల్​కలెక్టర్‌ మనుచౌదరి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం ఏడు ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More
కలెక్టర్ ఆదేశించినా పనుల్లో నిర్లక్ష్యం

కలెక్టర్ ఆదేశించినా పనుల్లో నిర్లక్ష్యం

 అసంపూర్తిగా స్మశాన వాటిక నిర్మాణాలు సామాజిక సారథి, కౌడిపల్లి: స్మశాన వాటిక పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించినా, కొంతమంది నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి పనులు పూర్తిచేయడంలో అధికారులు, సంబంధిత నాయకులు విఫలమవుతున్నారు. అన్నిచోట్ల నిర్మాణాలు పూర్తి చేసినప్పటికీ కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యంతో స్మశానవాటికల నిర్మాణాలు మందకోడిగా కొనసాగుతున్నాయి. కౌడిపల్లి మండలం వెంకటాపూర్ (ఆర్), తిమ్మాపూర్ గ్రామంలో స్మశానవాటికలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఇంతజరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి […]

Read More
‘డబుల్’ గుడ్న్యూస్!

‘డబుల్’ గుడ్​న్యూస్!

​ ఇళ్ల ప్రారంభోత్సవానికి అధికార యంత్రాంగం సన్నాహాలు అర్హుల జాబితా వెల్లడికి నిర్ణయం సంగారెడ్డి జిల్లాలో 1,367 ఇళ్లు సిద్ధం సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: పేదల ఇంటి కలను సహకారం చేసేందుకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధిలో 1,367 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. […]

Read More
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

సామాజిక సారథి, సంగారెడ్డి: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సమాజంలో సకలాంగులతో సమానంగా జీవించేలా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ రాజార్షిషా అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా మహిళ ,శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఉన్నత స్థాయిలో జీవించడానికి వికలాంగులకు అంగవైకల్యం అడ్డుకారాదని,  పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధిస్తారన్నారు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక […]

Read More
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

సామాజిక సారథి ,మెదక్ ప్రతినిధి: ఎటువంటి చిన్న పొరపాటు,  సంఘటన జరగకుండా మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గ  శాసన మండలి ఎన్నిక   ప్రశాంతంగా,  సాఫీగా జరిగేలా  చూడాలని ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య పోలింగ్ అధికారులకు సూచించారు.   ఈ నెల 10 న   మెదక్ శాసన  మండలికి  జరగగున్న ఎన్నికల సందర్భంగా గురువారం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో (9) పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వచ్చిన పోలింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, […]

Read More
పోలింగ్ సమర్థవంతంగా నిర్వర్తించాలి

పోలింగ్ సమర్థవంతంగా నిర్వర్తించాలి

నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నేడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికలో పోలింగ్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని నల్లగొండ స్థానిక సంస్థల నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ పోలింగ్ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు వచ్చిన పోలింగ్ అధికారులను  ఉద్దేశించి అదనపు  […]

Read More