Breaking News

WARANGAL

ములుగు కలెక్టరేట్ కు కొత్త వెలుగు

ములుగు కలెక్టరేట్ కు కొత్త వెలుగు

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కలెక్టరేట్ సుందరీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్యాలయం చుట్టూ గడ్డి పరిచి అందమైన పూలమొక్కలను నాటారు. ఆడిటోరియం చుట్టూ మొక్కలు నాటారు. వాహనాల పార్కింగ్ కోసం షెడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. టాయిలెట్ బ్లాక్ నిర్మాణం చేపట్టారు. నీటి ట్యాంకు, పెద్ద సంప్​నిర్మాణం పూర్తయింది. వివిధ అవసరాలకు వచ్చే ప్రజానీకానికి కార్యాలయ ఆవరణలో వెయిటింగ్​హాలును ​ఏర్పాటు చేశారు. కార్యాలయం ప్రహరీ ఎత్తు పెంచి, భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు. భద్రత, […]

Read More
ప్రైవేట్ టీచర్లను ఆదుకుందాం.. రండి

ప్రైవేట్ టీచర్లను ఆదుకుందాం.. రండి

సారథి న్యూస్, ములుగు: సమాజ విజ్ఞానాభివృద్ధికి మూలం, దైవం కన్నా మిన్న అయిన ఉపాధ్యాయులకు ప్రతిఒక్కరూ చేయూతనివ్వాలని సర్వర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవన్ లో ములుగు జిల్లా ప్రైవేట్ టీచర్లకు సర్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా […]

Read More
రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలి

రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలి

సారథి న్యూస్, తాడ్వాయి: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ ​చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడినట్లు చరిత్రలో లేదని వివరించారు. ప్రధాని మోడీ కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కయ్యారని వివరించారు. రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తాడ్వాయి మండల కేంద్రంలో రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జలపు అనంతరెడ్డి అధ్యక్షతన సంతకాల సేకరణ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఇటీవల […]

Read More
ధాన్యం కొనుగోళ్లకు రెడీ చేయండి

ధాన్యం కొనుగోళ్లకు రెడీ చేయండి

సారథి న్యూస్, మహబూబాబాద్: వానాకాలం పంట ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్​లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో వరి ధాన్యం, మక్కలు, పత్తిని కొనుగోలు చేసేందుకు అంతా రెడీ చేయాలని సూచించారు. టార్పాలిన్​ కవర్లు, తేమశాతం మిషన్లు, వేయింగ్ మిషన్లను సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు, డీఎస్​వో నర్సింగరావు, ఏపీడీ వెంకట్, డీఎంవో సురేఖ, […]

Read More
పంట ఎండింది.. గుండె మండింది

పంట ఎండింది.. గుండె మండింది

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతన్నలు వేసిన సన్నరకం వరి దోమకాటు బారినపడింది. చేసేదిలేక రైతులు బుధవారం పంటకు నిప్పంటించారు. నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామానికి చెందిన రైతు దొంతరబోయిన మధుకు చెందిన ఎకరాన్నర పొలంలో దోమకాటుకు పంట నాశనమైంది. మందులు కొట్టి పంటను బతికించుకోలేక నిప్పంటించాడు. ఈ సన్నరకం వరి వేసిన నాలాంటి రైతులు ఎందరో బలవుతున్నారని, ప్రభుత్వం స్పందించి దోమకాటుకు బలైన రైతులను ఆదుకోవాలని దొంతర బోయిన మధు, […]

Read More
9 మందిని చంపిన.. రాక్షసుడికి ఉరిశిక్ష

9 మందిని చంపిన.. రాక్షసుడికి మరణశిక్ష

సారథి న్యూస్, వరంగల్: తన క్రూరమైన ఆలోచనలతో ఒకేరోజు 9 మందిని హత్యచేసిన నిందితుడు, బీహార్​కు చెందిన సంజయ్ కుమార్ కు కోర్టు బుధవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గీసుగొండ మండలం గోర్రెకుంటలో 9మందిని హత్యచేసి బావిలో పడవేసిన ఘటన తెలిసిందే. ఫాస్ట్​ట్రాక్​ కోర్టులో విచారణ అనంతరం వరంగల్ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మృతుల వివరాలు:మహమ్మద్ మక్సూద్ ఆలం(47), మహమ్మద్ నిషా అలం(40), మహమ్మద్ బుద్రా కాటూన్(20), బబ్లూ(3), మహమ్మద్ షాబాజ్(19), మహ్మద్​సొహైల్​(18), […]

Read More
చనిపోయాడనుకున్న వ్యక్తి.. క్షేమంగా ఇంటికి

చనిపోయాడనుకున్న వ్యక్తి.. క్షేమంగా ఇంటికి

సారథి న్యూస్, ములుగు: పనికోసం ఇంటి నుంచి మూడేళ్ల క్రితం వెళ్లిన వ్యక్తి ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబం సభ్యులు అంతా ఆశలు వదులుకున్నారు. అతడు చనిపోయాడని అంతా భావించారు. కానీ బతికిబట్ట కట్టి క్షేమంగా ఇంటికి చేరాడు. ములుగు, భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ గురువారం మధ్యాహ్న సమయంలో జాకారం వెళ్తుండగా ములుగు జిల్లా గట్టమ్మ సమీపంలోని బస్టాండ్ లో ఓ వృద్ధుడు మాసిన గడ్డం, చిరిగిన బట్టలతో చలికి వణుకుతూ కనిపించాడు. అతని […]

Read More
మావోయిస్టుల దుశ్చర్య

మావోయిస్టుల దుశ్చర్య

టీఆర్ఎస్ ​నాయకుడి దారుణహత్య ఘటనను ఖండించిన ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సారథి న్యూస్, వెంకటాపురం(ములుగు): మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు.. శనివారం రాత్రి ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ​నాయకుడు మాడురి భీమేశ్వర్ రావు(50)ను దారుణంగా హతమార్చారు. రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని బయటకు పిలిచి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపారు. సంఘటన స్థలంలో మావోయిస్టులు లేఖను వదిలివెళ్లారు. ఈ సంఘటనలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ‘అధికార పార్టీలో […]

Read More