Breaking News

UTTARPRADESH

యూపీలో రేపిస్టులను ఉరితీయాలి

యూపీలో రేపిస్టులను ఉరితీయాలి

సారథి న్యూస్, కర్నూలు: దేశంలో దళిత మహిళలపై దాడులు, అత్యాచారాలు అధికమయ్యాయని, ఘటన జరిగిన వెంటనే దోషులను పట్టుకుని ఉరితీస్తే తప్పా మార్పు రాదని లీడర్స్‌ యూత్‌ సొసైటీ, దళిత ప్రజాసంఘాల నాయకులు అన్నారు. యూపీలో పదిరోజుల క్రితం ఓ దళిత యువతిని నాలుక కోసి, మెడ, నడుము విరిచి అతిదారుణంగా అత్యాచారానికి పాల్పడిన దుండగులను ఉరితీయాలని డిమాండ్ ​చేస్తూ గురువారం కర్నూలు నగరంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన నగర ఎమ్మెల్యే […]

Read More

బీజేపీకి మిత్రపక్షం షాక్​

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వ్యవసాయ రంగాల సంస్కరణ బిల్లుకు పార్లమెంట్​లో చుక్కెదురైంది. ఈ బిల్లును ఇప్పటికే విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే తాజాగా ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన శిరోమణి అకాళిదళ్​కూడా ఈ బిల్లను వ్యతిరేకింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలంటూ తమ పార్టీ ఎంపీలకు విప్​ జారీచేసింది. కాగా వ్యవసాయాన్నికొర్పొరేటీకరణ చేసేందుకు మోదీ సర్కార్​ మూడు ఆర్డనెన్స్​లన ఇటీవల తీసుకొచ్చింది. నిత్యావసర సరుకులపై ఓ ఆర్డినెన్స్‌, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే ఉద్దేశంతో మరో ఆర్డినెన్స్‌, వ్యవసాయ […]

Read More
శానిటైజ‌ర్ కోసం వ‌చ్చి గోల్ట్​షాపు లూటీ

శానిటైజ‌ర్ కోసం వ‌చ్చి గోల్ట్​షాపు లూటీ

ల‌క్నో: క‌రోనా పుణ్యమా! అని ప్రజలందరిలోనూ శానిటైజ‌ర్‌, మాస్కుల వినియోగం భారీగా పెరిగిపోయిన నేప‌థ్యంలో ఉత్తరప్రదేశ్​లోని ఓ దొంగ‌ల ముఠా దీనినే ఆస‌రాగా చేసుకుని బంగారు నగల దుకాణాన్ని లూటీ చేసింది. సాధార‌ణ క‌స్టమర్ల మాదిరిగానే న‌గ‌ల షాపులోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు అక్కడ న‌గ‌లు అమ్మే వ్యక్తి ముందు శానిటైజ‌ర్ కోసం చేయి చాచాడు. అత‌డు కూడా వ‌చ్చిన‌వారు క‌స్టమర్లు కావచ్చు అనుకుని వారి చేతికి శానిటైజ‌ర్ ద్రావ‌ణాన్ని చ‌ల్లాడు. అంతే.. ఇంత‌లోనే ఒక దొంగ […]

Read More

పసిమొగ్గను చిదిమేశారు

లక్నో: ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించినప్పటికీ స్త్రీలు, చిన్నారులపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రంలోని లకీంపూర్​లో మూడేండ్ల చిన్నారిపై దుండగులు లైంగికదాడి జరిపి.. ఆపై చిన్నారిని చంపేశారు. బుధవారం చిన్నారి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు గ్రామానికి 200 మీటర్ల దూరం మృతదేహం దొరికింది. పోస్ట్​మార్టం నిర్వహించగా లైంగికదాడి జరిగినట్టు తేలింది. ఈ సందర్భంగా చిన్నారి తండ్రి మాట్లాడుతూ.. తనపై పగతోనే దుర్మార్గులు ఈ ఘాతుకానికి పాల్పడ్డాని పేర్కొన్నారు. […]

Read More

వైద్య విద్యార్థిని దారుణహత్య

లక్నో: వైద్యవిద్యార్థిని దారుణహత్యకు గురైన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో గురువారం వెలుగుచూసింది. కొంతకాలంగా ఆమెను ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడే కిడ్నాప్​చేసి హత్యచేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈఘటనపై ప్రస్తుతం యూపీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఢిల్లీలోని శివపురి ప్రాంతానికి చెందిన డాక్టర్‌ యోగిత గౌతమ్‌(25) ఆగ్రా ఎస్‌ ఎన్‌ మెడికల్‌ కళాశాలలో గైనకాలజీ విభాగంలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. అదే కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ చదువుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించడం లేదు. […]

Read More
యోగీ స్పీచ్​ అయోధ్య

దశాబ్దాల పోరాట ఫలితమది

అయోధ్య: ఎన్నో దశాబ్దాల పోరాట ఫలితంగానే అయోధ్యలో రామమందిరం నిర్మించుకోబోతున్నామని ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోడీ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం యోగి మాట్లాడుతూ.. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అయోధ్యలో రామాలయ కల సాకారమైందని చెప్పారు. ఇక అయోధ్య ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దుకోబోతున్నదని చెప్పారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. అనంతరం ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భాగవత్​ మాట్లాడుతూ.. రామమందిరం […]

Read More
అయోధ్యపురిలో అద్భుత ఘట్టం

అయోధ్యపురిలో అద్భుత ఘట్టం

అయోధ్య: అయోధ్యపురిలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్​ భారతదేశం వేయికండ్లతో వేచిచూసిన దృశ్యం కనువిందు చేసింది. దశాబ్దాల పోరాటం ఫలించింది. 130 కోట్ల భారతీయుల కల నెరవేరింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తొలిఅడుగు పడింది. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా ప్రధాని మోదీ రామాలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజచేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూమి పూజకు ముందు ప్రధాని మోదీ హనుమాన్‌గర్హిలో పూజలు నిర్వహించారు. రాంలల్లా విగ్రహాన్ని దర్శించుకుని పూజలు […]

Read More
ఎంపీ అమర్ సింగ్ మృతి

సీనియర్‌ నేత అమర్ సింగ్ ఇకలేరు

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) సీనియర్‌ రాజకీయ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్‌ (64) శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. మార్చ్ లో చికిత్స కోసం ఆయన సింగపూర్ ఆస్పత్రికి కూడా వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అమర్‌సింగ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్‌లోని అజంఘర్‌లో అమర్‌సింగ్‌ జన్మించారు. 1996లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో చివరి సారిగా రాజ్యసభకు సమాజ్‌వాదీ పార్టీ నుంచి […]

Read More