సారథిన్యూస్, రామడుగు: పార్టీ కార్యక్రమాలకు నష్టం కలిగిస్తూ, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఓ టీఆర్ఎస్నేతపై వేటు పడింది. అతడిని పార్టీని నుంచి సస్పెండ్ చేయడంతోపాటు ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేటకు చెందిన టీఆర్ఎస్ నేత ఎడవెళ్లి మధుసూదన్‌రెడ్డి కొంత కాలంగా పార్టీకి ఇబ్బందులు తీసుకొస్తున్నారు. దీంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు గుర్తింపు రద్దు చేస్తున్నట్టు రామడుగు మండల అధ్యక్షుడు గంట్లా జితేందర్ రెడ్డి […]
సారథిన్యూస్, నాగర్ కర్నూల్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ పంచాయతీ కార్యదర్శిని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ సస్పెండ్ చేశారు. బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామపంచాయతీలో సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ కొంతకాలంగా విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విచారణ చేపట్టిన కలెక్టర్ రాజశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
సారథి న్యూస్, నకిరేకల్: తన సమస్యను పరిష్కరించాలని పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళతో అసభ్యంగా వ్యవహరించిన నకిరేకల్ హెడ్ కానిస్టేబుల్ రఘును నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాధ్ ఆదేశాలు ఆదివారం జారీ చేశారు. తనను వేధిస్తున్న తన భర్త నుంచి తనకు రక్షణ కల్పించాలని, తన సమస్యను పరిష్కరించాలని నకిరేకల్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఒక మహిళతో హెడ్ కానిస్టేబుల్ రఘు అసభ్యంగా ప్రవర్తించినట్లుగా వచ్చిన సమాచారం మేరకు విచారణ జరపి సస్పెండ్ చేసినట్లు […]
సారథిన్యూస్, వంగూర్: విధుల్లో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ అయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజుగౌడ్ విధుల్లో నిర్లక్ష్యం వహించారు. విధులకు సరిగ్గా హాజరుకావడం లేదని.. ప్రజలను పట్టించుకోవడం లేదని అతడిపై ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ చేపట్టిన కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా.. కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరితోపాటు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తే […]
సారథి న్యూస్, సూర్యాపేట: మద్యం సేవించి విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డుపై వేటుపడింది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం అర్ధరాత్రి ఎస్పీ భాస్కరన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో అతిగా మద్యం సేవించారని తేలడంతో ముగ్గురు పోలీస్ సిబ్బందిని ఎస్పీ సస్పెండ్ చేశారు.