సారథిన్యూస్, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో పోలీసులు మంగళవారం పేకాటస్థావరంపై దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి సుమారు రూ. 60 వేలు స్వాధీనం చేసుకున్నారు. శాంతినగర్‌లోని జమ్మలమడుగు కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీచేయగా 9 మంది పేకాట ఆడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
సారథిన్యూస్, నిజామాబాద్: కరోనాతో జనాలు ఇబ్బందులు పడుతుంటే.. ఇదే అదనుగా చేసుకొని నిజామాబాద్ జిల్లాలో మెడికల్ దుకాణాలు దోపిడీ పర్వానికి తెరలేపాయి. కరోనా మందులను ఎమ్మార్పీ కంటే రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చాలా చోట్ల కృత్రిమ కొరత సృష్టించి పేదప్రజలను నిలువునా ముంచుతున్నారు. ప్రజలు వైద్యం కోసం ఉన్న బంగారం, ఆస్తులు అమ్ముకుంటున్నారు. కాగా ఈ దోపిడీ దందాపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. జిల్లాలోని మెడికల్ షాపులను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ […]
సారథిన్యూస్, చేవెళ్ల: అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీబీగూడెం వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టగా సుమారు రూ. 2 లక్షల 45 వేల విలువైన గుట్కాప్యాకెట్లు పట్టుబడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులు గుట్కా ప్యాకెట్లను హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీబీగూడెనికి తీసుకెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకొని కారును సీజ్ చేసినట్టు […]
సారథిన్యూస్, రామగుండం: ఓ రాజకీయనాయకుడి ఇంట్లో దర్జాగా పేకాట ఆడుతున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని వారినుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లోని వైస్‌ఎంపీపీ ఇంట్లో కొందరు పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిపై దాడిచేసి 11 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. లక్షా నలబైవేల నగదు, 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో పలువురు మాజీ […]
జార్ఖండ్: లిక్కర్ఫ్యాక్టరీని తనిఖీ చేయడం పోలీసులకు తలనొప్పులు తెచ్చింది. సదరు లిక్కర్ ఫ్యాక్టరీ యజమానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఇప్పుడు తనిఖీకి వెళ్లిన 42 మంది పోలీసులు కరోనా వచ్చిందేమోనని భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని కోడేర్మా జిల్లాకు చెందిన 45 మంది పోలీసులు శనివారం అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ లిక్కర్ ఫ్యాక్టరీపై రైడ్ చేశారు. వాళ్లలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఆ కేసులో అరెస్టైన వ్యక్తికి […]
సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వివిధ గ్రామాల్లో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజులుగా వివిధ గ్రామాల్లో సోదాలు చేపట్టారు. అక్రమంగా విక్రయిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 22, 600 విలువ గల గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మోతే గ్రామానికి చెందిన తిరుపతి, పుదారి శ్రీనివాస్, లక్ష్మీపూర్‌కు చెందిన సురేశ్, గుండికి చెందిన చిట్ల మునీందర్లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనూష వెల్లడించారు.
సారథిన్యూస్, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి గ్రామంలోని రెండు దుకాణాల్లో రూ. లక్షా డెబ్బైవేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను జడ్చర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బాదేపల్లికి చెందిన దొంతుల విజయ్, మహేశ్‌గా గుర్తించారు. వారిని అదుపులోకి కేసు నమోదు చేశారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.