సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శనగర్ గ్రామం నుంచి గంగాధర వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. ఇటీవల, గతంలో కురిసిన వర్షాలకు చిత్తడిగా మారింది. రోడ్డు పొడవునా గుంతలు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా పాలకులు పట్టించకొని మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
సారథి న్యూస్, రామడుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైకాలజిస్టులను గుర్తించాలని కరీంనగర్ సైకాలజిస్ట్‌ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సుంకె రవిశంకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్తాయిలో సైకాలజీ కౌన్సిల్ ఏర్పాటుచేయలని కోరారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించారు.
సారథిన్యూస్, రామడుగు: మోతే రిజర్వాయర్ నిర్మాణంపై అవగాహన లేకే కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని సింగల్‌విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్రావు విమర్శించారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగులో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను విమర్శించే స్థాయి మేడిపల్లి సత్యానికి లేదని పేర్కొన్నారు. మోతే రిజర్వాయర్ తూముల గురించి సరైన అవగాహన లేకుండా సత్యం నోటికొచ్చిన ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే సహించేది లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు గంట్లా […]
సారథిన్యూస్, రామడుగు: నిర్వాసితులకు పరిహారం ఇప్పించడంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విఫలమయ్యారని టీడీపీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి ఆరోపించారు. నారాయణపూర్ రిజర్వాయర్ కోసం ఎందరో పేదలు ఇండ్లు, భూములు కోల్పోయారని ఎమ్మెల్యే రవిశంకర్ కనీసం వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బుధవారం జోజిరెడ్డి నేతృత్వంలోని టీడీపీ బృందం గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించి.. బాధిత కుటుంబాలను పరామర్శించింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి జంగం అంజయ్య, గంగాధర మండల […]
సారథి న్యూస్, రామడుగు: మోతె రిజర్వాయర్‌కు ఎట్టకేలకు అనుమతి లభించింది. పనులు వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో నిర్మిస్తున్న మోతె రిజర్వాయర్‌కు గతేడాది జూన్‌లో టెండర్లు పిలిచారు. త్వరలోనే పనులను ప్రారంభించనున్నారు. రూ.180కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. రామడుగు, గంగాధర చొప్పదండి మండలాల్లో దాదాపు 30వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే రవిశంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక […]
సారథిన్యూస్, రామడుగు: రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ఓ మహోద్యమంలా సాగుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంటలో ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతిఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, తల్లపల్లి సుజాత శ్రీనివాస్, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, రామడుగు: ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మాల్యాల, నూకపల్లి, మానాల క్లస్టర్లలో ఆయన రైతు వేదికల నిర్మాణాలకు జగిత్యాల కలెక్టర్ గొగులోత్ రవితో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 750 కోట్లతో రైతు కల్లాలు. ఏర్పాటు చేశామని చెప్పారు. రైతును రాజుగా చూడాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని భావించారు.
సారథిన్యూస్, రామడుగు/ గంగాధర: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రూ. 15 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. కాగా గంగాధర మండలం కొండయ్యపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గురువు చెట్టుపల్లి కొండయ్య అనారోగ్యంతో మృతిచెందారు. వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కల్గెటి […]