సామాజిక సారథి, ఆర్కేపురం: (మహేశ్వరం): రాష్ట్ర ప్రభుత్వం అభివృద్దిని చూసి బీజేపీ ఓర్వట్లేదని మహేశ్వరం నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ అన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి, ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ తెలంగాణ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను చూసి ఓర్వలేక బీజేపీ పార్టీ తెలంగాణపై కుట్ర చేస్తుందని […]
– బీమాను అందజేసిన బ్యాంక్ మేనేజర్ సునీత సామాజిక సారథి, యాచారం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష బీమా యోజన పథకాన్ని ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని నందివనపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) మేనేజర్ సునీత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని నందివనపర్తి ఎస్ బీఐ బ్యాంకులో అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన కందికంటి చంద్రమ్మకు బ్యాంక్ ఖాత ఉందన్నారు. సదరు మహిళ 17 […]
సామాజిక సారథి, నకిరేకల్: చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉత్తరం రాశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నేడు సిరిపురం చేనేత సహకార సంఘం సభ్యులు, నాయకుల ఆధ్వర్యంలో పోస్ట్ కార్డుని రాశారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై 5శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ఉత్తరంలో పేర్కొన్నారు. చేనేత కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, […]
ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించాలి పరీక్షలు, ఆక్సిజన్బెడ్ల సంఖ్యను పెంచాలి దివ్యాంగులు, గర్భిణులకు వర్క్ ఫ్రం హోం ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ సమీక్ష న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా, ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్ పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమావేశయ్యారు. యుద్ధ ప్రాతిపదికన వయోజనులందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్, చికిత్సపై శాస్త్రీయ పరిశోధన మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ […]
రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తును 10వరకు నిలిపివేయాలి పంజాబ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం పంజాబ్ పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రతపర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన పర్యటనలో భద్రతా లోపాలపై వస్తున్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన రికార్డులను సురక్షితంగా భద్రపరచవలసిన జవాబుదారీతనం, బాధ్యతలను […]
చిత్తరంజన్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ రెండో క్యాంపస్ వీడియో కాన్ఫరెన్స్ద్వారా ప్రారంభించిన ప్రధాని మోడీ కోల్‌కతా: దేశంలోని ప్రతి పౌరుడికి అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేసే దిశగా మరో అడుగు వేశామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. తద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు, ఎవరైనా కేన్సర్‌తో పోరాడుతున్న వారికి ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడంతో దేశం ఈ సంవత్సరాన్ని ప్రారంభించిందని ప్రధాని మోడీ అన్నారు. అదే సమయంలో ఈ ఏడాది […]
యువత కోసంకొత్త జాతీయ విద్యా విధానం అగర్తలాలో ప్రధాని నరేంద్రమోడీ అగర్తలా: భారత్అందరి కృషితో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. దేశంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయని కొన్ని రాష్ట్రాలు ప్రాథమిక సౌకర్యాల కోసం తహతహలాడుతున్నాయి, ఈ అసమతుల్య అభివృద్ధి మంచిది కాదన్నారు. మంగళవారం త్రిపురలోని అగర్తలాలో ఆయన పర్యటించారు. రూ.450 కోట్లతో నిర్మించిన మహారాజా బిర్ బిక్రమ్ విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. దీంతో పాటు ముఖ్యమంత్రి త్రిపుర గ్రామ సమృద్ధి […]
ప్రధాని నరేంద్రమోడీ సెటైర్ యూపీలో స్పోర్ట్స్యూనివర్సిటీకి శంకుస్థాపన మీరట్: ఒకప్పటి నేరస్తుల గడ్డ త్వరలో క్రీడాకారులకు అడ్డాగా మారబోతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గతంలో నేరస్తులు మీరట్ పరిసర ప్రాంతాల్లో ‘ఖేల్ ఖేల్’ అంటూ సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుకునేవాళ్లని, యోగి ఆదిత్యానాథ్ప్రభుత్వం వచ్చాక ఆ నేరస్తులంతా ఇప్పుడు ‘జైల్ జైల్’ అంటూ ఊసలు లెక్కబెడుతున్నారని సెటైర్లు వేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సర్ధనలో ప్రధాని నరేంద్రమోడీ స్పోర్ట్స్ యూనివర్శిటీకి ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.700 కోట్లతో దాదాపు 92 […]