Breaking News

ఎస్బీఐలో తక్కువ ప్రీమియంతో అధిక బీమా

ఎస్ బీఐలో తక్కువ ప్రీమియంతో అధిక బీమా

– బీమాను అందజేసిన బ్యాంక్ మేనేజర్ సునీత

సామాజిక సారథి, యాచారం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష బీమా యోజన పథకాన్ని ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని నందివనపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) మేనేజర్ సునీత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని నందివనపర్తి ఎస్ బీఐ బ్యాంకులో అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన కందికంటి చంద్రమ్మకు బ్యాంక్ ఖాత ఉందన్నారు. సదరు మహిళ 17 జూలై 2022న అనారోగ్యంతో మృతి చెందిందన్నారు. బీమా ప్రీమియం చెల్లించిన సందర్భంగా నామినిగా ఉన్న కందికంటి నాగమణికి రూ.2లక్షల బీమా చెక్కును అందజేశారు. నాగమణి తల్లిదండ్రులు మృతి చెందడంతో కూతుర్లుకు జీవితాల్లో మేలు జరిగిందని భావిస్తున్నారు. జీవన్ జ్యోతి బీమా యోజన 18 నుంచి 50 సంవత్సరాల వయసు వరకు, సురక్ష బీమా యోజన 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్న స్త్రీ, పురుషులు అర్హులని చెప్పారు.