Breaking News

రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వట్లేదు

రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వట్లేదు

సామాజిక సారథి, ఆర్కేపురం: (మహేశ్వరం): రాష్ట్ర ప్రభుత్వం అభివృద్దిని చూసి బీజేపీ ఓర్వట్లేదని మహేశ్వరం నియోజకవర్గ  టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ అన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి, ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ తెలంగాణ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను చూసి ఓర్వలేక బీజేపీ పార్టీ తెలంగాణపై కుట్ర చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందితే తమ పార్టీకి పుట్టగతులు ఉండవని కేసీఆర్ ప్రభుత్వాన్ని దెబ్బతిసే కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయలేరన్నారు. ఈ కార్యక్రమంలో ఖిల్లా మైసమ్మ దేవస్థాన చైర్మన్ గొడుగు శ్రీనివాస్, డివిజన్ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్, నాయకులు సాజీద్, కొండ్ర శ్రీనివాస్, కంచర్ల శేఖర్, దుబ్బాక శేఖర్, జగన్మోహన్ రెడ్డి, దేవేందర్, జహీద్, జగన్, ఇస్మైల్, ఆఫ్సర్, నయీమ్, వేణు, దీపు, మహిళ అధ్యక్షురాలు ఊర్మిళ, సునీత పటేల్, మాదవి, యాదమ్మ, సైదా, పుష్పమ్మ, అనురాధ, రుక్వియా, జయమ్మ తదితరులున్నారు.