Breaking News

POLICE

గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

సారథిన్యూస్​, మహబూబ్​నగర్ : మహబూబ్​నగర్​ జిల్లా బాదేపల్లి గ్రామంలోని రెండు దుకాణాల్లో రూ. లక్షా డెబ్బైవేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను జడ్చర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బాదేపల్లికి చెందిన దొంతుల విజయ్, మహేశ్​గా గుర్తించారు. వారిని అదుపులోకి కేసు నమోదు చేశారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.

Read More

రిథమిక్​ ట్రైనింగ్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: పోలీసులకు ట్రైనింగ్‌లో శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే శరీరానికి అలుపు రాకుండా శిక్షణ ఇస్తున్నారు ఓ పోలీస్​ ఆఫీసర్​. పాటకు లయబద్ధంగా చేయిస్తున్న కసరత్తు ఆకట్టుకుంటోంది. తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో ట్రైనీ పోలీసులకు శిక్షణ ఇస్తున్న అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పాటతో రిథమిక్​గా శిక్షణ ఇస్తున్నారు. ట్రైనీ పోలీసులకు శిక్షణ కఠినంగా అనిపించకుండా ఉండేందుకు పాటలు పాడుతూ శిక్షణ ఇస్తుంటారు. 1970లో వచ్చిన హమ్‌జోలీ […]

Read More
కానిస్టేబుల్​ను సన్మానిస్తున్న పోలీసులు

కానిస్టేబుల్​కు వీడ్కోలు

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్ కు బదిలీ కావటంతో స్టేషన్ ఆవరణలో అతడికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్​ను పోలీస్​సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై అనూష మాట్లాడుతూ, శ్రీకాంత్​ విధి నిర్వహణలో సమర్థంగా పనిచేసేవాడని చెప్పారు. కీలకమైన కేసుల్లో చాకచక్యంగా వ్యవహరించాడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

ఐదుగురు మావోల లొంగుబాటు

సారథిన్యూస్​, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎదుట శనివారం ఐదుగురు మావోయిస్టు దళసభ్యులు లొంగిపోయారు. చింతూర్​ సబ్​డివిజన్​ పరిధిలోని ఎటపాక పోలీస్​స్టేషన్​లో ఎస్పీ సమక్షంలో వీరు లొంగిపోయారు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కోరారు. వారికి ప్రభుత్వం తగిన పరిహారం అందజేయటంతోపాటు ఉపాధి కూడా కల్పిస్తుందని చెప్పారు.

Read More

కరోనాతో ఖాకీల పోరాటం

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా వైరస్ హైదరాబాద్ పోలీస్ శాఖలో భయం పుట్టిస్తోంది. డిపార్ట్​మెంట్​లో పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఏడుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, శుక్రవారం ఆ సంఖ్య 15కు చేరింది.. ఇప్పటి వరకు బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోనే 15 మంది పోలీసు అధికారులకు కరోనా సోకడంతో ఖాకీలు హడలిపోతున్నారు. మూడు రోజుల నుంచి మెడికల్​ టెస్టుల్లో వరుసగా కరోనా కేసులు […]

Read More

కరోనా లక్షణాలుంటే లీవ్​ తీసుకోండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా(కోవిడ్​–19) వైరస్ బారిన పడుతున్న పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మరింత అప్రమత్తమైంది. అనారోగ్యంతో బాధపడుతున్న పోలీసు అధికారులు, సిబ్బంది విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని, తద్వారా కొందరు పోలీసులు వైరస్ బారిన పడ్డారని వెల్లడించారు. డ్యూటీలో ఉన్న పోలీసులు అధికారులు, సిబ్బంది కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే సెలవు పెట్టాలని […]

Read More

పోలీసులకు మాస్కు​లు పంపిణీ

సారథి న్యూస్​, గోదావరిఖని: కరోనా వైరస్​ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్​ డౌన్​ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రెని హాస్పిటల్ కరీంనగర్ డాక్టర్ బంగారి స్వామి, డాక్టర్ శంకర్​నాథ్ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. పోలీసులు విపత్కకర సమయంలో ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు.

Read More
కొడుకులు పట్టించుకుంటలేరు

కొడుకులు పట్టించుకుంటలేరు

సారథి న్యూస్, హుస్నాబాద్ : ‘ నా కుమారులు నన్ను పట్టించుకోవడం లేదని హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామానికి చెందిన తాడూరి దుర్గయ్య’ అనే వృద్ధుడు మంగళవారం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.. సందర్భంగా ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ కనిపెంచిన తల్లిదండ్రులను సంరక్షించాల్సిన బాధ్యతను పిల్లలు విస్మరించరాదని సూచించారు. కన్నవారు వృద్ధాప్యంలో ఉంటే వారి బాగోగులు కుమారులే చూసుకోవాలన్నారు. తల్లిదండ్రుల ఇబ్బందులకు గురి చేస్తే వారిచ్చే ఫిర్యాదు మేరకు కుమారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వృద్ధుడి […]

Read More