న్యూఢిల్లీ: ఇండియా, చైనా మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, మూడో పార్టీ జోక్యం వద్దని చైనా చెప్పింది. రెండు దేశాలు సమస్యను పరిష్కరించుకోగలవని దీమా వ్యక్తం చేసింది. ఇండియా, చైనా మధ్య నెలకొన్ని బోర్డర్ ఇష్యూను మధ్యవర్తిగా ఉండి తాను పరిష్కరిస్తానని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో చైనా ఫారెన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి లిజాంగ్ సమాధానం చెప్పారు. ‘ఈ సమస్యను ఇండియా, చైనా సామరస్యంగా పరిష్కరించుకుంటాయి. మూడో వ్యక్తి జోక్యం చేసుకోవాల్సిన […]
మంగళూరు: కరోనా వస్తుందనే భయంతో దుబాయ్ నుంచి వచ్చిన గర్భిణికి కరోనా నెగటివ్ వచ్చినప్పటికీ అపార్ట్మెంట్లోకి రానీయకపోవడంతో ఆమె తన బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. మంగళూరుకు చెందిన ఒక మహిళ ఈనెల 12న వందే భారత్ ఫ్లైట్‌లో ఇక్కడికి వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లి కరోనా రిజల్ట్ నెగటివ్ వచ్చిన తర్వాత తన సొంత ఇంటికి వెళ్లారు. అపార్ట్మెంట్లోని వారు ఆమెను అనుమతించలేదు. ఈ టెంక్షన్లో ఆమె ఆరోగ్యం […]
నాగర్ కర్నూల్ జడ్పీ చైర్పర్సన్ పద్మావతి సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని నాగర్ కర్నూల్ జడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి అధికారులకు సూచించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని డీకేఆర్ ఫంక్షన్ హాల్ లో జడ్పీ జనరల్ బాడీ మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. త్వరలోనే జడ్పీ ఆఫీసు పనులు పూర్తయి ప్రారంభించుకుంటామని చెప్పారు. కలెక్టర్ ఈ.శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు కేవలం రెండు కేసులు మాత్రమే పాజిటివ్ […]
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సారథి న్యూస్,నాగర్ కర్నూల్: అద్భుత తెలంగాణ ఆవిష్కరణకు నూతన వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నియంత్రిత సాగు విధానంపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దశాబ్దకాలం తర్వాత ప్రపంచ వ్యవసాయ చిత్రపటంలో తెలంగాణ ఉంటుందన్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో వేరుశనగ నుంచి మంచి […]
సారథి న్యూస్, హుస్నాబాద్: సీఎం కేసీఆర్ కు గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ కట్టపై కుర్చీవేశామని, కూర్చొని ప్రాజెక్టును పూర్తిచేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. మిడ్ మానేరు నుంచి గౌరవెల్లి ప్రాజెక్టులోకి రెండు చిన్న చిన్న లింకులను కలిపితే 12 కి.మీ. సొరంగ మార్గం ద్వారా ప్రాజెక్టులోకి నీళ్లు వస్తాయన్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం గౌరవెల్లి, గండిపల్లి భూ నిర్వాసితులకు సకాలంలో […]
మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సారథి, న్యూస్, మహబూబ్ నగర్: మహిళలు ఆర్థికంగా ఎదగాలని, అందుకోసమే మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీలేని లోన్లు ఇస్తోందని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పాలమూరు జిల్లా స్వయం సహాయక సంఘం మహిళలు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు ఎగ్జిబిషన్ ను శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే మహబూబ్ నగర్ లో వెయ్యి ఎకరాల స్థలంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ […]
సారథి న్యూస్, గోదావరిఖని: విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణ తప్పినందుకు ఏఆర్ కానిస్టేబుల్ ఎండీ షబ్బీర్ ను సస్పెండ్ చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.
సారథి న్యూస్, గోదావరిఖని: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రెని హాస్పిటల్ కరీంనగర్ డాక్టర్ బంగారి స్వామి, డాక్టర్ శంకర్నాథ్ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. పోలీసులు విపత్కకర సమయంలో ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు.